రజనీకాంత్ “కాలా” సినిమాను కర్ణాటకలో విడుదలవకుండా.. కన్నడ సంఘాలు అడ్డుకున్నాయి. దాడుల భయంతో.. సినిమాను ప్రదర్శించేందుకు ధియేటర్ల యాజమాన్యాలు ముందుకు రాలేదు. కర్ణాటక పిల్మ్ చాంబర్ కూడా.. తమదైన కారణాలతో..నిషేధానికే మద్దతు పలికింది. దీనికి కారణం.. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కావేరీ బోర్డును ఏర్పాటు చేయాలని రజనీకాంత్ డిమాండ్ చేయడమే. ఇదే తప్పన్నట్లు కన్నడ నాట కాలా సినిమాకు వ్యతిరేకంగా ఉద్ధృతమైన ప్రచారం జరిగింది. చివరికి హైకోర్టు కూడా..విడుదలకు ఎలాంటి ఆటంకాలు కల్పించవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ధియేటర్లకు భద్రత కల్పించాలని స్పష్టించింది. కానీ ముఖ్యమంత్రి కుమారస్వామి మాత్రం… ఇలాంటి సమయంలో కాలా విడుదల కాకపోవడమే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తిగత హోదాలో వ్యక్తీకరించారు. కానీ హైకోర్టు చెప్పినట్లు ముఖ్యమంత్రి హోదాలో పూర్తి స్థాయి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. కానీ ముఖ్యమంత్రి నోట…విడుదల కాకపోవడమే మంచిదన్న అభిప్రాయం వస్తే… ఇక సినిమా విడుదలకు ధియేటర్ యాజమాన్యాలు ఎలా ధైర్యం చేస్తాయి..?
“భావోద్వేగాలు రెచ్చగొట్టడం” దేశసమస్య
ఈ సమస్య ఒక్క కర్ణాటకలో ఉన్నదే కాదు.. కావేరీ పేరుతో భావోద్వేగాలను కర్ణాటకలో రెచ్చగొట్టారు. ఉపయోగించుకున్నారు. కానీ దేశంలో ప్రతి రాష్ట్రంలోనూ.. ప్రతీ ప్రాంతంలోనూ ఈ భావోద్వేగాలను రెచ్చగొట్టే అంశాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. నిజానికి కాలా సినిమా రజనీకాంత్ ఒక్కడితే కాదు. అందులో అనేక మంది ఇతర నటీనటులు నటించారు. సాంకేతిక నిపుణులు కన్నడిగులు కూడా పని చేసి ఉంటారు. కానీ అది రజనీకాంత్ ఒక్కడిదేనన్నట్లుగా ఆపాదించి.. కావేరీ ఇష్యూకు ముడిపెట్టి సినిమాను నిలిపివేశారు. వాస్తవంగా.. సినిమాను విడుదల చేసుకోవడం.. రాజ్యాంగపరమైన హక్కు. అలాగే.. ఇష్టం వచ్చిన సినిమాను చూసే హక్కు కూడా.. ప్రజలకు ఉంది. దీన్ని ఎవరూ కాదలేనరు. కానీ బలవంతంగా సినిమాను అడ్డుకున్నారు. సినిమా చూడాలనుకున్న వారి హక్కును అడ్డుకున్నారు. ఈ ప్రాథమిక హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ ప్రభుత్వానే ఇలాంటి భావోద్వేగాలను రెచ్చగొట్టెందుకు సహకకరిస్తున్నాయి. ఇంటే.. ఇది పూర్తిగా ప్రభుత్వాల చేతకానితనం తప్ప మరొకటి కాదు.
బహిష్కరణకు పిలుపునివ్వాలి.. ప్రజలకు చాయిస్ ఇవ్వాలి..!
నిజానికి ఈ కన్నడ సంఘాలు చేయాల్సింది అడ్డుకుంటామని ప్రకటించడం కాదు.. వారికి అంత పలుకుబడి ఉంటే సినిమాను బహిష్కరించాలని ప్రజలకు పిలుపునివ్వాలి. రజనీకాంత్ కావేరీ బోర్డుకు అనుకూలంగా మాట్లాడారు కాబట్టి.. రజనీకాంత్ సినిమాను కన్నడ ప్రజలు చూడొద్దని పిలుపునివ్వాలి. ప్రజలంతా స్వచ్చందంగా సినిమాను బహిష్కరించేలా చైతన్యం వంతం చేసుకోవాలి. అది నిరసన అవుతుంది. కానీ బెదిరించి.. భయపెట్టి.. సినిమాను ప్రదర్శిస్తే.. థియేటర్లను బద్దలు కొడతామని చెప్పడం మంచిది కాదు. ఇది ఒక్క కర్ణాటకలో మాత్రమే జరగడం లేదు. తెలంగాణ ఉద్యమంలోనూ జరిగింది. సినిమా వాళ్లంతా ఆంధ్రా వాళ్లేనని ..సినిమాలను అడ్డుకున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తే… సినిమా వాళ్లందర్నీ పిలిచి తెలంగాణ ప్రభుత్వం సన్మానం చేసింది. అప్పుడు అడ్డుకున్న వారే తర్వతా ప్రియమైన వాళ్లయ్యారు. అంటే.. ప్రజల భావోద్వేగాలను.. ఉద్యమం సమయంలో.. ఉపయోగించుకున్నారు. తర్వాత ఆ అవసరం రాలేదు.
సంబంధం లేని వాళ్లపైనే భావోద్వేగ ఆటలు..!
ఇదే తరహా భావజాలం.. దేశాల మధ్య ఉన్న విబేధాల విషయంలోనూ ఉపయోగించుకుంటున్నారు. పాకిస్థాన్ నుంచి ఎవరైనా విద్వాంసులు వచ్చి కచ్చేరీ చేసినా .. అడ్డుకుంటారు. క్రికెట్ ఆడినా అడ్డుకుంటామంటారు. వారికి తీవ్రవాదానికి సంబంధం ఏమీ లేదు. పాకిస్తాన్ వాళ్లు ఎవరైనా వస్తామంటే.. తీవ్ర స్థాయిలో ఇక్కడ భావోద్వేగాలను రెచ్చగొడతారు. కానీ అదే ప్రధానమంత్రి అయిన నేరుగా పాకిస్థాన్ వెళ్లిపోయి.. అక్కడి ప్రధానితో విందులు ఆగరించి వస్తారు. కానీ దీనిపై ఎలాంటి ఇష్యూలు చేయరు. గొప్పగా ప్రచారం చేసుకోవడానికి వెనుకాడరు. అదే సాధారణ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టాలంటే.. మాత్రం రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేదని సినిమా, క్రీడలు, కళలను ఉపయోగించుకుంటారు.
ఎంత పబ్లిసిటీ వస్తే అంత ఆందోళన..!
కట్టప్ప సత్యరాజ్ ఎప్పుడో ఏదో కావేరీ గురించి వ్యతిరేకంగా మాట్లాడారని.. బాహుబలి సినిమాను కర్ణాటకలో విడుదల కానీయబోమని కన్నడ సంఘాలు హెచ్చరించాయి. నిజానికి అలా అన్న తర్వాత సత్యరాజ్ నటించిన ఎన్నో సినిమా కర్ణాటకలో విడుదలయ్యాయి. అయినా సరే కన్నడ సంఘాలు బాహుబలిని టార్గెట్ చేసుకున్నాయి. ఇప్పుడు సినిమా స్టార్లు .. రాజకీయాల్లోకి విరివిగా వస్తున్నారు. వారి సినిమాలపై రాజకీయ ప్రభావం తప్పకుండా ఉంటుంది. అందుకే వీరి సినిమాల విషయంలో భావోద్వేగాలు రెచ్చగొట్టి.. రాజకీయం చేద్దామనుకుంటున్నారు. సినిమాలు, క్రికెట్, కళలు సాప్ట్ టార్గెట్ కావడానికి కారణం.. భారీగా పబ్లిసిటీ వస్తూండటమే..
సినీ, క్రీడాతారలూ బాధ్యతాయుతంగా ఉండాలి..!
ఇలాంటి సమయంలో సినిమా తారలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుంది. వారు కూడా.. తమ రాజకీయ ప్రయోజనాల కోసం భావోద్వేగాలు రెచ్చగొట్టడం కాకుండా.. మెరగైన పరిష్కార మార్గాలను అన్వేషిస్తే బాగుంటుంది. రజనీకాంత్ కావేరీ అంశంపై.. కుమారస్వామితో చర్చించి.. రెండు రాష్ట్రాల ఉద్రిక్తతలు పె రగకుండా చూడాల్సింది. కమల్ హాసన్ అదే చేశారు.
దేశంలో సమస్యలపై… సినిమా, క్రీడా రంగంలో ప్రముఖులు ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటే ఇలాంటి సమస్లు రావు. కానీ… దేశంలో ఉన్న రైతుల సమస్యలు కానీ.. ఇతర మౌలిక సమస్యలపై ఏ ఒక్క సినీ స్టార్ కానీ.. ప్రముఖ క్రీడాకారులు కానీ స్పందించారు. వారికి సంబంధించిన ఏమైనా సమస్య వస్తే మాత్రమే పోరాడుతున్నారు. వారు ఉన్న రంగాలు…ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉంటాయి.. కాబట్టి వారు కూడా ప్రజాసమస్యలపై స్పందిస్తే.. ఇలాంటి భావోద్వేగాలను రెచ్చగొట్టేవారిని కంట్రోల్ చేసినట్లవుతుంది. ఇప్పుడు ఇదే ముఖ్యం.