హాస్య నటుడు ప్రియదర్శి హీరోగా ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. నభా నటేషా కథానాయిక. ఈ చిత్రానికి ‘డార్లింగ్’ అనే పేరు పెట్టే ఆలోచనలో ఉంది చిత్ర బృందం. ప్రభాస్ ఊతపదం ‘డార్లింగ్’. ఈ పేరుతో కరుణాకరన్ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా కూడా చేశారు. మళ్లీ ఇదే టైటిల్ వాడుకోవాలని చిత్రబృందం చూస్తోంది. అందుకోసమే నభా నటేషా సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ప్రభాస్ డార్లింగ్ అనే డైలాగ్ ని రీల్ రూపంలో వాడి, దాన్ని అభిమానులతో పంచుకొంది. సడన్‌గా నభా ప్రభాస్‌ని ఎందుకు ఇమిటేట్ చేస్తోందో, ముందు అభిమానులకు అర్థం కాలేదు. ఆ తరవాత… ప్రియదర్శి టచ్‌లోకి వచ్చి, నభాతో కాసేపు సోషల్ మీడియాలో చిట్ చాట్ లాంటిది చేశాడు. అలా.. ఈ వీడియో సినిమా ప్రమోషన్లలో భాగంగా రూపొందించిందన్న విషయం అర్థమైంది.
నభా ఆమధ్య బాగా డల్ అయ్యింది. ‘ఇస్మార్ట్ శంకర్’ సూపర్ హిట్టయినా, అవకాశాల్ని అందుకోలేకపోయింది. ఇప్పుడు మళ్లీ పుంజుకొనే ప్రయత్నాల్లో ఉంది. నిఖిల్ కథానాయకుడిగా రూపుదిద్దుకొంటున్న ‘స్వయంభూ’లో నటిస్తోంది. ప్రియదర్శి సినిమా కూడా చేతిలో ఉంది. ఇది కాకుండా మరో రెండు ఆఫర్లు రెడీగా ఉన్నాయని టాక్. వాటి గురించిన పూర్తి వివరాలు త్వరలో నభా నే చెబుతుందట.