ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ… అయోధ్య రామజన్మభూమి విషయంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా అడుగు వేస్తోంది. వివాదం సుప్రీంకోర్టు పరిధిలో ఉండటంతో.. ఏం చేయాలన్నదానిపై బీజేపీ అగ్రనేతలు, హిందూ సంస్థలు రోజుకో ప్రకటనలు చేస్తున్నాయి. అయితే కేంద్రం తాజాగా… సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. అదేమిటంటే… వివాదాస్పదం కాని భూమిని తమకు అప్పగించాలనేది.. ఆ పిటిషన్. కేంద్ర ప్రభుత్వ వాదన ప్రకారం.. అయోధ్యలో రాముడి గుడి కట్టాలనుకుంటున్న మసీదు ప్రాంతంలో 0.3 మాత్రమే వివాదాస్పదం అని.. మిగతా మొత్తంపై ఎలాంటి వివాదాలు లేవని చెబుతోంది.
వివాదాస్పదం కాని భూమి అంటూ కేంద్రం కొత్త పిటిషన్లు..!
1993లో బాబ్రీ మసీదు కూల్చి వేత జరిగిన తర్వాత.. కేంద్ర ప్రభుత్వం… అయోధ్యలోని 67 ఎకరాల్ని స్వాధీనం చేసుకుంది. ఈ 67 ఎకరాల్ని స్వాధీనం చేసుకున్న తర్వాత … 2003లో సుప్రీంకోర్టు ఓ తీర్పు చెప్పింది. ఎలాంటి నిర్మాణాలు, కార్యక్రమాలు చేపట్టకూడదని ఆదేశించింది. ఇప్పుడు కేంద్రం ఏం అడుగుతోందంటే… వివాదాస్పదంగా చెప్పి స్వాధీనం చేసుకున్న 67 ఎకరాలు మొత్తం వివాదాస్పదం కాదని… అందులో వివాదాస్పదమైన భూమిని మినహాయించి… మిగిలిచిన 63 ఎకరాలను.. రామజన్మభూమి ట్రస్ట్‌కు అప్పగించాలని కేంద్రం కోర్టుకు విజ్ఞప్తి చేస్తోంది. అలా ఇస్తే.. మందిరం నిర్మాణలు ప్రారంభం కావాలని బీజేపీ కోరుకుంటోంది. ఎన్నికలకు ముందు రామాలయ నిర్మాణం ప్రారంభం కావాలని ప్రయత్నిస్తోంది. నిజానికి వివాదాస్పదం కాదని.. కేంద్రం తనంతట తాను చెబుతోంది.. కానీ ఆ ప్రదేశంలో … రామమందిర నిర్మాణం ప్రారంభిస్తే.. అది పెద్ద రాజకీయ విషయం అయిపోతుంది. అందుకే.. బీజేపీ .. వివాదాస్పదం కాని భూమి… అని.. దానిని రామజన్మభూమి ట్రస్ట్‌కు అప్పగించాలంటూ… సుప్రీంకోర్టులో వాదిస్తున్నారు.
తీర్పు త్వరగా ఇవ్వాలని సుప్రీంకోర్టుపై ఒత్తిడి..!
రాముడి మందిరం విషయాన్ని మళ్లీ కచ్చితంగా ఎన్నికలకు ముందే.. తేవడానికి సుదీర్ఘమైన రాజకీయ కారణాలు ఉన్నాయి. చరిత్రలో చూస్తే.. భారతీయ జనతా పార్టీకి ఒకప్పుడు రెండు అంటే.. రెండు లోక్ సభ సీట్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు 280 సీట్లు ఉన్నాయి. అంటే రెండు సీట్ల నుంచి 280 సీట్లకు బీజేపీ ఎదిగిపోయింది. ఈ ఎదుగుదలకు కారణం.. రామమందిరమే. అయోధ్య వివాదాన్ని బీజేపీకి బాగా ఉపయోగించుకుంది. ఒక్క ఉత్తరప్రదేశ్ లో మాత్రమే కాకుండా.. దేశవ్యాప్తంగా ఆ పార్టీ ఎదుగుదలకు రామమందిర వివాదం కారణం అయింది. మరి బీజేపీ అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లలో అదీ కూడా పూర్తి మెజార్టీ వచ్చినప్పటికి… మందిరం నిర్మాణానికి ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఉత్తరప్రదేశ్‌లోనూ తిరుగులేని మెజార్టీతో.. ఆ పార్టీ అధికారంలో ఉంది. అయినప్పటికీ మందిర నిర్మాణ పరంగా ఒక్క అడుగు ముందుకు వేయలేదు. ఇప్పటికే సుప్రీంకోర్టులో ఓ కేసు నడుస్తోంది. అయినపపటికీ.. కొత్తగా మరో పిటిషన్ వేశారు. అదే సమయంలో.. అయోధ్య విషయంలో త్వరగా తీర్పు చెప్పాలంటే ఒత్తిడి తెస్తున్నారు. ఇన్నేళ్లు ఆగిన వారు.. ఇప్పుడే ఎందుకు తొందర పడుతున్నారు..? అంటే క్లియర్‌గా అర్థమైపోతుంది కదా.. వాళ్లకి ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల్లో లబ్ది కోసం మళ్లీ రామ మందిరాన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నారు. అందుకే సుప్రీంకోర్టు పై ఒత్తిడి తెస్తున్నారు. కానీ సుప్రీంకోర్టు మాత్రం.. తొందరేం లేదని.. అది తమకు ప్రాధాన్యతాపరమైన అంశం కాదని చెబుతోంది.
హిందూ సంస్థల డిమాండ్ మేరకు ఆర్డినెన్స్ తెస్తారా..?
ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఏర్పాటయిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ ఆలస్యమవుతోంది. దీన్ని బట్టి… ఎన్నికలకు ముందు సుప్రీంకోర్టు తీర్పు రావడం కష్టమన్న అభిప్రాయం ఏర్పడింది. తీర్పు ఎలా వచ్చినా.. దాన్ని ఉపయోగించుకునేందుకు బీజేపీ సిద్ధమయింది. అనుకూలంగా వచ్చినా.. వ్యతిరేకంగా వచ్చిన తమ శైలిలో రాజకీయాలు చేస్తుంది. ఎందుకంటే.. సుప్రీంకోర్టు.. రామ మందిరం నిర్మించాలా.. వద్దా.. అన్నదానిపై తీర్పు చెప్పదు. ఈ విషయంపై ఇప్పటికే సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. కేవలం తాము.. ఆ భూమి ఓనర్షిప్ ఎవరికి అన్నదానిపైనే తీర్పు చెబుతామని… స్పష్టం చేసింది. అందువల్ల తీర్పు ఎలా వచ్చినా రాజకీయం చేయడానికి బీజేపీ రెడీ అయింది. నిజానికి సుప్రీంకోర్టులో కేసు ఉన్నప్పటికీ.. వీహెచ్‌పీ లాంటి సంస్థలు ఆర్డినెన్స్ జారీ చేసి.. ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేశాయి. అయితే.. భూమి కోర్టు పరిధిలో ఉన్నప్పుడు.. ఆర్డినెన్స్ జారీ చేయడం వల్ల ప్రయోజనం ఏమిటని… కేంద్రం కూడా చేతులెత్తేసింది. ఆ భూమి చేతిలోకి వస్తే.. ఆర్డినెన్స్ జారీ చేయవచ్చు.
రాముడితో రాజకీయం చేస్తే తప్ప బీజేపీ నిలబడలేదా..?
అందుకే… అయోధ్యలో వివాదాస్పద భూమిని అప్పగించాలంటూ… కోర్టుకు వెళ్లారు. ఒక వేళ ఆ భూమి వస్తే.. ఆ భూమిలోనే రామ మందిరం నిర్మాణం ప్రారంభిస్తారు. ఇప్పటి వరకూ తాము గుర్తించిన ప్రదేశంలోనే రామ మందిరం కడతామని ప్రకటించారు. కానీ.. ఇప్పుడు పక్కన కడతామంటున్నారు. ఎలాగూ.. అయోధ్యలోనే కట్టడం ప్రారంభిస్తారు కాబట్టి.. తాము రామ మందిరం నిర్మిస్తామని దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తారు. ఏదో ఒక రూపంలో వివాదం చేసి లబ్ది పొందాలని ప్రయత్నిస్తున్నారు. వాజ్ పేయి హయాంలో తమకు పూర్తి మెజార్టీ లేకపోవడం వల్ల.. రామ మందిరాన్ని నిర్మించలేకపోయామన్నారు. ఇప్పుడు పూర్తి మెజార్టీ ఉన్నా కారణాలు చెబుతున్నారు. ప్రతీ ఎన్నికలకు ముందు రామ మందిరాన్ని హైలెట్ చేస్తూ రావడం ఇరవై ఏళ్లుగా చూస్తున్నారు. తండ్రి మాట కోసం సింహాసనాన్ని వదులుకున్నారు రాముడు… కానీ ఇప్పుడు సింహాసనం కోసం.. ఆ రాముడ్నే రాజకీయం చేస్తున్నారు బీజేపీ నేతలు.