ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో.. మళ్లీ టీడీపీ – జనసేన పొత్తుల వ్యవహారం కలకలం రేపింది. దీనికి టీజీ వెంకటేష్ సీట్ల సర్దుబాటు చర్చలని ప్రకటించడం.. దాన్ని పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించడమే కారణం. ఇప్పుడే కొంత కాలంగా.. తెలుగుదేశం పార్టీ నేతలు… పవన్ కల్యాణ్‌పై ఇదే విధంగా మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఈ విషయంలో పవన్ కల్యాణ్ .. కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేస్తామని చెబుతున్నారు కానీ… టీడీపీ గురించి చెప్పడం లేదు.
టీడీపీ నేతలు పవన్ కల్యాణ్ కావాలని ఎందుకు కోరుకుంటున్నారు..?
తెలుగుదేశం పార్టీ… నేతలు.. పవన్ కల్యాణ్, జనసేన విషయంలో.. పొత్తుల కోసం.. ప్రయత్నిస్తున్నట్లుగా చెప్పుకోవడానికి రాజకీయ వ్యూహం ఉంది. టీడీపీ నేతలతో మాట్లాడినప్పుడు.. వారేమి చెబుతారంటే… పవన్ కల్యాణ్ ను హ్యాండిల్ చేయడంలో… మేము ఫెయిలయ్యాం.. ఎక్కడో మిస్ ఫైర్ అయిందని చెప్పుకుంటూ ఉంటారు. అదే సమయంలో కలసి పోటీ చేస్తే.. రెండు పార్టీలకు మంచిదంటూ ఉంటారు. అలాగే.. మూడో అంశం.. కలసి పోటీ చేయకపోయినా… జగన్‌తో కలవకూడదని.. టీడీపీ కోరుకుంటోంది. ఈ మూడింటిలో.. మళ్లీ పవన్ కల్యాణ్ ను కలుపుకోవాలనే ఆలోచన చేస్తున్నారు. పవన్ కల్యాణ్ గెలిస్తే.. గట్టెక్కుతామని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. అదే జగన్‌తో కలిస్తే.. అది వారికి అడ్వాంటేజ్ అవుతుంది. అందుకే తమతో కలవకపోయినా… జగన్‌తో కలవకూడదని కోరుకుంటున్నారు. టీజీ వెంకటేష్ అలా మాట్లాడారంటే.. దానికి కారణంగా.. చంద్రబాబు .. గతంలో పాజిటివ్‌గా మాట్లాడటమే. పవన్‌తో కలిస్తే తప్పేమిటని.. చంద్రబాబు వ్యాఖ్యానించినప్పటి నుంచి… టీడీపీ నేతలు ఇలా మాట్లాడుతున్నారు.
టీడీపీని ఓడించడానికి జగన్, పవన్‌ను కలిపేందుకు ప్రయత్నించినది ఎవరు..?
తెలుగుదేశం పార్టీ వర్గాలు కూడా.. పవన్ కల్యాణ్ ఎప్పుడో ఒక సారి తమతో కలసి వస్తారని ఆశిస్తున్నారు. ఎందుకంటే.. పవన్ కల్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తే.. ఓట్లు వస్తాయేమో కానీ.. సీట్లు రావు. ప్రజారాజ్యం పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 18 సీట్లు వచ్చాయి. చిరంజీవికి ఉన్నంత వైడర్ యాక్సెప్టెన్స్ పవన్ కల్యాణ్‌కు లేదు. అందుకే.. విడిగా పోటీ చేస్తే.. ఒక్క సీటు కూడా రాకపోతే సమస్య వస్తుంది. అదే సమయంలో.. జగన్‌తో పొత్తు పెట్టుకుంటే… పోటీ ఉంటుంది. అదే చంద్రబాబునాయుడు మరోసారి గెలిస్తే.. మరో ఐదేళ్లు యాక్టివ్‌గా ఉంటారు. ఆ తర్వాత లోకేష్ వస్తారు. లోకేష్‌తో పోలిస్తే.. పవన్ కల్యాణ్‌కే అడ్వాంటేజ్ ఉంటుంది. అందుకే… పవన్ కల్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకుంటారని భావిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి.. ఓ తప్పు చేశారు. అదే పవన్ కల్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేశారు. ఇలా విమర్శలు చేయడం వల్ల.. జగన్‌తో కలిసే అవకాశం లేకుండా పోయింది. పవన్ కల్యాణ్‌పై జగన్ వ్యక్తిగత విమర్శలు చేయకపోతే.. రాజకీయపరిస్థితి కొంత వేరుగా ఉండేది. పవన్ కల్యాణ్… ఎవరితోనూ పొత్తులు ఉండవని.. కమ్యూనిస్టులతో మాత్రమే కలసి పోటీ చేస్తామని పదే పదే చెబుతున్నారు. అంటే.. అటు టీడీపీతో కానీ.. వైసీపీతో కానీ పొత్తులు పెట్టుకోనట్లే. అయితే ఆయన మనసులో ఏముందో తెలియదు. టీడీపీని ఓడించాలనుకునేవాళ్లందరూ… జగన్, పవన్ ను కలపాలని అనుకుంటున్నారు. ఇందులో బీజేపీ కూడా ఉంది. టీఆర్ఎస్ కూడా.. వారిద్దర్నీ కలపడానికి ప్రయత్నిచింది. పవన్ కల్యాణ్ కూడా.. జగన్ తరపున టీఆర్ఎస్ నేతలు రాయబారానికొచ్చారని ప్రకటించారు. పవన్ ఈ మాట అన్న తర్వాత టీఆర్ఎస్ నేతలు జగన్ ను కలిశారు. అంటే.. కలపడానికి ప్రయత్నించారు. అంటే.. టీఆర్ఎస్ వారిద్దర్నీ కలపడానికి ప్రయత్నించింది.
చంద్రబాబు నిర్ణయాలు రాజకీయంగా లాభిస్తాయా..?
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధినేత… తనకు వ్యతిరేకంగా ఉన్న వాటిని.. పాజిటివ్ గా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. సంక్షేమ పథకాల్లో దూకుడు ప్రదర్శిస్తున్నారు. పెన్షన్లు డబుల్ చేశారు. మహిళలకు రూ. 10వేలు ఇస్తున్నారు. రైతులకు నగదు బదిలీ చేస్తున్నారు. ఇలా… తనకు వ్యతిరేకంగా అంటే.. ప్రభుత్వ వ్యతిరేకతను న్యూట్రలైజ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ కేసీఆర్ ఇంకా ఎన్నికల హామీల అమలు ప్రారంభించలేదు. ఏప్రిల్ తర్వాత అని చెబుతున్నారు. అయితే చంద్రబాబు మాత్రం వాటి అమలు ప్రారంభించారు. ప్రభుత్వ వ్యతిరేకతను సంక్షేమంతో ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే… పవన్ కల్యాణ్‌ను న్యూట్రలైజ్ చేయడం.. కాంగ్రెస్ పార్టీని దూరం పెట్టడం.. బీజేపీని ఎదుర్కోవడానికి ఇప్పుడు రాజకీయాలు చక్కబెడుతున్నారు.