ఈరోజుల్లో సినిమాల కంటే వెబ్ సిరీస్‌లకే బేరాలు బాగున్నాయి. ఓటీటీ ఛానళ్లు కంటెంట్ కోసం ఆవురావురుమంటూ ఎదురు చూస్తున్నాయి. వాటిలో మంచి కథలు చూడ్డానికీ స్కోప్ దొరుకుతుంది. పారితోషికాలు, బడ్జెట్లూ భారీగా ఉండడంతో టాప్ స్టార్స్ కూడా… వెబ్ సిరీస్‌లపై మక్కువ చూపిస్తున్నారు. హాస్య నటుడు ప్రియదర్శి కూడా ఓ వెబ్ సిరీస్ చేసేశాడు. ‘లూజర్’ పేరుతో ఓ వెబ్ సిరీస్‌ని అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మించింది. ప్రియదర్శి, శశాంక్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈనెల 15 నుంచి జీ 5లో ఈ వెబ్ సిరీస్స్ట్రీమింగ్ కానుంది. క్రీడా నేపథ్యంలో సాగే ఎమోషనల్ జర్నీ… ఈ ‘లూజర్’.
ఆటంటేప్రాణాలు పెట్టుకునే ముగ్గురి కథ. ఒకరు షూటింగ్లో, ఇంకొకరు క్రికెట్లో, మరొకరు బ్యాట్మెంటెన్లో దిట్ట. కెరీర్లో వాళ్లకు ఎలాంటి ఆటు పోట్లు ఎదురయ్యాయి? క్రీడల్లో ఉన్న రాజకీయాలేంటి? వాటిని దాటుకుంటూ ఈ ముగ్గురూ ముందుకు ఎలా వెళ్లారు? అనేదే కథ. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ గప్ చుప్‌గా పూర్తయ్యింది. ఇందులో కనిపించినవాళ్లంతా దాదాపుగా సినీ నేపథ్యం ఉన్నవాళ్లే. ప్రమోషన్లు కూడా ఈమధ్యే మొదలెట్టారు. తెలుగులో చాలా వెబ్ సిరీస్‌లు వచ్చినా, స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో మాత్రం ఇంత వరకూ రాలేదు. మరి.. ఈ `లూజర్` ఎలా ఉంటాడో చూడాలి.