దేశంలో ప్రస్తుతం ” మీ టూ” అనేది ఇప్పుడో హాట్ టాపిక్ అయింది. గతంలో హాలీవుడ్లో బయటకు వచ్చింది. తర్వాత ఇండియాలో బయటకు వచ్చింది. మెల్లగా అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీలను ఇతర రంగాల్లో కూడా.. ఈ ” మీ టూ” ఉద్యమం వ్యాపిస్తోంది. ” మీ టూ” అంటూ.. నేను కూడా.. లైంగిక వేధింపులకు గురయ్యాను..అని చెబుతూ… తన అనుభవాలను బయటపెట్టి.. వేధించిన వారి గుట్టు రట్టు చేయడం. ఇది కాస్టింగ్ కౌచ్ అనే ప్రస్తావన వచ్చినప్పుడు.. గ్లామర్ ఇండస్ట్రీలో.. మహిళలకు అవకాశాలు కల్పిస్తామన్న పేరుతో… వారిని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తిరస్కరిస్తే.. కెరీర్ దెబ్బతింటుందనే భయంతో.. వాళ్లు బాధల్ని దిగమింగుకుని లైంగిక వేధింపుల్ని ఎదుర్కొంటున్నారు.
లైంగిక వేధింపులు అన్ని రంగాల్లో ఉన్నాయా..?
” మీ టూ” ఉద్యమం ఒక్క సినిమా రంగంలోనే కాదు… మీడియా రంగంలోనూ ఇలాంటి వేధింపులు ఉన్నాయని బయటకు వచ్చాయి. చాలా మంది ఎడిటర్లపై ఆరోపణలు వచ్చాయి. మాజీ జర్నలిస్టు, ప్రస్తుత కేంద్రమంత్రి ఎంజె ఆక్బర్పై కూడా ఆరోపణలపై వచ్చాయి. విచారణ జరిపించాలని మేనకాగాంధీ డిమాండ్ చేశారు. తన జూనియర్ మంత్రిపై వచ్చిన ఆరోపణలపై స్పందించడానికి సుష్మస్వరాజ్ నిరకరించారు. అలాగే ” మీ టూ” పై వ్యతిరేకంగా మాట్లాడిన వారు కూడా ఉన్నారు. బీజేపీ ఎంపీ ఉదిత్ రాజ్.. ఇదంతా బ్లాక్మెయిల్ అన్నారు. ఒకసారి చర్చ ప్రారంభమైన తర్వాత ఇది కేవలం .. ఫిల్మ్, మీడియా ఇండస్ట్రీల్లోనే కాదు.. మొత్తం.. పని ప్రాంతాల్లో స్త్రీ పడుతున్న ఆవేదనే ఇదే. పని ప్రదేశంలో లైంగిక వేధింపులు.. వ్యవసాయ కూలీల దగ్గర్నుంచి… అత్యున్నత రంగాల వరకూ ఉన్నాయి. వ్యవసాయకూలీలు, అసంఘటిత రంగంలోని కూలీలపై… తీవ్రమైన అత్యాచార ఘటనలు జరుగుతూ ఉంటాయి. కానీ ఎవరూ పట్టించుకోలేరు. సెలబ్రిటీలు ఇలాంటి ఇష్యూలు హైలెట్ చేయడంతో.. మీడియా కూడా.. ప్రాధాన్యత ఇస్తోంది.
పది, ఇరవై ఏళ్ల తర్వాత చెబితే ఉపయోగం ఏమిటి..?
ముఖ్యంగా ఇది మధ్యతరగతి మహిళలు పని చేసే చోట…లైంగిక వేధింపుల అంశం.. హైలెట్ కావడంతో… దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు ధైర్యం రావడంతో.. పదేళ్ల క్రితం.. ఇరవై ఏళ్ల క్రితం… తాము లైంగిక వేధింపులు అనుభవించామంటూ.. ధైర్యంగా బయటకు వచ్చి చెబుతున్నారు. దీనిపై ఉన్న క్వశ్చన్ ఏమిటంటే… వారు చెప్పేదంతా నిజమా..?. ఎవరిపైనా..” మీ టూ” పేరుతో.. ఓ కామెంట్ చేసి వదిలేస్తున్నారు. ఇలా చేయడం వల్ల… ఆరోపణలకు గురైన వారి రిప్యూటేషన్ దెబ్బతినదా..? ఇది బ్లాక్మెయిల్ కాదా..? అనేది ఓ విమర్శ. అలాగే.. పదేళ్ల తర్వాత.. ఇరవై ఏళ్ల తర్వాత కంప్లైంట్ చేయడం కరెక్టా..? అన్నది రెండో ప్రశ్న. సెక్సువల్ హరాస్మెంట్కు గురైన.. మహిళ బాధ, ఆవేదన జీవితాంతం ఉంటుంది. ఆ గాయం జీవితాంతం ఉన్నప్పుడు.. ఆ గాయానికి ఉపశమనం కోసం ప్రయత్నించడంలో తప్పు లేదు. పదేళ్లయినా.. ఇరవై ఏళ్లయినా.. లైంగిక వేధింపులకు గురైన మహిళ తన ఆవేదనను చెప్పుకోవచ్చు. తనపై లైంగిక వేధింపులకు పాల్పడి… సమాజంలో పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్న వారి వ్యవహారాన్ని బయటపెట్టొచ్చొచ్చు. చాన్నాళ్ల క్రితమే… బిల్ క్లింటన్‌పై … ఆరోపణలు చేశారు. ఆయన ఒప్పుకున్నారు కూడా. పదేళ్ల తర్వాత చెప్పామా..? ఇరవై ఏళ్ల తర్వాత చెప్పామా..? అన్నది కాదు. లైంగిక వేధింపుల బారిన పడిన బాధితురాలు… తన బాధను చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు విచారణ జరపగలమా..? సాక్ష్యం ఉంటుందా..? శిక్ష పడుతుందా.. అన్నది తర్వాతి ప్రశ్న. అది చట్టం చూసుకుంటుంది. అంతే కానీ… మాట్లాడకూడదని… చెప్పడం సరికాదు.
” మీ టూ” పేరుతో బ్లాక్‌మెయిలింగ్ చేస్తున్నారా..?
వీళ్లందరూ చెప్పేది నిజమా అనేది.. మరో సందేహం. అందరూ చెప్పేది నిజం కాకపోవచ్చు. కొంత మంది ” మీ టూ” ముసుగులో బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడతారు. అలాంటి వాళ్లు ఉండవచ్చు. అందుకని అందరూ అబద్దాలు చెబుతున్నారని తీసి పారేయలేం. నిజానికి చాలా మంది… ” మీ టూ” పద్దతిలో ఆరోపణలు చేస్తున్న వారు… ఉన్న స్థానాల్లో ఉన్నవారు ఉన్నారు. వారికేమీ… ఇలా బ్లాక్ మెయిల్ చేయాల్సిన అవసరం లేదు. బ్లాక్మెయిల్ చేసే వాళ్లు ఎక్కడో ఒకరు ఇద్దరు ఉండవచ్చు. అంత మాత్రాన..అందరూ అలాగే ఉంటారని చెప్పలేం. ” మీ టూ” కాంట్రిబ్యూషన్ ఏమిటంటే.. సమాజంలో పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్న వారు మనుషుల్ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారనే అంశం… సమాజం ముందు ఉంచడానికి ఉపయోగపడింది. సమాజంలో ఎప్పుడు ఈ అవగాహన పెరుగుతుందో… అప్పుడు ఇలాంటి లైంగిక వేధింపులు తగ్గుతాయి. అలాంటి పనులు చేసే వాళ్లు కూడా తగ్గుతారు.
పని చేసే చోట మహిళలు గౌరవాన్ని ఎలా పొందాలి..?
పని చేసే చోట గౌరవంగా పని చేయగలగాలి. అది వర్కింగ్ ఉమెన్‌కు ఫండమెంటల్ రైట్ అనేది… ” మీ టూ” క్యాంపెన్ ప్రపంచానికి చాటి చెబుతోంది. వర్క్ ప్లేస్‌లో గౌరవప్రదంగా ఉండటం అనేది మహిళల హక్కు అనేదాన్ని ” మీ టూ” ప్రపంచం దృష్టికి తీసుకెళ్తోంది. సుప్రీంకోర్టు.. దీనిపై చాలా క్లియర్‌గా ఓ తీర్పు చెప్పింది. ప్రతి వర్క్ ప్లేస్‌లో లైంగిక వేధింపులను నిరోధించడానికి కమిటీలు ఉండాలని తీర్పు చెప్పింది. కానీ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో.. యాంటీ సెక్సువల్ హరాస్ మెంట్.. కమిటీల్ని ఏర్పాటు చేయలేదు. ఈ ” మీ టూ” ఉద్యమం ద్వారా కొంత అయినా ఇలాంటి కమిటీల్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
సెక్సువల్ హరాస్మెంట్ అంటే.. ఏమిటి..?
అసలు సెక్సువల్ హరాస్మెంట్ అంటే.. ఏమిటి..? . అసభ్యంగా మాట్లాడినా.. ద్వంద్వార్థాలు వచ్చేలా మాట్లాడినా.. వికృత చేష్టలు చేసినా… నైతిక విరుద్ధమైన కాంటాక్ట్ కోసం ప్రయత్నించినా.. ఇదంతా.. సెక్సువల్ హరాస్ మెంట్ అంటారు. కేవలం బలాత్కరం చేస్తేనే సెక్సువల్ హరాస్ మెంట్ ని కొంత మంది అనుకుంటారు. మహిళల్ని ఎక్స్‌ప్లాయిట్ చేసే.. ప్రతీ చర్య సెక్సువల్ హరాస్మెంట్ కిందకే వస్తుంది. అందువల్ల.. సుప్రీంకోర్టు చెప్పినట్లు..విశాఖ తీర్పు అమలు కావడం లేదు. అది అమలవడానికి .. పని ప్రదేశంలో మహిళలు గౌరవాన్ని పొందడానికి ” మీ టూ” ఉద్యం ఉపయోగపడుతుంది.