తెలంగాణలో ఇప్పుడు ముఖ్యమంత్రి, హోంమంత్రి మాత్రమే ఉన్నారు. ఇతర మంత్రులెవరూ లేరు. నెలాఖరు వరకూ.. మంత్రి వర్గాన్ని విస్తరించే ప్రణాళికలు ఏవీ కేసీఆర్ వద్ద ఉన్నట్లు కనిపించడం లేదు. ఇప్పుడు ప్రభుత్వం… కేవలం ముఖ్యమంత్రి, హోంమంత్రి చేతుల మీదుగానే నడుస్తోంది. హోంమంత్రి హోంశాఖ మాత్రమే చూసుకుంటారు. ఇతర వ్యవహారాలు చూసుకోలేరు. మిగతా శాఖల వ్యవహారాలు మొత్తం ముఖ్యమంత్రే చూసుకోవాల్సి ఉంటుంది.
ఎన్టీఆర్లాగే మంత్రులు లేకుండా ప్రభుత్వాన్ని నడుపుతున్నారా..?
1989లో అనుకుంటా… అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ … కేబినెట్ మొత్తాన్ని తొలగించారు. బడ్జెట్ లీకయిందన్న కారణంగా.. మంత్రివర్గ సభ్యులను మొత్తాన్ని తొలగించారు. ఆయన ఒక్కరే పదిహేను రోజుల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మంత్రులెవరూ లేరు. మంత్రివర్గం లేకుండా ముఖ్యమంత్రి పాలన సాగించారు. రాజ్యాంగం ఇందుకు అంగీకరిస్తుంది. ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తారు. మంత్రివర్గాన్ని ముఖ్యమంత్రిని నియమించుకుంటారు. ఎంత మంది మంత్రులుండాలనేది ముఖ్యమంత్రుల ఇష్టం. తర్వాత వచ్చిన చట్టం ప్రకారం.. అసెంబ్లీలోని సభ్యుల సంఖ్యలో పదిహేను శాతానికి మించి ఏర్పాటు చేయకూడాదని చట్టం తెచ్చారు. అంతే కానీ… కచ్చితంగా అంత మందిని మంత్రులుగా చేయాలని లేదు. నలుగురు మంత్రులతో అయినా ప్రభుత్వాన్ని నడుపుకోవచ్చు. ఇద్దరు మంత్రులతో అయినా నడుపుకోవచ్చు. రాజ్యాంగంలో ఇంత మంది మంత్రులు ఉండాలని లేదు. అంటే.. అప్పట్లో ఎన్టీఆర్.. ఇప్పుడు కేసీఆర్ మంత్రివర్గం లేకుండానే పదిహేను రోజుల పాటు పాలన సాగిస్తున్నారని అంచనా వేసుకోవచ్చు. అప్పుడు ఎన్టీఆర్.. ఒక్క మంత్రిని కూడా.. పదవిలో ఉండనీయలేదు. ఇప్పుడు కేసీఆర్ మాత్రం ఓ మంత్రిని నియమించుకున్నారు.
ఎన్టీఆర్‌లా జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పబోతున్నారా..?
ఎన్టీఆర్‌కు తాను శిష్యుడినని కేసీఆర్ చెప్పుకుంటారు. ఆయన తన కుమారుడికి.. ఎన్టీఆర్ పేరు కూడా పెట్టారు. అయితే.. ఆయన పనితీరును చూసి ప్రభావితం అయ్యారో లేదో చెప్పలేము. ఇద్దరిలో ఉన్న మరో కామనాలిటి..తెలుగు భాషపై అభిమానం. ఇద్దరికీ.. తెలుగు భాషపై పట్టు ఉంది. ఇద్దరూ … మంచి వక్తలు కూడా. యాస వేరు అయినా… ఇద్దరూ… గొప్ప కమ్యూనికేటర్లు. ఎన్టీఆర్.. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా వ్యవహరించారు. కాంగ్రెసేతర పార్టీలనూ కూడగట్టడంలో కీలక పాత్ర పోషించారు టీడీపీ ఓ దశలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. గుర్తింపు పొంద లేదు కానీ… నెంబర్ టూ పార్టీగా ఉంది. ఈ రకమైన చరిత్ర టీడీపీకి ఉంది. ఇప్పుడు టీఆర్ఎస్ అధినేత కూడా.. అదే చేద్దామనుకుంటున్నారు. తెలంగాణలో పదహారు సీట్లు గెలిచి..కాంగ్రెసేతర, బీజేపీయేతర కూటమిని సిద్ధం చేస్తానని చెబుతున్నారు. ఎన్టీఆర్ మండల వ్యసవ్థ తెచ్చి పాలనను వికేంద్రీకరించారు. కేసీఆర్ కూడా.. మండలాలు పెంచి.. జిల్లాలు పెచి.. డివిజన్లు పెంచి.. పాలనను వికేంద్రకరీస్తున్నారు.
ఇద్దరికీ మధ్య భాష, నమ్మకాలు, విజయాల్లో పోలికలు ఉన్నాయా..?
అంతే కాదు.. ఇద్దరికీ కూడా.. జ్యోతిష్యం మీద.. వాస్తు మీద మంచి నమ్మకం ఉంది. కేసీఆర్‌కు లక్కీ నెంబర్లు నమ్మకాలు ఉన్నాయి. అలాగే.. ఇద్దరూ.. ఏకపక్ష పాలనకు నిదర్శనాలుగా ఉంటారు. కామనాలిటికీ.. నమ్మకాల్లోనే కాదు.. పనితీరులోనూ ఉంది. ఎన్టీఆర్ కేబినెట్లో ఉన్న వాళ్లయినా… కేసీఆర్ కేబినెట్లో ఉన్న వారికైనా… ఎవరికీ పెద్దగా స్వతంత్రత ఉండదు. ఇద్దరూ కూడా చరిత్ర సృష్టించిన నేతలు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చారు. కేసీఆర్.. సుదీర్ఘంగా పోరాడి తెలంగాణ సాధించారు. ఇద్దరికీ… పోలికలు ఉన్నాయి. కంటెంపరరీ పొలిటికల్ లీడర్స్‌లో .. ఈ కంపేరిజన్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అదే సమయంలో వ్యత్యాసాలు కూడా ఉండొచ్చు. ఉండవని చెప్పలేం. కానీ.. కామనాలిటీస్ మాత్రం మనకు కనిపిస్తున్నాయి.