చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సినిమాపై సోషల్ మీడియాలో భిన్నమైన ప్రచారం జరుగుతోంది. సినిమాకి హిట్ టాక్ వచ్చినా పంపిణీదారులు నష్టపోయే అవకాశం వుందని, ఊహించిన వసూళ్ళు రాలేదని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. కాగా దీనిపై నిర్మాత ఎన్వీ ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. అసలు ఈ సినిమాని ఎవరికీ అమ్మలేదని, సొంతగా విడుదల చేశామని చెప్పారు.
”సినిమాకి ప్రేక్షకుల నుండి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. అన్ని చోట్ల అద్భుతమైన కలెక్షన్స్ వున్నాయి. సినిమాని ఎవరికీ అమ్మలేదు. మేము సొంతంగా విడుదల చేశాం. రెవెన్యూ చాలా స్ట్రాంగ్ గా వుంది. కలెక్షన్స్ మేము ఊహించదానికి కంటే అద్భుతంగా వున్నాయి. లూసిఫర్ ని అందరూ చూశారు. ఆ సినిమాని రీమేక్ చేయడం ఒక సాహసం. అలాంటి సినిమాని మార్పులు చేసి విజయం సాధించడం మామూలు విషయం కాదు. ఓవర్సిరస్ తో పాటు హిందీ కలెక్షన్స్ కూడా బలంగా వున్నాయి. హిందీలో మొదటి వారం పదికోట్లు రెవెన్యూ కలెక్ట్ చేయడం చిన్న విషయం కాదు. గాడ్ ఫాదర్ మా బ్యానర్ లో ఒక మైల్ స్టోన్ మూవీ” అని చెప్పుకొచ్చారు ఎన్వీ ప్రసాద్.