కక్ష సాధింపు చర్యలకు పాల్పడబోమని ప్రజాస్వామ్యయుతంగా, పారదర్శకంగా వ్యవహరిస్తామని ప్రకటించిన కూటమి సర్కార్ అదే ఫాలో ఆవుతోంది. ఈమేరకు అసెంబ్లీ ప్రాంగణంలోకి మంత్రుల వాహనాలతో సమానంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వెహికిల్ ను అనుమతించేందుకు సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు.
ప్రస్తుతం జగన్ రెడ్డి ఓ సాధారణ ఎమ్మెల్యే మాత్రమే. ఇటీవలి ఎన్నికల్లో వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో ప్రోటోకాల్ ప్రకారం జగన్ రెడ్డి వెహికల్ ను సాధారణ ఎమ్మెల్యేలతో కలిపి సభా ప్రాంగణంలోకి అనుమతి ఇస్తారు. కానీ, మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకు గౌరవమిస్తూ.. అనుమతించినట్లు శాసన సభా వ్యవహరాల శాఖ మంత్రి పయ్యావుల తెలిపారు.
దీంతో వైసీపీ సర్కార్ వ్యవహరించినట్టుగా కక్ష సాధింపులు ఉండవని ప్రకటించినట్లునే జగన్ కు ప్రాధాన్యత ఇచ్చింది కూటమి ప్రభుత్వం. మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకు ప్రోటోకాల్ ను మించి అధిక ప్రాధాన్యత ఇవ్వడం తొలి రోజు అసెంబ్లీలో ఈ సంఘటన హైలెట్ గా నిలిచింది.