చిరంజీవి అభిమానులందరూ.. జనసేన పార్టీలో చేరారు. ఆ తర్వాత చిరంజీవినే నేరుగా జనసేనలో చేరుతారన్న ప్రచారం ప్రారంభమయింది. దీంతో చిరంజీవి వల్ల జనసేన బలపడుతుందా..? లేక నష్టపోతుందా..? చిరంజీవి వల్ల పవన్ కల్యాణ్ పై ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందన్న అన్న చర్చ ప్రారంభమయింది.
పవన్‌ను వెంటాడుతున్న పీఆర్పీ వైఫల్యం..!
ఇప్పటి వరకు పవన్ కు ఉన్న అడ్వాంటేజ్ ఏమిటంటే.. ప్రజారాజ్యం పట్ల ప్రజల్లో తీవ్రంగా వ్యతిరేకంగా ఉంది. పవన్ కల్యాణ్ పై లేదు. ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటులో పవన్ ఉన్నారు. ప్రచారం కూడా చేశారు. కానీ ప్రజారాజ్యం విలీన ప్రక్రియలో మాత్రం లేరు. ఇది పవన్ కల్యాణ్ విశ్వసనీయతను పెంచింది. జనసేనకు ఇబ్బంది లేకుండా చేసింది. ఇప్పటికి కూడా ప్రజారాజ్యం వైఫల్యం పవన్ కల్యాణ్ ను వెంటాడుతూనే ఉంటుంది. ఈ విషయాన్ని చాలా సార్లు పవన్ కల్యాణ్ కూడా చెప్పారు. ప్రజారాజ్యం వైఫల్యం వల్ల ప్రజలు తనపై కూడా అనుమానంతో చూస్తున్నారని.. అందుకే నేను తొందరపడనని.. చెప్పుకొచ్చారు. అంటే.. జనసేన వెనుక ఆ ప్రజారాజ్యం వైఫల్యం నీడలా ఉందన్నమాట.
చిరంజీవి ఓపిక పట్టలేకపోయారు..!
నిజానికి ప్రజారాజ్యం ఓ గొప్ప ప్రయోగం. కాంగ్రెస్, టీడీపీ బలంగా పోరాడుతూంటే… ప్రజారాజ్యం.. ఓ మూడో శక్తిగా ఆవిర్భవించింది. 18 సీట్లు తెచ్చుకుంది. 71 లక్షల ఓట్లు తెచ్చుకుంది. 2009లో కాంగ్రెస్ ప్రభుత్వంపై పెద్దగా అధికార వ్యతిరేకత లేదు. టీడీపీ బలమైన ప్రతిపక్షంగా ఉంది. అయినా కూడా ప్రజారాజ్యం మూడో శక్తిగా ఆవిర్భవించింది. ఓపిక పట్టి ఉంటే 2014 నాటికి అవకాశాలు వచ్చి ఉండేవి. కానీ చిరంజీవికి అంత ఓపిక లేదు. కొద్ది కాలానికి పార్టీని మూసేసి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరేటప్పుడు.. చిరంజీవి కొన్ని షరతులు పెట్టినట్లు చెప్పుకొచ్చారు. సచార్ కమిటీ, మహిళా రిజర్వేషన్లు అంటూ.. కొంత లిస్ట్ చెప్పాడు. కానీ ఆ లిస్టులో ఏదీ కూడా పట్టించుకోలేదు. ఆయన కేబినెట్ మంత్రి కూడా కాదు. 18 అసెంబ్లీ సీట్లు, 71 లక్షల ఓట్లు తెచ్చుకుని కూడా.. ఓ కేబినెట్ పదవిని పొందలేని దుస్థితిలో ఉండిపోయారు. అంటే.. పార్టీని నడపలేను.. ఎంత త్వరగా.. పార్టీని వదిలించుకుందామా.. అన్న స్థాయిలో డిప్రెషన్ కి వెళ్లిపోయారు.
ఏపీ సమస్యలపై నోరు విప్పని చిరంజీవి..!
కాంగ్రెస్ పార్టీకి అధికారం పోయిన తర్వాత ఏపీకి చాలా అన్యాయాలు జరుగుతున్నాయి. ప్రత్యేకహోదా ఇస్తామని ఇవ్వడం లేదు. ఇలాంటి కీలకమైన సందర్భంల్లో నాలగేళ్ల పాటు..ఆయన రాజకీయాల్లో మౌనంగా ఉండిపోయారు. రాజకీయాల నుంచి విరమించుకున్నారా .. అంటే అదీ లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉండాలనుకుంటే.. కాంగ్రెస్ కు సంబంధం లేకుండా… వ్యక్తిగతంగా అయినా తన వాయిస్ వినిపించొచ్చు. విభజన హామీల అమలు కోసం గళం వినిపించొచ్చు. కానీ చిరంజీవి ప్రేక్షకపాత్రలో ఉండిపోయారు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దీని వల్ల ప్రజల్లో కచ్చితంగా సందేహాలు వస్తాయి. ఏపీకి అన్యాయం జరుగుతూంటే… పోరాడని నేత ఎలా రాజకీయ నాయకుడు అవుతారన్న అనుమానం సహజంగా వస్తుంది.
చిరంజీవికి పవన్‌కి పోలిక లేదు..!
అందుకే.. చిరంజీవి ఇప్పుడు.. వచ్చి జనసేనలో చేరితే..అదో మెగా బ్రదర్స్ కంపెనీ అవుతుంది. ఇది పవన్ కల్యాణ్ కు ఎలా ఉపయోగం అవుతుంది. ప్రజారాజ్యమే కాదు.. ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడమే కాదు.. ఇటీవలి కాలంలో.. ఏపీ సమస్యలపై మౌనంగా ఉన్నటువంటి చిరంజీవిని జనసేనలో కలుపుకుని పవన్ కల్యాణ్ ఏం సాధిస్తారు..?. 2014 నుంచి పవన్ క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు. గత ఎన్నికల్లో ఏమీ ఆశించకుండా టీడీపీ – బీజేపీకి మద్దతిచ్చారు. కానీ చిరంజీవి ఓ మంత్రి పదవి కోసం.. పార్టీని విలీనం చేసేశారు. పవన్ అవకాశం ఉండి కూడా తీసుకోలేదు. తర్వాత కూడా.. పవన్ కల్యాణ్ తర్వాత కూడా.. యాక్టివ్ గానే రాజకీయాలు చేశారు. ఇలా చూస్తే.. పవన్ కల్యాణ్ తో చిరంజీవికి అస్సలు పోలిక లేదు.
చిరంజీవి చేరితే జనసేనకు వచ్చే లాభం ఏమీ ఉండదు..!
పవన్ కల్యాణ్ ఇప్పటి వరకూ.. వారసత్వం గురించి విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు చిరంజీవి వచ్చి పార్టీలో చేరితే ఆ విమర్శలకు సీరియస్ నెస్ పోతుంది. ఇప్పుడు చిరంజీవి అభిమానులు వచ్చి పార్టీలో చేరినా చేరకపోయినా ఒకటే. ఇద్దరు హీలో అభిమనులు వేర్వేరు కాదు. మెగా హీరోల అభిమానులందరూ… వేర్వేరు కాదు. వేరే హీరోల అభిమానుల వచ్చి ఏమీ సపోర్ట్ చేయడం లేదు. దీన్ని బట్టి… చూస్తే చిరంజీవి జనసేనలో చేరితే.. వచ్చే లాభం ఏమీ ఉండదు. ఇంకా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది.