ఏపీలో బీజేపీ పరిస్థితి మరింత దిగజారిపోయింది. సిట్టింగ్ ఎమ్మెల్సీ సీటు పోయింది. డిపాజిట్లు రాలేదు. ఎంత మంది పేపర్ టైగర్ నేతలు ఎన్ని చెప్పినా జరగాల్సింది మాత్రం జరిగిపోయింది,. ఇప్పుడు సోము వీర్రాజు వ్యవహారంపై మరోసారి చర్చ ప్రారంభమయింది. ఆయన పార్టీని వైసీపీకి తాకట్టు పెట్టేశారన్న అసంతృప్తి అంతకంతకూ పెరిగిపోతోంది. వైసీపీ, బీజేపీ దొందూ దొందే అని జనం భావిస్తున్నారని స్వయంగా ఆ పార్టీ సీనియర్ నేత విష్ణుకుమార్ రాజు ఫీలయ్యారు.
రాష్ట్ర నేతలే కాదు.. జగన్ కూడా వ్యూహాత్మకంగా అవసరం పడినప్పుడల్లా ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా లతో ఫొటోలు తీసుకుని ప్రచారం చేసుకుంటున్నారని ఇది కూడా.. తమకు మైనస్‌గా మారిందని అంటున్నారు. జగన్ అలాంటి ఫీలింగ్ కల్పించడం ఇక్కడ నేతలు వైసీపీతో కలిసిపోవడంతో తమ పరిస్థితి దిగజారిపోయిందంటున్నారు. అందుకే ఇప్పుడు అందరి టార్గెట్ సోము వీర్రాజు అన్నట్లుగా మారిపోయింది.
వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే మరోసారి పరువు పోతుందని కనీసం టీడీపీ, జనసేనతో కలిసి పోటీ చేద్దామన్న ఆలోచనకు వస్తున్నారు. బహిరంగంగా చెబుతున్నారు. చెప్పని వారు ఢిల్లీలో తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు. బీజేపీ పొత్తు పెట్టుకోవాలి అనుకుటంే… టీడీపీ అధినేత వద్దని చెప్పకపోవచ్చన్న అంచనా ఉంది. అలా రాజకీయం మారాలంటే.. ముందుగా సోము వీర్రాజుకు గేటు చూపించక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. మొత్తంగా పార్టీని నాకించేసిన సోము .. .. ఇప్పుడు బయటకు వెళ్లిపోయినా ఆయనకు పోయేదేమీ ఉండదు. వైసీపీలో మంచి పదవే లభించవచ్చు.