సీనియర్ నిర్మాత కాట్రగడ్డ మురారి కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఆయన చెన్నై లో తుది శ్వాస విడిచారు. సినిమాలపై ఆసక్తితో వైద్య విద్య మధ్యలో ఆపేసి సినీ నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు మురారి. త్రిశూలం, శ్రీనివాస కళ్యాణం, జానకి రాముడు, నారి నారి నడుమ మురారి లాంటి పలు విజయవంతమైన సినిమాలు నిర్మించారు.
మురారి తన సినిమాల్లో సంగీతానికి ప్రాముఖ్యం ఇచ్చేవారు. ఆయన నిర్మించిన సినిమాల్లో ఎక్కువగా కె. వి. మహదేవన్ స్వరపరిచినవే. సాహిత్యం, సంగీతంకు ఎక్కువ విలువల ఇచ్చేవారు. మహదేవన్ స్వరం, ఎస్పీబీ పాట లేకుండా ఆయన సినిమా తీసేవారు కాదు. ‘నవ్విపోదురుగాక’ పేరతో ఆయన రాసిన ఆయన ఆత్మకథ కొన్ని వివాదాలకు కూడా దారితీసింది. ఎక్కడా రాజీపడని నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు మురారి. ఆయన మృతి పట్ల పలువులు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.