” మంత్రిమండలి కూర్పులో కూడా ఇబ్బంది ఎదురుకాలేదు. కానీ టీటీడీ బోర్డు సభ్యుల ఎంపికలో మాత్రం.. ఒత్తిళ్లు తట్టుకోలేనంతగా వస్తున్నాయని”.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి .. కేబినెట్ సమావేశంలో..వ్యాఖ్యానించారు. వివిధ వర్గాల నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక సభ్యుల సంఖ్యను అమాంతం.. 25కి పెంచడానికి కేబినెట్లో తీర్మానం చేయాల్సి వచ్చిందని… జగన్మోహన్ రెడ్డి చెప్పకనే చెప్పారు. అయితే.. ఈ పదవుల కోసం… జగన్ పై అంత తీవ్రంగా ఒత్తిడి చేసిందెవరన్నదానిపై… ఆసక్తికర చర్చ.. వైసీపీ వర్గాల్లో ప్రారంభమయింది.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి… అన్నీ ఫటా ఫట్ నిర్ణయాలు తీసుకుంటారు. అందర్నీ సంతృప్తి పరచాలని.. బుజ్జగించాలని అనుకోరు. అలా చేస్తే.. వారు మరింత బెట్టు చేసే అవకాశం ఉందని.. వైఎస్ జగన్ కు బాగా తెలుసు. అందుకే.. ఎవరెవరికి పదవలు ఇవ్వాలో.. ఎవరెవరికి టిక్కెట్లు ఇవ్వాలో.. ఆయన ఓ అవగాహనకు వచ్చిన తర్వాత .. ఎవరి అభిప్రాయం తీసుకోరు. అనుకున్నది అనుకున్నట్లుగా పదవులు ఇచ్చేస్తారు. మంత్రి పదవుల విషయంలో… ఆయన అనేక సీనియర్లను అసువుగా పక్కన పెట్టేసిన విషయం ఇంకా ఎవరూ మర్చిపోలేదు. అయితే.. జగన్మోహన్ రెడ్డి మాత్రం.. ఏ నిర్ణయం తీసుకోలేక.. తీవ్ర ఒత్తిడికి గురవుతుంది మాత్రం… శ్రీవారి సేవకుల నియామకం విషయంలోనే.
నిజానికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో… పదవులు దక్కని ఎమ్మెల్యేలకు ఎక్కువగా అవకాశం కల్పిస్తూంటారు. కానీ.. శ్రీవారికి సేవ చేయవచ్చన్న సంకల్పమో.. మరో కారణమో కానీ… పారిశ్రామిక వర్గాల నుంచి కూడా.. పెద్ద ఎత్తున ప్రభుత్వంపై ఒత్తిళ్లు వస్తున్నాయి. స్వయంగా పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలు… ఇతురల కోసం సిఫార్సు చేయడం కాకుండా.. తమకే చోటివ్వాలని ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తెస్తున్నారు. తెలంగాణ నుంచి మైహోమ్ రామేశ్వరరావు, ఇండియా సిమెంట్స్ శ్రీనివాసన్ లాంటి వాళ్లు కూడా.. ఈ జాబితాలో ఉన్నారంటే… జగన్ పై ఏ స్థాయి ఒత్తిళ్లు వస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు.