కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. రాహుల్ గాంధీ ఖాళీ చేయబోతున్న వాయనాడ్ లోక్ సభ సీటు నుంచి ప్రియాంకా గాంధీనే బరిలోకి దింపాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంతో రెండు రకాల సమస్యలు తీరిపోతాయి. కష్టాల్లో తమ దగ్గర పోటీ చేసిన రాహుల్ ఇప్పుడు యూపీలో ప్లేస్ దొరకగానే వెళ్లిపోయాడని అక్కడి ప్రజలు అసంతృప్తి చెందకుండా.. గాంధీ కుటుంబం నుంచే అదీ కూడా ప్రియాంక గాంధీకే చాన్సిచ్చారు. అదే సమయంలో దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీ మరింత పుంజుకునేందుకు ప్రియాక ఎక్కువ సమయం కేటాయించే అవకాశం ఉంది.
కారణం ఏదైనా ప్రియాంకా గాంధీ కి పొలిటికల్ మొదటి నుంచి మంచి క్రేజ్ ఉంది. ఆమె చాలా కాలం ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోవడం .. ఓ కారణం కావొచ్చు. అచ్చు గుద్దినట్లుగా ఇందిరమ్మలా ఉండటం… మంచి వాగ్దాటి .. ఇవన్నీ ప్రియాంకా గాంధీని ప్రజలకు చేరువ చేశాయి. ఆమె ప్రత్యక్ష ఎన్నికల్లోకి వస్తే కాంగ్రెస్ రాత మరోలా ఉంటుందన్న అభిప్రాయంలో చాలా మంది ఉన్నారు. ఇప్పటికి అది నిజం అవుతోంది. వయనాడ్ నుంచి బరిలోకి దిగితే…. మొత్తం కాంగ్రెస్ రాజకీయం మారిపోతుంది.
ఉత్తరాదిన రాహుల్.. దక్షిణాదిన ప్రియాంకా గాంధీ పార్టీ బాధ్యతలను తీసుకుని రంగంలోకి దిగితే… అధికార వ్యతిరేకతతో వెనుకబడిపోతున్న బీజేపీకి.. మరిన్ని కష్టాలెదురయ్యే అవకాశం ఉంది. మొత్తంగా ప్రియాంకను దక్షిణాదికి పంపడం.. కాంగ్రెస్ వ్యూహాత్మక రాజకీయాల్లో కీలక మలుపు అనుకోవచ్చు.