హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు. టైటిల్ ప్రోమో గమ్మత్తుగా వుంది. అమ్మాయిలు అమ్మలుగా, చెల్లాయిగా, ప్రియురాలిగా ఎంతో ప్రేమతో వుంటారు. అదే అమ్మాయి పెళ్ళాం అయితే తాటతీసి తందూరి వండుకుతింటారనే అర్ధం వచ్చేలా ప్రోమోని కట్ చేశారు. ప్రోమో చూస్తుంటే ఇదిభార్య భర్తల మధ్య నడిచే రొమాంటిక్ కామెడీ. గ్లింప్స్ లో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్ పాటలని వాడుకోవడం బావుంది. వివేక్ సాగర్ ఈ సినిమాకి మ్యూజిక్. హనుమాన్ నిర్మాతల నుంచి వస్తున్న సినిమా కావడంతో సహజంగానే ఆసక్తి డార్లింగ్ పై ఆసక్తి ఏర్పడింది.