జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్రమైన ఒత్తిడి వస్తోంది. అది ఆషామాషీ వ్యక్తుల నుంచి కాదు. ఏకంగా.. ఓ భారీ వ్యవస్థలా..పాతుకుపోయిన వారి దగ్గర్నుంచే. అయితే.. ఈ ఒత్తిడి.. ఆయన సినిమాల్లో నటించమని కాదు. మామూలుగా.. ఎన్నికల్లో ఓడిపోయిన తరవాత ఆయనపై సినిమాలలో నటించమని తీవ్ర ఒత్తిడి వచ్చింది. ఎంతగా అంటే.. ఓ సందర్భంలో ఆయన సినిమాల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కూడా చెప్పుకున్నారు. కానీ పవన్ మాత్రం స్థిరంగా రాజకీయాల వైపే ఉండిపోయారు. ఇప్పుడు ఆ రాజకీయాల వైపు నుంచే తీవ్రమైన ఒత్తిడి వస్తోంది. ఈ విషయాన్ని పవన్ కల్యాణే చెప్పారు. ఓ పెద్ద రాజకీయ పార్టీ…జనసేనను విలీనం చేయాలని… తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తోందట. అయినా సరే జాతి సమగ్రతను కాపాడేందుకు మానవతా విలువకోసం పెట్టిన…జనసేనను ఏ పార్టీలో కలిపే ప్రసక్తే లేదని పవన్‌కల్యాణ్ తేల్చి చెప్పారు.
విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన నేతలతో సమావేశమైన పవన్ ఈ ఒత్తిడి వ్యాఖ్యలు చేశారు. జనసేనను విలీనం చేసుకోవాలని.. భారతీయ జనతా పార్టీనే ప్రయత్నిస్తోంది. 2014 ఎన్నికలు పూర్తయినప్పటి నుంచి ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్వయంగా అమిత్ షానే అప్పట్లో తనకు ఆ ప్రతిపాదన పెట్టారని పవన్ చెప్పారు. ఆ తర్వాత మళ్లీ ఎన్నికలు వచ్చాయి. వెళ్లిపోయాయి. ఇప్పుడు.. మళ్లీ ఫ్రెష్ గా .. బీజేపీ జనసేనను విలీనం చేసుకునే ప్రయత్నం చేస్తోందని.. ప్రచారం జరుగుతోంది. అమెరికాలో వవన్ కల్యాణ్ తో … రామ్ మాధవ్ భేటీ అయ్యారు. అప్పుడే విలీనం ప్రతిపాదన పెట్టారన్న ప్రచారం జరిగింది.
అయితే ఈ సమావేశంపై… వ్యాఖ్యానించడానికి పవన్ కల్యాణ్ అప్పట్లో సిద్ధపడలేదు. రామ్ మాధవ్ మాత్రం… రాజకీయ పరమైన చర్చలు జరిగాయని చెప్పుకొచ్చారు. ఇప్పుడు… తనపై ఒత్తిడి వస్తోందని చెప్పడంతో.. బీజేపీనే… ఈ ఒత్తిడి చేస్తోందని ఎవరికైనా అర్థమవుతుంది. చేసుకోవాలంటే…అప్పులపాలవ్వాల్సిందే. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ విలీనాల మూడ్ లో ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో టేకోవర్లు పూర్తి చేసింది. ఇప్పుడు.. ఏపీపై దృష్టి పెట్టిందని చెబుతున్నారు. ఈ క్రమంలో వారి టార్గెట్ జనసేననే అయిందని… పవన్ కల్యాణ్ మాటలను బట్టి అర్థమవుతోందంటున్నారు.