కొన్ని లోకల్ వెబ్సైట్స్ అల్లు అర్జున్ స్టామినాని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాయని నిర్మాత ఎస్కేఎన్ రీసెంట్ గా ట్వీట్ చేశారు. అసలు ఈ ట్వీట్ ఎందుకు చేయాల్సి వచ్చిందో తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో వివరించారాయన. ఇతర రాష్ట్రాల్లో అల్లు అర్జున్ కి ఉన్న మాస్ రీచ్ కొంతమందికి తెలియదేమో అనే ఉద్దేశంతో ఆ ట్వీట్ చేశారట.
‘కోవిడ్ సమయంలో, 50% ఆక్యుఫెన్సీ ఉన్న సమయంలో కూడా ప్రమోషన్ లేకుండా హిందీలో 100 కోట్లు కొట్టిన సినిమా పుష్ప. అక్కడ తెలుగు సినిమా ఖ్యాతిని నిలబెట్టిన సినిమా పుష్ప. అలాగే 70 ఏళ్లుగా తెలుగు హీరోలకు కలగా మిగిలిపోయిన నేషనల్ అవార్డుని సొంతం చేసుకున్న తొలి తెలుగు హీరో అల్లు అర్జున్’ అని చెప్పుకొచ్చారు.
”నేను ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రదేశాలకు వెళ్లాను. చాలా చోట్ల సినిమా టాపిక్ వచ్చినప్పుడు పుష్ప గురించి మాట్లాడుకుంటున్నారు. కలకత్తాలో ఒక మావోయిస్టుల ప్రాంతం ఉంది. అక్కడ సినిమాలు ప్రదర్శించడమే కష్టం. సెకండ్ షోలు ఉండవు. అలాంటి ప్రాంతంలో కూడా పుష్ప 50 రోజులు ఆడిందని చెప్తే షాక్ అయ్యాను. అది అల్లు అర్జున్, పుష్పకి వున్న రీచ్. ఆ దృష్టితోనే అట్వీట్ చేయడం జరిగింది’ తన ట్వీట్ వెనుక వున్న ఉద్దేశాన్ని వివరించారు ఎస్కేఎన్.