గ్లామరూ, ప్రతిభ అంతంత మాత్రంగానే ఉన్నా, అవకాశాల్ని బాగానే ఒడిసి పట్టుకుంటోంది మెహరీన్. హీరోయిన్ల కొరత కూడా మెహరీన్‌కి కలిసొచ్చిన అంశం. ఇటీవలే `ఎంత మంచి వాడవురా`లో నటించింది. అయితే… ఈ సినిమా విషయంలో నిర్మాతల్ని తెగ ఇబ్బంది పెట్టిందట మెహరీన్. ముఖ్యంగా హోటెల్, లాండ్రీ బిల్లుల రూపంలో లక్షల రూపాయలు పిండుకుందట. హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతున్న సమయంలో కథానాయిక తాలుకూ ఖర్చులన్నీ నిర్మాతే భరించాలని ముందే ఎగ్రిమెంట్ రాసుకున్నారు. దాన్ని అలుసుగా తీసుకుని మెహరీన్ విజృంభించిందట. లంచ్‌కి రూ 7 వేల రూపాయల చొప్పున నిర్మాతకి బిల్లు పంపిందట. షూటింగ్ మొత్తం పూర్తయ్యేసరికి లాండ్రీ ఖర్చుల రూపంలోనే లక్షలు గుంజిందని. తన కుటుంబ సభ్యుల్ని సైతం తనతో ఉంచుకుని, వాళ్ల బిల్లుల్నీ నిర్మాతతోనే కట్టించిందని, ఈ విషయంలో నిర్మాతకీ, మెహరీన్కీ మధ్య చిన్నపాటి గొడవ కూడా అయ్యిందని తెలుస్తోంది. మెహరీన్ తిండి ఖర్చు విషయం మిగిలిన నిర్మాతల వరకూ వెళ్లిందని సమాచారం. ఇక ముందు ఎగ్రిమెంట్లు చేసుకునేటప్పుడు `మీతిండి ఖర్చు మీదే` అంటూ నిర్మాతలు షరతు విధించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.