సినిమా రివ్యూలు కొంత పుంతలు తొక్కుతున్నాయి. యూట్యూబ్ ఛానల్స్ ప్రభలంగా పుట్టుకొచ్చిన వచ్చిన తర్వాత సినిమా సమీక్షలు పక్కదారి పట్టాయి. క్రాఫ్ట్, సినిమా అప్రిషియేషన్ పై ఏ మాత్రం అవగహన లేని వారు కూడా రివ్యూవర్ అవతారమెత్తేస్తున్నారు. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్, పాటలు, ఫైట్లు అంటూ థియేటర్ ఎదురుగానే హంగామా చేస్తున్నారు. కొందరైతే హీరోలని, దర్శకులని పర్శనల్ గా కూడా ఎటాక్ చేస్తున్నారు. ఈ పెడ ధోరణి గమనించిన కోలీవుడ్ నిర్మాతల మండలి ఇటివలే ఓ నిర్ణయం తీసుకుంది. థియేటర్ యజమానులు యూట్యూబ్ ఛానళ్లను సినిమా హాళ్ల ప్రాంగణంలోకి అనుమతించకూడదని నిర్ణయించింది.
కాగా కోలీవుడ్ నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయంపై ప్రొడ్యూసర్ దిల్ రాజు స్పందించారు. ‘‘ తెలుగు రాష్ట్రాల్లోనూ అది అమలయ్యే అవకాశాలున్నాయి. ఐతే ఫిల్మ్ ఛాంబర్ ఈ నిర్ణయిం తీసుకోవాలి. ఇప్పటికే అలా చేసేందుకు మన ఎగ్జిబిటర్లు కూడా సిద్ధంగా ఉన్నారు’’అని చెప్పారు.
తెలుగులో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ రివ్యూలు నాన్ సెన్స్ వున్న మాట వాస్తవమే. అసలు ఏ మాత్రం పరిజ్ఞానం లేకుండా సినిమాని సమీక్షించే వైనం ఫిల్మ్ మేకర్స్ కి చాలా చిరాకు పెడుతోంది. కొందరైతే పనిగట్టుకొని వ్యక్తిగత అక్షలతో సినిమాపై నెగిటివ్ టాక్ ని స్ప్రెడ్ చేసేలా చేస్తున్నారని, పబ్లిక్ టాక్ పేరుతో సినిమాని కిల్ చేస్తున్నారనే విమర్శ వుంది. దిల్ రాజు మాటలు వింటే తమిళ్ ఇండస్ట్రీ తీసుకున్న నిర్ణయం తెలుగులో కూడా అమలు జరిగేలా వుందనిపిస్తోంది.