టాలీవుడ్లో మరో విషాదం. సీనియర్ మేకప్ మెన్, నిర్మాత జయకృష్ణ ఈరోజు హైదరాబాద్లో మృతి చెందారు. చిరంజీవి, కృష్ణంరాజుల కాంబినేషన్లో బాపు దర్శకత్వంలో రూపుదిద్దుకొన్న మనఊరి పాండవులు చిత్రంతో నిర్మాతగా మారారు జయకృష్ణ. అంతకు ముందు కృష్ణంరాజుతో ఉన్న అనుబంధం దృష్ట్యా ఆయన రూపొందించిన కొన్ని చిత్రాలకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించారు. మంత్రిగారి వియ్యంకుడు, పాపే మా ప్రాణం,ముద్దుల మనవరాలు, స్రవంతి, మిస్టర్ భరత్ తదితర చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. జయకృష్ణ స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి. రేపు ఆయన స్వస్థలంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. జయకృష్ణ మృతికి టాలీవుడ్ సంతాపం తెలిపింది.