జగన్ పై జరిగిన దాడిని ఎవరైనా సరే ఖండించాలి. రాజకీయాల్లో వ్యక్తిగత హింసకు తావు లేదు. దాడి జరిగిన మరుక్షణం నుంచే… టీడీపీ, వైసీపీ పరస్పర విమర్శలు చేసుకున్నారు. ఓ వైపు జగన్ స్వయంగా దాడి చేయించుకున్నారనే ప్రచారాన్ని టీడీపీ నేతలు… చంద్రబాబే చేయించారన్న ఆరోపణలు.. వైసీపీ నేతలు చేయించారు. అంటే.. ఈ దాడి అంశం.. రాజకీయం అయిపోయింది. దీని వల్ల భద్రతా కోణం అనేది పూర్తిగా పక్కకు పోయి.. రాజకీయ కోణం.. ముందుకు వచ్చింది.
ముందే రిజల్ట్ ప్రకటించి విచారణ చేస్తున్నారా..?
ప్రస్తుతం వ్యవహారంలో అందరూ అందరే. తమకు అవకాశం ఉన్నంత వరకు .. రాజకీయంగా.. పాలు పిండుకోవాలన్నంత ప్రయత్నమే చేస్తున్నారు తప్ప.. ఏ వైపు కూడా.. అసలు భద్రతా పరమైన అంశం అన్న కోణం బయటకు రావడం లేదు. ముందుగా ప్రభుత్వం స్పందించినవటువంటి తీరు చూస్తే.. ఈ దాడిపైన మేం విచారణ జరుపుతున్నాం.. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేస్తున్నాం అని చెప్పారు. అదే సమయంలో ముఖ్యమంత్రి .. దాడి జరిగిన తర్వాత జగన్.. హైదరాబాద్ ఎందుకు వెళ్లారు. విశాఖ పట్నంలో ఆస్పత్రికి ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. అంతా డ్రామా అన్నారు. అలాగే.. పోలీసులు కూడా.. ఏసీపీ నుంచి డీజీపీ వరకూ… అందరూ.. జగన్ అభిమానే దాడి చేశారని చెప్పారు. అంటే.. ఓ వైపు విచారణ జరుగుతూండగానే..మరో వైపు ఏం జరగబోతోందో చెబుతున్నారు. అలాంటి విచారణకు విశ్వసనీయుత ఉంటుందా..?. ఇది ప్రచారం కోసం చేసిందని.. చేసింది కూడా… అభిమానేనని.. ఆ కత్తితో ఎలాంటి ప్రమాదం లేదని… డీజీపీ చెప్పిన తర్వాత ఇక.. సిట్ అవసరం ఏముంది..?. డీజీపీ, టీడీపీ స్టేట్మెంట్లు ఒకే రకంగా ఉన్నాయి. విచారణ దానికి భిన్నంగా జరిగే అవకాశం లేదు.
ప్రభుత్వాన్ని తొలగించాలనే కుట్ర బీజేపీ నేతలు చేస్తున్నారా..?
భద్రతా పరమైన వైఫల్యం ఎక్కడ జరిగింది..? బీజేపీ నాయకులు.. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం అని ఢిల్లీ నుంచి .. జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ఆరోపిస్తారు. అలాగే.. ఇక్కడ బీజేపీ నేతలు కూడా అదే చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలగించాలంటున్నారు. టీడీపీ ప్రభుత్వాన్ని తొలగిస్తే.. జగన్ మోహన్ రెడ్డి భద్రతా సమస్య పరిష్కారం అవుతుందా..?. ఏమైనా రాజకీయం ఉందా..?. జమ్మూకశ్మీర్ లో .. రాష్ట్రపతి పాలన పెట్టిన తర్వాత కూడా హింస చెలరేగుతోంది. దీనికి బాధ్యులెవరు..?. రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలగించాలనే డిమాండ్ చేయడం చాలా దుర్మార్గమైనది. రాజ్యాంగం చాలా స్పష్టంగా చెబుతోంది ఏమిటంటే.. రాజ్యాంగ వ్యవస్థలు విఫలమైతే తప్ప.. రాష్ట్రపతి పాలన పెట్టకూడదు. దాడి జరిగితే.. ఖండించారు. భద్రత గట్టిగా తీసుకోవాలని డిమాండ్ చేయాలని ప్రభుత్వాన్ని తొలగించాలనకూడదు. ఈ సంఘటల నుంచి రాజకీయాలు ఏ స్థాయికి వెళ్తున్నాయనేదానికి ఇదో ఉదాహరణ. అది ఎయిర్ పోర్ట్ లో జరిగింది. విమానాశ్రయ భద్రతాధికారుల చేతుల్లోనే మొత్తం వ్యవస్థ ఉంటుంది. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంటుంది. ఎందుకు మరి సురేష్ ప్రభు విచారణకు ఆదేశించారు. అంటే.. కేంద్రంతో సంబంధం ఉన్నట్లే కదా..!
మోడీనే చేయించారని టీడీపీ ఎందుకు ఆరోపిస్తోంది..?
టీడీపీ మరో అడుగు ముందుకేసింది. అంతా మోడీనే చేయించారంటున్నారు. ఆపరేషన్ గరుడలో శివాజీ చెప్పారు. అది జ్యోతిష్యం చెప్పినట్లు చెబితే దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ గరుడలో జరిగింది గుర్తు ఉంది.. జరగనిది గుర్తు ఉండదు. అంతే. శివాజీ.. చాలా తీవ్రమైన విషయాలు చెప్పారు. దాన్ని గుర్తు చేసుకుంటున్నప్పుడు.. దానిపై విచారణ జరిపించారా..? కనీసం శివాజీ దగ్గర సమాచారం తీసుకునే ప్రయత్నం చేశారా..? ఇంటలిజెన్స్ వాళ్లు పిలిపించుకుని సమాచారం తీసుకున్నారా..?. శివాజీ చెప్పింది నిజమా కాదా.. అన్నది కాదు.. నిజం కాకుండా చర్యలు తీసుకోవాలి. నిజమో.. కాదో తేల్చి చర్యలు తీసుకోవాలి. తప్పు అయితే చర్యలు తీసుకోవాలి. నిజం అయితే.. సమాచారం తెలుసుకోవాలి.
దాడితో పొలిటికల్ మైలేజ్ కోసం ప్రయత్నిస్తున్నారా..?
టీడీపీ కానీ.. వైసీపీ కానీ దీని నుంచి రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నాయి. దాడి జరిగితే.. రాజకీయలబ్ది ఏమి వస్తుంది. అలిపిరిలో మావోయిస్టులు దాడి చేస్తేనే చంద్రబాబుకు సానుభూతి రాలేదు. కానీ రాజకీయాలు చేసుకోకూడదు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుని రాజకీయ మైలేజీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయంటే… రాజకీయాల్లో… నాయకులు.. వ్యక్తిగతంగా విమర్శలు చేసుకుంటున్నారు. దీని వల్ల కింది స్థాయి కార్యకర్తలు.. తీవ్ర స్థాయిలో… ఆగ్రహావేశాలకు గురవుతున్నారు. కింది స్థాయి కార్యకర్తలు ఉన్మాదులుగా మారిపోతున్నారు. జగన్ పై ఈ రోజు జరిగి ఉండొచ్చు..రేపు మరొకరిపై జరగొచ్చు. వ్యక్తిగతంగా దూషించుకుంటున్నప్పుడు… కింది స్థాయి కార్యకర్తలు ఉద్రేకానికి గురవుతున్నారు. ఏ దేశంలో అయినా… నేతలకు వంద వంద శాతం భద్రత ప్రభుత్వాన్ని ఇవ్వలేరు. భావావేశాల్ని రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తే.. ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి.
రాజకీయ నేతలందరూ మారాలి..!
రెచ్చగొట్టి భావావేశాలు ఉద్రేకపడిన తర్వాత దాడులు జరిగితే.. వాటిని కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో మరింతగా రెచ్చగొడుతున్నారు. నన్ను కూడా అంటారు. ఇంత వరకూ.. నేను ఎవర్నీ సమర్థించకపోయినా.. నేను ఎవర్నో ఒకర్ని సమర్థించానని అంటారు. సోషల్ మీడియాలో అలా దుష్ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికైనా రాజకీయాల్లో హుందా తనం ఉండాలి. కానీ ఇప్పుడు అది లేదు. ఇటైనా.. అటైనా… ఈ దాడి నుంచి రాజకీయంగా లబ్ది పొందే ప్రయత్నం వైసీపీ చేయకూడదు. ఈ దాడిని తేలిగ్గా తీసుకుని.. ఓ ప్రతిపక్ష నాయకుని భద్రతను.. నిర్లక్ష్యం చేయకూడదు. కేంద్రంలో అధికారంలో ఉన్న వారు… వెంటనే ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేసి.. రాజకీయ అస్థిరత… సృష్టించే ప్రయత్నం చేయకూడదు.