ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవికి దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి పేరును ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఖరారు చేశారు. శ్రీనాథ్ రెడ్డి 2014 నుంచి సాక్షి పొలిటికల్ సెల్‌కు సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. శ్రీనాథరెడ్డి కడప జిల్లా పులివెందులకు చెందిన వారు. 28 ఏళ్ల పాటు ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికలకు పని చేశారు. ఏపీయూడబ్ల్యూజేతో పాటు.. రాయలసీమ హక్కుల కోసం.. ఆయన సమావేశాలు నిర్వహించేవారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడల్లా ఆయన యాక్టివ్‌గా రాయలసీమ ఉద్యమం చేసేవారు. వైఎస్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటి నుండి పోరాడారు. ఆ తర్వాతా ఆ ఒరవడి కొనసాగించారు. రాష్ట్ర విభజన తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీనియర్ జర్నలిస్టు వాసుదేవ దీక్షితులుకు ప్రెస్ అకాడమీ ఛైర్మన్ గా అవకాశం ఇచ్చారు. ఇప్పుడా పదవికి శ్రీనాథ్ రెడ్డికి జగన్ ఇచ్చారు.
చాలా కాలంగా.. లాయల్‌గా పని చేస్తున్నప్పటికీ.. ప్రముఖ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకు… ఊరించి.. ఊరించి ఊసురుమనిపించేలా… షాక్ ఇచ్చారు.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవి ఆయనకేనంటూ.. కొద్ది రోజులుగా మీడియాకు సైతం ప్రభుత్వ వర్గాల నుంచి లీకులు వచ్చాయి. ఇప్పటికే సాక్షిలో ఉన్న సీనియర్ జర్నలిస్టులందరికీ.. అవకాశం కల్పించినప్పటికీ.. కొమ్మినేనిని మాత్రం పట్టించుకోలేదు. దాంతో.. ఆయనకు ఆ పదవి ఇస్తారని అనుకున్నారు. కానీ చివరికి ఆ పదవిని.. సొంత ప్రాంతానికి చెందిన శ్రీనాథ్ రెడ్డికి ఇవ్వడంతో కొమ్మినేనికి షాక్ తగిలినట్లయింది.
ఏపీ సీఎం… పదవులన్నీ.. అయితే బంధువర్గం.. లేకపోతే.. సాక్షి మీడియాలో పని చేస్తున్న వారికి ఇస్తూ వస్తున్నారు. ముఖ్యమంత్రి మీడియా సలహాదారుడిగా పదవితో పాటుగా సీపీఆర్వో.. అదే విధంగా జాతీయ స్థాయిలో మీడియా రిలేషన్స్ బాధ్యతలు..ఇక పబ్లిక్ పాలసీ సలహాదారుడి హోదా వంటివి తమ సొంత మీడియా సంస్థలో పని చేసిన వారికి కట్టబెట్టారు. ఇక మంత్రుల పీఆర్వోలు కూడా.. సాక్షి నుంచే వచ్చారు. ఈ కారణంగానే… శ్రీనాథ్ రెడ్డికి అవకాశం ఇస్తున్నట్లుగా… వైసీపీ వర్గాలు చెబుతున్నాయి కానీ… శ్రీనాథ్ రెడ్డి కూడా.. సాక్షి మీడియా గ్రూప్‌లో ఉద్యోగినే.