22 ఏళ్ళ క్రితం ప్రభు దేవా హీరోగా పరిచయమైన బ్లాక్ బస్టర్ మూవీ ‘ప్రేమికుడు’ అదే టైటిల్ తో డిజి పోస్ట్ సమర్పణ లో ఎస్ ఎస్ సినిమా బ్యానర్ పై ‘కళా’ సుదీప్ బి ఏ దర్శకత్వంలో మానస్, సనమ్ శెట్టి హీరో హీరోయిన్లు గా తెరకెక్కుతున్న చలన చిత్రం ‘ప్రేమికుడు’ ప్రస్తుతం చివరి షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ చిత్రం వాలటైన్ డే సందర్భం గా టీజర్ విడుదల చేయనున్నారు.
చిత్ర దర్శకుడు ‘కళా’ సుదీప్ బి ఏ మాట్లాడుతూ …ప్రేమికుల రోజు న మా ప్రేమికుడు టీజర్ రిలీజ్ చేస్తున్నాము. లవ్ బ్యాక్ డ్రాప్ లో హృదయానికి హద్దుకునే ఫీల్ గుడ్ మూవీ లా చితికరిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరి లైఫ్ లో ప్రేమ అనేది మర్చిపోలేని అనుభూతి. అలాంటి ఒక అందమైన ప్రేమకధే ప్రేమికుడు ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకి వినూత్న కథా కథనం, విసువల్ బ్యూటీ, చక్కని సంగీతంతో ఆహ్లాదంగా సాగిపోయే యూత్‌ఫుల్ లవ్ స్టోరీ అవుతుందని చెప్పారు. ఈ కథలోని పాత్రలలో ప్రస్తుత యువత తమని తాము చూసుకుంటారని, తమ స్వత్చమైన ఫీలింగ్స్ కి అద్దంలా ఉంటుందని చెప్పారు.
నిర్మాత కె లక్ష్మి నారాయణ రెడ్డి మాట్లాడుతూ లాస్ట్ షెడ్యూల్ ఆంధ్ర ప్రదేశ్ లోని పలు కొత్త లొకేషన్స్ లో షూటింగ్ పూర్తి చేసుకున్నామని చెప్పారు. అంతకు ముందు హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంది. దర్శకుడు ‘కళా’ సుదీప్ బి ఏ ప్రేమికుడిని, ఈ ప్రేమ కథని ఎంచుకుని చాలా అందంగా యువతకి కనెక్ట్ అయ్యేలాగా తీర్చి దిద్దుతున్నారు. సహా నిర్మాత వరికుంట్ల సురేష్ బాబు మాట్లాడుతూ’ ప్రస్తుతం ఈ చివిరి షెడ్యూల్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుందని, త్వరలో ఆడియో లాంచ్ కి సన్నాహాలు’ జరుగుతున్నాయని తెలిపారు.
ఈ చిత్రానికి విజయ్ బాలాజీ సంగీతాన్ని సమకూర్చగా,శివ కె ఛాయాగ్రహణం, ఎడిటింగ్’ కేరింత’ మధు, అర్ కె డాన్సు డైరెక్టర్ గా వ్యవహరించా నున్నారు.