బీహార్ ఫైర్ సర్వీసెస్లో డీజీగా పని చేస్తున్నా సునీల్ నాయక్ అనే ఐపీఎస్ అధికారికి రఘురామ కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నోటీసులు జారీ చేశారు. సోమవారం తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. సునీల్ నాయక్ తెలుగోడే కానీ బీహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి. జగన్ సీఎం కాగానే ఏపీకి డిప్యూటేషన్ మీద వచ్చేశారు. వెంటనే పీవీ సునీల్ కుమార్ టీంలో చేరిపోయారు. టీడీపీ నేతల వేట సాగించారు.
రఘురామకృష్ణరాజును హైదరాబాద్ లో అరెస్టు చేసి తీసుకు వచ్చిన సమయంలో ఆయన కీలకంగా వ్యవహరించారని గుర్తించారు. జగన్ ఓడిపోగానే సైలెంటుగా గా బీహార్ క్యాడర్ లో రిపోర్టు చేశారు. అయినా ఇప్పుడు ఆ పాపాలు వెంటాడుతున్నాయి. ఆయన ఏపీలో డిప్యూటేషన్ పై వచ్చి చేసిన నిర్వాకాల గురించి బీహార్ ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఇక్కడి నుంచి సమాచారం పంపారు. ఆయనకు నోటీసులు జారీ చేశామని సమాచారం ఇచ్చారు.
రఘురామకృష్ణరాజు కేసులో ఆలస్యం అయినప్పటికీ.. చట్టాలను ఉల్లంఘించి టార్చర్ చేసిన అందర్నీ.. చట్ట ప్రకారం టార్చర్ పెట్టేందుకు అన్ని రకాల సన్నాహాలు చేస్తున్నారు. ఓ నేరస్తుడైన పాలకుడి కోసం తాము చేసిన తప్పులు తమను జీవితాంతం వెంటాడబోతున్నాయని ఇప్పుడిప్పుడే వారికి అర్థమవుతోంది. ఇలాంటి వారి వ్యవహారం చాలా మందికి పాఠాలయ్యే అవకాశాలు ఉన్నాయి.