ప్రియాంకరెడ్డి తల్లిదండ్రులను.. రాజకీయం కోసం… క్షోభ పెడుతున్నారు నేతలు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పరామర్శల పేరుతో ఇంటికెళ్లడం.. బయటకు వచ్చి మీడియా ముందు.. చెలరేగిపోవడం.. కామన్ అయిపోయింది. రెండు రోజుల నుంచి పెద్ద ఎత్తున వస్తున్న నేతల పరామర్శలతో.. ఇప్పటికే బాధల్లో ఉన్న ప్రియాంకరెడ్డి కుటుంబసభ్యులు మరింత వేదనకు గురవుతున్నారు. ఈ ఆదివారం.. ఈ తాకిడి మరింత ఎక్కువగా ఉంటుందనే సందేశాలు రావడంతో.. వారు తమ ఇంటికి తాళాలు వేసుకున్నారు. “ఇంటికి రాజకీయ నాయకులు, పోలీసులు ఎవరూ రావొద్దు. మా ఆవేదనను అర్థం చేసుకోండి. మాకు ఎవరి సానుభూతి వద్దు. మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వండి” అని ఆ కుటుంబం విజ్ఞప్తి చేసింది.
ప్రియాంకారెడ్డి హత్యాచారం ఘటన.. దేశవ్యాప్తంగా కలకలం రేపింది. మీడియా అటెన్షన్ మొత్తం… ఆ కుటుంబం వైపే ఉంది. దీంతో.. ఎక్కువ మంది.. ప్రియాంకరెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించందుకు వెళ్తున్నారు. ఆమె కుటుంబం ఉంటున్న గెటెడ్ కమ్యూనిటీలోని వారు కూడా..ఈ పరిస్థితితో ఇబ్బంది పడుతున్నారు. ఆమె కుటుంబానికి న్యాయం చేసే వరకు ఎవరినీ కాలనీలోకి అనుమతించబోమని ప్రకటించారు. కాలనీలోకి కూడా ఎవరినీ అనుమతించడం లేదు.
డాక్టర్ అత్యాచారం, హత్య ఘటనపై… ఆమె కుటుంబానికి ఇంత వరకూ.. ఎలాంటి న్యాయం చేస్తారో ఎవరూ చెప్పలేదు. మరో అమ్మాయికి.. ఇలా జరగకూడదన్న లక్ష్యంతో… చర్యలు తీసుకోవాలని.. తల్లిదండ్రులు కోరుతున్నారు. కానీ.. ప్రభుత్వం వైపు నుంచి అలాంటి భరోసా ఏదీ ఇంత వరకూ రాలేదు. వచ్చిన మంత్రులు కూడా… వివాదాస్పద ప్రకటనలు చేశారు. కానీ.. వీరి పరిస్థితిని రాజకీయంగా ఉపయోగించుకోవడానికి వివిధ పార్టీలు పరుగులు పెడుతున్నాయి. దీంతో.. ఆ తల్లిదండ్రుల్లో ఆవేదన కనిపిస్తోంది.