బాలీవుడ్ అందాల నటి ప్రియాంక చోప్రా చాలా ఎక్కువ మంది మక్కువ చూపిన మహిళగా క్రెడిట్ దక్కించుకుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా ఐ టైమ్స్ ఆన్ లైన్ సర్వేలో మోస్ట్ డిజైరబుల్ విమెన్ పోల్ నిర్వహించారు. వేలాది మంది నెటజన్లు పాల్గొన్న ఈ పోటీలో ఎక్కువ మంది ప్రియాంకకే జైకొట్టారు. 2000 సంవత్సరంలో మిస్ వరల్డ్ గా కిరీటాన్ని సొంతం చేసుకుని ఎంతో మందికి అభిమాన నటిగా, ఆరాధ్య దేవతగా మారిన ప్రియాంక, బాలీవుడ్ లో సుస్థిరమైన స్థానాన్ని సొంతం చేసుకుంది.
వన్నె తరగకుండా కాపాడుకుంటూ, నటిగా అంచెలంచెలుగా ఎదుగుతూ హాలీవుడ్ స్థాయికి చేరింది ప్రియాంక. 33 ఏళ్ల వయసులోనూ కొత్త హీరోయిన్లతో పోటీ పడుతూ కోట్ల మంది హృదయాలను కొల్లగొట్టిన తారగా ఖ్యాతి పొందిందని ఐటైమ్స్ సర్వే నిర్వాహకులు ఈ అందాల భామకు ఘనమైన కాంప్లిమెంట్స్ చెప్పారు. క్వాంటికో సీరియల్ ద్వారా అమెరికాలోనూ ప్రియాంక చాలా పాపులర్ అయింది. హాట్ సీన్లే కాదు, అభినయంతోనూ ఆకట్టుకుంది.
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2015 పోల్ లో కొన్ని ఆసక్తికరమైన ఫలితాలు వెలువడ్డాయి. సాధారణంగా గ్లామర్ గర్ల్ గా ఎక్కువ మంది ఇంటర్ నెట్ లో సెర్చ్ చేసిన అందగత్తెగా పేరున్న కత్రినా కైఫ్ లాంటి వారు టాప్ 5 లో లేకపోవడం విశేషం. ఈ జాబితాలో ప్రియాంక టాప్ ప్లేస్ లో ఉంటే మరో అందాల నటి దీపికా పదుకొనే రెండో స్థానం పొందింది. టాప్ హీరోలందరితో ఆడిపాడిన దీపిక సెంకడ్ ప్లేస్ కు పరిమితం కావడం కూడా ఒక విశేషమే.
బాలీవుడ్ హాట్ హీరోయిన్ గా పేరుపొందిన కత్రినా కైఫ్ కంటే మెరుగైన పొజిషన్ తో టాలీవుడ్ సుందరాంగి శ్రియ సత్తాను చాటింది. జాబిబాలో శ్రియా శరణ్ ఆరో స్థానంలో నిలిచింది. కత్రినా కైఫ్ కు 8వ ర్యాంక్ దక్కింది.
హృతిక్ రోషన్ తో హోరాహోరీ యుద్ధం చేస్తున్న కంగనా రనౌత్ 10 స్థానం పొందింది. కపూర్ ఖాందాన్ బ్యూటీ సోనమ్ 11వ ర్యాంకు దక్కించుకుంది. శ్రుతిహాసన్ కు 16వ ర్యాంకు దక్కింది. పోకిరి హీరోయిన్ ఇలియానా 37వ స్థానంలో ఉంది. అందాల నయనతారకూ ఈ జాబితాలో చోటు దక్కింది. అయితే ఆమెకు 48వ ర్యాంకు సొంతమైంది.