కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా శ్రీకాంత్ అడ్డాలకు మంచి పేరుంది. కొత్తబంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలతో తన పంథా నిరూపించుకొన్నాడాయన. ముకుంద ఓకే అనిపించింది. బ్రహ్మోత్సవం మాత్రం డిజాస్టర్. ఈ సినిమా శ్రీకాంత్ కెరీర్‌పై దారుణమైన ప్రభావాన్ని చూపించింది. అంతకు ముందు అడ్వాన్సులు ఇచ్చినవాళ్లంతా సైడైపోయారు. శ్రీకాంత్ చేతిలో సినిమాలేం లేవిప్పుడు. ఆ మధ్య దిల్‌రాజు బ్యానర్ లో సినిమా ఉటుందని టాక్ వినిపించింది.
కొత్తబంగారు లోకం, సీతమ్మ.. ఈ రెండు సినిమాలూ దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చినవే. ఆ సంస్థకు ఈ సినిమాలు లాభాలతో పాటు మంచి పేరునీ తీసుకొచ్చాయి. ఆ కన్సర్న్ తో దిల్‌రాజు అడ్డాలకు మరో ఛాన్స్ ఇచ్చాడట వినిపించింది. అయితే అది ఇంతవరకూ వర్క్ అవుట్ కాలేదు. దీంతో పాటు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఓ సినిమా ఆఫర్ చేశారని కూడా వినిపించింది. ఇది అంతా కొత్త వాళ్ళతో వుండబోతుందని అన్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ కూడా ఆజాపాజా లేకుండా పోయింది. మొత్తంమ్మీద.. బ్రహ్మోత్సవం శ్రీకాంత్ కెరీర్ పై చాలా దారుమైన ఎఫెక్ట్ చూపించిందని చెప్పాలి. హిట్ చుట్టూ నడిచే పరిశ్రమ ఇది. అయితే శ్రీకాంత్ అడ్డలా లాంటి క్లాస్ దర్శకుడిని ఒక్క ఫ్లాఫ్ తో తక్కువ చేసి చూడలేం. కానీ నిర్మాతలకు మాత్రం అడ్డాల మీద ఇంకా గురి కుదరడం లేదు. మరి శ్రీకాంత్ కొత్త సినిమా కబురు ఎప్పుడో..