వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పోలీసులు తమను ఏమీ చేయలేరంటూ రెచ్చిపోయిన వారికి ఇప్పుడు అత్యంత గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. తాజాగా గుడివాడలో ఓ సారి రావి వెంకటేశ్వరరావుకు చెందిన ఆస్తులపై పెట్రోల్ బాంబులతో దాడి చేసి రణరంగం సృష్టించిన కొడాలి నాని అనుచరులంతా ఇప్పుడు కటకటాల్లోకి వెళ్లారు. వైసీపీ హయాంలో ఇలాంటి ఘటనలు కామన్ అన్నట్లుగా చాలా తేలిక పాటి సెక్షన్లు ముఖ్యంగా వైసీపీ నేతుల చేసే దొమ్మీలను కూడా తేలికగా పోలీసులు తీసుకునేవారు. కానీ ఇప్పుడు అంతకు మించి ఎక్కువ సీరియస్ గా తీసుకుంటున్నారు.
ఇప్పుడు అలాంటి కేసులు తిరగతోడి సీన్ ఫుటేజీల ఆధారంగా కేసులు పెడుతున్నారు. ఈ క్రమంలో కొడాలి నాని ముఖ్య అనుచరుడు కాళీతో పాటు పలువురిని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. కాళీ పారిపోయాడు కానీ మిగిలిన వారందరూ దొరికిపోయారు. పారిపోవడం వల్లనే కాళీకి ఎక్కువ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కొడాలి నాని ప్రోద్భలంతోనే దాడి చేసినట్లుగా నిరూపణ అయితే ఆయనపైనా కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కొడాలి నానిపై పలు రకాల ఆరోపణలపై ఫిర్యాదులు ఉన్నాయి.
వల్లభనేని వంశీ, కొడాలి నాని వైసీపీ హయాంలో నియోజకవర్గాల్లో చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని బయటకు రానిచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు మాత్రం పూర్తి స్థాయిలో బయటకు వస్తున్నాయి. అందరి లెక్కలు తేలుతున్నాయి. దీన్ని బట్టి అర్థమవుతోంది ఏమిటంటే అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్లుగా ఇవాళ కాకపోతే రేపైనా చట్టం వెంట పడుతుంది. ఎప్పుడో చేశాం ఇప్పుడు పట్టుకుంటారా అనేందుకు అవకాశాల్లేవు. ఇలా కేసుల పాలవుతున్న వైసీపీ క్యాడర్ వేలల్లోనే ఉంది.