నందమూరి బాలకృష్ణ – బాబీ కాంబినేషన్లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. దీపావళికి టైటిల్ తో పాటు, రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తామని నిర్మాత నాగవంశీ ఇది వరకే ప్రకటించారు. అయితే ఇప్పుడు అలాంటి గ్లింప్స్ ఏమీ రావడం లేదు.
ఈ సినిమా టైటిల్ ఆల్రెడీ ఫిక్సయ్యింది. అయితే లోగో డిజైన్, గ్లింప్స్‌కు సంబంధించిన సీజీ వర్క్ అయితే ఇంకా పెండింగ్ లోనే ఉందన్నారు నాగవంశీ. ఆ టైటిల్ ని సీజీ ఎఫెక్ట్ తో చూస్తేనే కిక్ వస్తుందని, మామూలుగా వదల్లేమని, అందుకే టైటిల్‌ని దీపావళికి ఎనౌన్స్ చేయడం లేదన్నారు. టైటిల్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న బాలయ్య ఫ్యాన్స్ కు ఆయన సారీ చెప్పారు. నవంబరు 2వ వారంలో టైటిల్ గ్లింప్స్ ఉండొచ్చు. ఈ చిత్రానికి ‘డాకూ మహారాజా’ అనే పేరు ఖరారు చేశారని ప్రచారం జరుగుతోంది. అదే ఖాయమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రంలో బాలయ్య బంధిపోటుగా కనిపించబోతున్నాడని సమాచారం.