ఆంధ్రప్రదేశ్ పోలీసులకు బ్యాడ్ టైం కొనసాగుతోంది. వరుసగా సీబీఐ విచారణలకు తోడు… రాజకీయ కారణాలతో ప్రాథమిక హక్కులను హరిస్తున్నారన్న ఫిర్యాదులు రాష్ట్రభవన్ వరకూ వెళ్లాయి. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీస్ స్టేషన్లో ప్రసాద్ అనే యువకుడికి కొద్ది రోజుల కిందట శిరోముండనం చేశారు. దానికి కారణం.. వైసీపీ నేత అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను అడ్డుకోవడమే. దానికి సంబంధించిన వీడియోలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటన దళితుల్లో తీవ్ర ఆగ్రహం కలిగించడంతో ప్రభుత్వం .. ట్రైనీ ఎస్ఐగా ఉన్న ఫీరోజ్ షాను అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు కానిస్టేబుళ్లపై కేసు పెట్టి అరెస్ట్ చూపించారు.
అయితే.. అసలు పోలీసులకు శిరోముండనం చేయాల్సిన అవసరం ఏముందని.. వైసీపీ నేతలే చేయించారని.. వారిపై తక్షణం కేసులు పెట్టి..చర్యలు తీసుకుని న్యాయం చేయాలని ప్రసాద్ పోరాడుతున్నారు. ఆయనకు న్యాయం జరగకపోవడంతో.. తాను నక్సలైట్లలో చేరేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్రపతికి లేఖ రాశారు. ఈ లేఖపై.. రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. దళిత యువకుడికి శిరోముండనం చేయడమే కాకుండా.. న్యాయం కూడా అందరని పరిస్థితిలు ఏపీలో ఉన్నాయన్న భావనకు వచ్చి.. తక్షణం విచారణాధికారిని నియమించింది. తీసుకుంది. విచారణాధికారిగా అసిస్టెంట్ సెక్రటరీ జనార్దన్‌బాబును నియమించారు. జనార్దన్‌బాబును కలవాలని బాధితుడు ప్రసాద్‌కు రాష్ట్రపతి కార్యాలయం సూచించింది.
తన దగ్గర ఉన్న కాల్ రికార్డ్స్, వీడియో క్లిప్స్‌తో జనార్దన్‌బాబును కలవాలని బాధితుడు ప్రసాద్ నిర్ణయించుకున్నారు. కొద్ది రోజుల కిందట.. అక్రమంగా యువకుల్ని నిర్బంధించిన కేసులో ఢిల్లీలో ఏపీ పోలీసులపై కేసు నమోదైంది. తాజాగా పోలీసులు వ్యవహరించిన తీరుపై రాష్ట్రపతి భవన్ స్పందించింది. పలు చోట్ల.. వైసీపీ నేతలకు బదులు పోలీసులపైనే కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. అయినా పోలీసు శాఖ అసలైన నిందితులపై చర్యలు తీసుకోవడానికి సాహసించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.