సార్వత్రిక ఎన్నికల సమరంలో.. భారతీయ జనతా పార్టీ అగ్రనేతలయిన.. నరేంద్రమోడీ, అమిత్ షాల ప్రధాన ప్రచారాస్త్రం పాకిస్తాన్. పొరుగు రాష్ట్రాన్ని శత్రువుగా చూపిస్తూ… బాంబులేస్తామని.. .. అది చేస్తామని.. ఇది చేస్తామని పదే పదే చెప్పుకుంటున్నారు. దేశభద్రత, సైనికుల అంశాన్ని రాజకీయాలకు వాడుకోవద్దని ఈసీ పదే పదే చెబుతున్నప్పటికీ.. వారిద్దరూ.. వీటిని మాత్రం ప్రచారాంశాలుగానే చేర్చుకుంటున్నారు. అంటే.. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నుంచి వీరిద్దరికే మినహాయింపు ఇచ్చినట్లుగా ఉంది.
ఎన్నికల కోడ్ మోడీ, షాలకు మాత్రమే ఎందుకు వర్తించడం లేదు..?
ఎన్నికలు జరిగుగుతున్న మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్… ఒకటే అమలవుతుంది. అది అందరికీ ఒకటే ఉంటుంది. కానీ ఇప్పుడు. దీనికి మోడీ, అమిత్ షాలు.. అతీతమైనపోయారు. అందుకే విపక్షాలు.. మోడీ కోడ్ ఆఫ్ కండక్ట్‌గా మారిపోయిందని విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు.. ఎన్నికల నియామవళిలో మార్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అధికారపార్టీకి కూడా.. ఎన్నికల నియమాళి వస్తుందని ప్రత్యేకంగా మార్పు చేయాల్సిన పరిస్థితి తెచ్చి పెట్టారు. పాకిస్తాన్‌పై బాంబులు కురిపిస్తామని.. అమిత్ షా సభల్లో ఆవేశ పడుతున్నారు. అయితే… బీజేపీ హయాంలో.. ఎన్నో పెద్ద పెద్ద ఉగ్రదాడులు జరిగాయి. ఉరీ దాడి జరిగినప్పుడు… బాంబులు కురిపించారా..? పఠాన్ కోట్ దాడి జరిగినప్పుడు.. బాంబులు కురిపించారా..?. బాలాకోట్ తర్వాత కూడా.. ఒక్క సారి కురిపిస్తే అయిపోయిందా..? . మూడు వందల మంది చనిపోయారన్నారు… అంత మంది జీహాదీలు ఉన్నారా..? వివరాలు బయటపెడితే అందరూ ఆనందిస్తారు కదా..!. అణుబాంబులున్నాయని…బెదిరిస్తున్నారు. ఎన్నికలు ఉన్నాయని.. పాకిస్తాన్ ను నిందిస్తున్నారని… రాజకీయ నేతలు.. పాకిస్తాన్ ను.. రాజకీయంగా వాడుకుంటున్నారని.. అక్కడి ప్రజలు నవ్వుకునే పరిస్థితి వచ్చింది. నిజంగా బాంబులేసేవాళ్లు మాట్లాడరు. కానీ అమిత్ షా మాత్రం బహిరంగసభలో.. ఓటర్ల ముందు మాట్లాడుతున్నారు.
ఐదేళ్లలో పాకస్థాన్పై ఎన్ని బాంబులేశారేంటి..?
అణు బాంబులు వేయాలంటే.. ఆ పని ఆర్మీ చేసుకుంటుంది. బీజేపీ కార్యకర్తలో.. ఆర్సెస్సెస్ కార్యకర్తలో.. ఈ బాంబులు వేసే పనికి వెళ్లరు. అంతా ఆత్మీనే చేయాలి. దేశ రక్షణ ఆర్మీ చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు దేశభక్తి గురించి.. బాంబులు వేయడం గురించి ఇంత పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తున్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా… తన పార్టీ నుంచి ఒక్కరంటే.. ఒక్క ప్రజాప్రతినిధి… ఎమ్మెల్యే, ఎంపీ కుమారుడైనా.. సైన్యంలో ఉన్నారో లేదో ప్రకటించాలి. ప్రాణ త్యాగాలు చేసింది సైన్యం. వారి త్యాగాలను వీరు రాజకీయాలు చేస్తున్నారు. పుల్వామా దాడిలో ఇంటలిజెన్స్ వైఫల్యం ఉంది. మోడీ.. 2014లో ప్రధానిగా అధికారం చేపట్టారు. ఆ తర్వాత వీరు చెప్పిన బాంబులు వేసి ఉంటే.. ఉరీ ఉండేది కాదు.. పఠాన్ కోట్ దాడి కూడా జరిగేది కాదు కదా..!. ఇంత కాలం ఏం చేశారు..?. నరేంద్రమోడీ.. పిలవకపోయినా..నేరుగా నవాజ్ షరీఫ్ ఇంటికి విందుకు వెళ్లారు. కౌగలించుకున్నారు. ముచ్చట్లు చెప్పారు. అప్పుడు బాంబులు తీసుకెళ్లి… గిఫ్ట్ గా ఇచ్చి రావొచ్చు కదా..!. అలా.. రెండు, మూడేళ్లలో… బాంబులు వేసి ఉంటే.. కశ్మీర్లో ఉగ్రదాడులు జరిగేవి కాదు… కదా..!
దేశభద్రతను రాజకీయంగా వాడుకోవడం దిగజారుడు తనమే..!
నరేంద్రమోడీ ప్రధాని అయిన తర్వాత.. మూడు అతి పెద్ద ఉగ్రదాడులు జరిగాయి. ఉరి, పఠాన్ కోట్, పుల్వామా దాడులు జరిగాయి. భారత్ వైపు నుంచి.. బాలాకోట్ దాడులు మాత్రమే జరిగాయి. అంతకు ముందు ఏం చేశారు మరి..?. అందుకే వీటిని రాజకీయంగా వాడుకోవడం తప్పు. ఇప్పుడు.. బీజేపీ వాడుకుంటుంది. తర్వాత బీజేపీని మించిన నేతలు వస్తారు. ఇప్పుడు శివసేన కూడా.. అదే వాడుకుంటోంది. ముందు ముందు ఈ పరిస్థితి దిగజారిపోతుంది. దేశానికో విధానం ఉంటుంది. ఫారిన్ పాలసీ ఉంటుంది. అయినా.. ఇవన్నీ పట్టించుకోకుండా… ప్రధాని స్థాయి వ్యక్తులే మాట్లాడితే.. ఇతరులు ఎందుకు ఊరుకుంటారు…?. రాజకీయ పార్టీలు ఈ అంశంలో ఇన్వాల్వ్… పాకిస్తాన్ పై అణుబాంబు వేయాలని.. పెద్ద ఉద్యమం చేస్తే… మోడీ వేసేస్తారా…?. ఇలాంటి.. దేశభద్రత అంశాలు.. బాంబులు వేయడం వంటి అంశాలను… రాజకీయాలకు అతీతంగా చూడాలి. కాసిన్ని ఓట్ల కోసం.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదు.