ఈవీఎంల మొరాయింపు అనేది.. ఇప్పుడు కామన్ అయిపోయింది. పోలింగ్ బూత్‌లలో మొరాయిస్తే.. అర్థరాత్రికో.. అపరాత్రికో బాగు చేసి ఓటింగ్ నిర్వహించారు. అయితే.. ఇప్పుడు.. కౌంటింగ్‌లోనూ.. ఈవీఎంలు మొరాయించే అవకాసం ఉందట. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి… గోపాలకృష్ణ ద్వివేదీనే చెప్పుకొచ్చారు. మరి మొరాయించిన ఈవీఎంలలోని ఓట్ల సంగతేమిటనే అనుమానానికి .. ఆయన కొత్త లెక్క చెప్పుకొస్తున్నారు. వాటిని లెక్కించడానికి చాన్స్ ఉండదు కాబట్టి.. లెక్కించరు. మరేం చేస్తారు..?. అప్పటికే … ఎన్నో కొన్ని ఈవీఎంలు లెక్కించి ఉంటారు కాబట్టి… అలా లెక్కించగా.. ఎవరికో ఒకరికి మెజార్టీ వస్తుంది కాబట్టి.. ఆ మెజార్టీ కన్నా..,ఎక్కువగా… ఓట్లు అప్పుడు… ఆ మొరాయింపు ఈవీఎంలను సమస్యగా భావిస్తారట.
వాటిని తెరవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసిన విఫలమై ఉంటారు కాబట్టి.. ఆయా పోలింగ్ కేంద్రాల్లో… రీపోలింగ్ నిర్వహించడానికి… రిటర్నింగ్ అధికారులకు అవకాశం ఇస్తారట. ద్వివేదీ చెప్పినది నిబంధనలకు అనుగుణంగానే ఉంది కానీ… అసలు.. ఈవీఎం కౌంటింగ్‌లోనూ మొరాయించడం ఖాయమన్న.. గట్టి నమ్మకంతో.. ఈసీ ఉండటమే.. అసలు అనుమానాలకు కారణం అవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో వాడిన ఈవీఎంలు… చాలా కాలం నాటివని చెబుతూ ఉన్నారు. అందుకే.. అదే పనిగా.. పోలింగ్ రోజున మొరాయించాయని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ తర్వాత కౌంటింగ్‌కు నెలన్నర రోజుల సమయం ఉంది. ఇన్ని రోజులు ఈవీఎంలను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరచలా. ఎండా కాలం ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతున్న సమయంలో… ఆ ఈవీఎంల రక్షణ చాలా కష్టమే.
ఎందుకంటే.. ఆ ఈవీఎంలు.. అంత తీవ్రమైన ఉష్ణోగ్రతల్లో జాగ్రత్తగా ఉంటాయన్న నమ్మకం.. నిపుణులకే లేదు. అతి వేడి వల్ల… వీవీ ప్యాట్లు పని చేయలేదని.. పోలింగ్ సమయంలో ప్రచారం జరిగింది. ఇప్పుడు కౌంటింగ్ సమయంలోనూ..ఈ కష్టాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తానికి పోలింగ్ లోనే కాదు.. కౌంటింగ్ లోనూ… ఈవీఎంలు గందరగోళం సృష్టించబోతున్నాయిన్న విషయాన్ని మాత్రం.. ద్వివేదీ ముందుగానే ప్రజల్లోకి ఎక్కించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.