ఈనెల 27న మనం కొత్త ప్రియాంక చోప్రాను చూస్తాం. నిజంగా ఈమె ఆమేనా అనుకుంటాం. అది ఎలాగంటారా. అయితే ఇది చదవండి. అందమే కాదు, అభినయం కూడా తెలిసిన నటి ప్రియాంక చోప్రా. ప్రపంచం మెచ్చిన ఈ అందాల రాశి గ్గామర్ తో పాటు నటనలో సత్తాను చాటుతోంది. ఇప్పుడు ఓ అమెరికన్ మెగా సీరియల్ లో లీడ్ రోల్ చేస్తోంది. క్వాంటికో అనే టైటిల్ ఖరారు చేసిన ఈ సీరియల్ మొదటి ఈనెల 27న ఎ బి సి చానల్ లో ప్రసారమవుతుంది.
ప్రతి ఆదివారం గంట పాటు ప్రసారమవుతుంది. ఇందులో 42 నిమిషాలు సీరియల్, మిగతా టైములో కమర్షియల్ బ్రేక్ ఉంటుంది. టెర్రరిజం నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమాలో హాట్ హాట్ రొమాన్స్ సీన్లు కూడా ఉన్నాయట. అవి చేయడం చాలా ఇబ్బంది అయిందని చెప్తోంది ప్రియాంక. రొమాన్స్ సీన్లలో నటించేటప్పుడు చాలా సిగ్గేసిందని, కానీ తప్పలేదని ముక్తాయించింది.
జోషువా సాఫ్రన్ అన్నీ తానై ఈ సీరియల్ ను తీశారు. ప్రియాంక ఈ మధ్య ప్రయోగాలు కూడా చేస్తోంది. ఆ మధ్య అజయ్ దేవ్ గణ్ హీరోగా వచ్చిన గంగాజల్ సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు దాని సీక్వెల్ తీస్తున్నారు. దాన్ని హీరోయిన్ ఓరియెంటెడ్ గా తీస్తున్నారు. అందులో ప్రియాంక పవర్ ఫుల్ పోలీస్ అధికారిణి పాత్రలో నటిస్తోంది. మొత్తం మీద అమెరికా సీరియల్ లో ప్రధాన పాత్రకు ఎంపిక కావడం అంటే ఆమె ప్రతిభమీద వారికి ఎంత నమ్మకం ఉండాలి? ఆల్ ది బెస్ట్ ప్రియాంక.