ఈమధ్య సీక్వెల్ కథల జోరు ఎక్కువగా కనిపిస్తోంది. అయితే యాక్షన్, క్రైమ్, థ్రిల్లర్, హారర్ చిత్రాలకు సీక్వెల్ చూశాం. ఇప్పుడు లవ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొదలైపోయింది. ఇటీవల మలయాళంలో సూపర్ హిట్ అయిన లవ్ స్టోరీ… ‘ప్రేమలు’. తెలుగులోనూ విడుదలై మంచి విజయాన్ని అందుకొంది. రాజమౌళి తనయుడు కార్తికేయ ఈ చిత్రాన్ని తెలుగులో అందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు `ప్రేమలు 2`కి రంగం సిద్ధమైంది. ఈ చిత్రాన్ని కూడా తెలుగులో కార్తికేయ విడుదల చేస్తారు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ప్రేమలు టీమ్ అంతా కలిసి.. ఈ సీక్వెల్ కోసం పని చేయబోతున్నారు. 2025 వేసవిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రేమలు సినిమా హీరో, హీరోయిన్లు కలుసుకోవడంతో ముగుస్తుంది. వారిద్దరూ పెళ్లి చేసుకొన్న తరవాత ఏం జరిగిందన్నది ప్రేమలు 2లో చూడొచ్చు. మలయాళంలో హిట్ టాక్ వచ్చిన తరవాత… తెలుగులో విడుదల చేశారు. ఈసారి రెండు భాషల్లోనూ ఒకేసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.