టికెట్ రేట్ల వ్యవహారంలో చాలా గందరగోళాలున్నాయి. ఏపీలో ప్రస్తుతం ఉన్న టికెట్ రేట్ల పట్ల.. నిర్మాతలు పూర్తి అసంతృప్తితో ఉన్నారు. పెద్ద సినిమాలు వెనక్కి వెళ్లిపోవడానికి కారణం.. ఆ టికెట్ రేట్లే. సవరించిన టికెట్ రేట్లని, మళ్లీ సవరించి, పాత రేట్లని పునరుద్ధరించకపోతే – పెద్ద సినిమాల మనుగడ కష్టం.సంక్రాంతి లోపు ఈ టికెట్ రేట్ల వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం ఓ కీలకమైన నిర్ణయం తీసుకోకపోతే – పెద్ద సినిమాలకు రిస్కే. ఈనేపథ్యంలో టికెట్ రేట్ల విషయంలో… ఆర్.ఆర్.ఆర్ కోర్టు మెట్లు ఎక్కే ఆలోచన చేస్తోందని వార్తలు టాలీవుడ్ అంతా షికారు చేస్తున్నాయి. కొన్ని వెబ్ సైట్లు.. ఈ విషయంలో కథనాలు అల్లి… ప్రచురిస్తున్నాయి. అయితే… ఇవన్నీ ఫేక్ వార్తలే. టికెట్ రేట్ల విషయంలో.. కోర్టుకెక్కే ప్రసక్తే లేదని స్వయంగా ఆర్.ఆర్.ఆర్ నిర్మాతలు , యూనిట్ స్పష్టం చేశారు. టికెట్ రేట్లు తగ్గించడం వల్ల.. కొంత ఇబ్బంది ఉందని, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసి, తమ బాధని, జరుగుతున్న నష్టాన్ని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నామని, అంతే తప్ప, కోర్టుకెక్కే ఉద్దేశ్యం లేదని ఆయన స్పష్టం చేశారు. త్వరలోనే.. దానయ్య, రాజమౌళి తదితరులు జగన్ ని కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే.. . మినహాయింపులు అనేవి కేవలం పెద్ద సినిమాలకే ఇస్తే కుదరదు. ఒక్కో సినిమాకీ ఒక్కో రేటు అన్న ప్రతిపాదనకు వ్యతిరేకంగానే ఏపీ ప్రభుత్వం పని చేస్తోంది. ఇస్తే.. అన్ని సినిమాలకూ ఒకే టికెట్ రేట్ అప్లై చేస్తూ.. కొత్త జీవో ఒకటి ఇవ్వాలి. లేదంటే.. ఇప్పుడున్న రేట్లనే కొనసాగిస్తాం అని స్పష్టం చేయాలి.కాకపోతే.. ఆన్ లైన్ లో టికెట్ల అమ్మకానికి నిర్మాతలు ఒప్పుకున్నందున… ఏపీ ప్రభుత్వం టాలీవుడ్ కి అనుకూలమైన నిర్ణయం తీసుకునే వీలుంది. త్వరలోనే అఖండ, పుష్ష సినిమాలు విడుదల కానున్నాయి. సంక్రాంతి వరకూ ఎదురు చూడకుండా.. ముందే.. ఆ జీవో ఏదో ఇచ్చేస్తే.. పెద్ద సినిమాలకు కాస్త రిలీఫ్ గా ఉంటుంది.