తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు మజ్లిస్ పాత్ర కీలకంగా మారింది. మజ్లిస్‌పై తీవ్రంగా విమర్శలు చేస్తూ .. బీజేపీ ప్రచారం చేస్తోంది. మజ్లిస్ తమ మిత్రపక్షం అని కేసీఆర్ బహిరంగంగా చెబుతున్నారు. కేవలం ఎనిమిది స్థానాల్లోనే పోటీ చేస్తున్న మజ్లిస్ మిగతా అన్ని చోట్లా టీఆర్ఎస్కు మద్దతివ్వమని ముస్లింలకు పిలుపునిస్తోంది. మజ్లిస్ అంటే.. ఓవైపీ బ్రదర్స్… . ఓవైసీ బ్రదర్స్ అంటే మజ్లిస్. వీరికి ఏది రాజకీయంగా కంటే ఆర్థికంగా ఏది లాభం అయితే అదే చేస్తారు. ఇందులో రాజకీయం లేదు.. .. సిద్ధాంతం.. విలువలు.. లాంటివేమీ వాళ్లు పెట్టుకోరు. ముస్లింల ఉద్ధరణ అసలే లేదు.
సొంత లాభం కోసమే ఓవైసీ బ్రదర్స్ రాజకీయం చేస్తారా..?
హైదరాబాద్ రాజకీయాల్లో చాలా మందికి ఓ అభిప్రాయం ఉంటుంది. ముస్లింలను ఉద్ధంరించడానికి ఓవైసీ రాజకీయం చేస్తున్నారని.. అనుకుంటూ ఉంటారు. ఇది ఎవర్నీ ఉద్ధరించడానికి కాదు. ఓవైసీ కుటుంబాన్ని ఉద్ధరించడానికి మాత్రమే మజ్లిస్ పని చేస్తుంది. పదేళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలోఉంది. అప్పుడు మజ్లిస్ వైఖరి ఏమిటి..?. కాంగ్రెస్ పార్టీతో సన్నిహితంగా ఉండటం. నిజానికి ఓవైసీ బ్రదర్స్.. అటు పార్లమెంట్లో మాట్లాడినా.. ఇటు అసెంబ్లీలో మాట్లాడినా.. చాలా లోతుగా సబ్జెక్ట్‌ను స్టడీ చేసి వచ్చి మాట్లాడుతారు. వారికి మంచి తెలివి తేటలు ఉన్నాయి. నేను శాసనమండలి సభ్యుడిగా ఉన్నప్పుడు.. అసెంబ్లీలో వారి పనితీరును ప్రత్యక్షగా చూశా. కానీ వారు వీధుల్లోకి వచ్చి చేసే రాజకీయాలు చూస్తే.. భూమికి.. ఆకాశానికి ఉన్నంత తేడా ఉంటుంది. పాతబస్తీలో రాజకీయంగా తమ పట్టు ఉంచుకోవాలి.. మైనార్టీలపై తమ పట్టు ఉంచుకోవాలని.. వాళ్లు ప్రయత్నిస్తూ ఉంటారు. దానికి తగ్గట్లుగానే.. అక్కడి ప్రజలకు.. ఓవైసీ బ్రదర్స్.. ఏమీ చేయడం లేదని తెలిసినా ఓట్లు వేస్తూ ఉంటారు. ఇది ఎప్పుడు మారుతుందో తెలియదు.
మజ్లిస్‌తో మితృత్వం వల్ల కేసీఆర్‌కు కలిగే లాభం ఏమిటి..?
లౌకిక పార్టీలు అని చెప్పుకునే పార్టీలు.. అధికారంలో ఉన్నప్పుడు.. ఓల్డ్ సిటీలోకి చొచ్చుకు వెళ్లి ఓవైసీ బ్రదర్స్ ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం చేయలేదు. పదేళ్ల కాంగ్రెస్ పార్టీ చేయలేదు. ఈ నాలుగున్నరేళ్ల కాలంలో కేసీఆర్ చేయలేదు. చేయకపోగా… మజ్లిస్ బలపడేందుకు సహకరించారు. తెలంగాణలో పన్నెండు శాతం జనాభా ఉన్నారు. వీరి సగంలో హైదరాబాద్ లో ఉంటే.. సగం మంది జిల్లాల్లో ఉంటారు. ఆదిలాబాద్, భైంసా, నిర్మల్, కరీంనగర్ లాంటి చోట్ల ఉంటారు. అందుకే.. ఓల్డ్ సిటీ మీకిచ్చేస్తాం..మిగతా చోట్ల మాకివ్వడం మద్దతు అని వైఖరి అధికార పార్టీ తీసుకుంటున్నది. ఈ వైఖరిలో భాగంగా… ఈ రోజు టీఆర్ఎస్.. ఎంఐఎం బహిరంగంగానే… కలసి పోటీ చేస్తున్నట్లు ప్రకటించుకున్నారు. బల్లగుద్ది మరీ కేసీఆర్ … తమ మధ్య మితృత్వం ఉందని ప్రకటించుకున్నారు. దానికి కేసీఆర్ విచిత్రమైన కారణం చెప్పుకున్నారు. తమది సెక్యూలర్ పార్టీ కాబట్టి.. బీజేపీతో కలవబోమన్నారు. అదే ఎంఐఎంతో కలిశారు. మరి ఎంఐఎంతో సెక్యూలరిజం ఎలా అవుతుంది..?
వైఎస్ హయాంలో కాంగ్రెస్‌తో అంటకాగి లాభం పొందారా..?
బీజేపీ కన్నా.. ఎంఐఎం భావజాలం మరింత ప్రమాదకరం. ఇలాంటి వాళ్ల వల్ల బీజేపీ పెరుగుతోంది. మైనారిటీ ఉన్మాదం అయినా.. మెజారిటీ ఉన్మాదం అయినా.. ఈక్వల్ గా వ్యతిరేకించాలి. అక్బరుద్దీన్ ఓవైసీ.. ఎక్కడికి వెళ్లినా.. మత విద్వేషాలు రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేస్తారు. ఏ చర్యలు తీసుకోరు. కాంగ్రెస్‌తో ఎంఐఎం సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నప్పుడు.. వైఎస్ హయాంలో… 2009లో డిమిలిటేషన్ జరిగింది. ఈ డిలిమిటేషన్ కన్నా ముందు ఎంఐఎంకు నాలుగు సీట్లు వచ్చేవి. అప్పట్లో మజ్లిస్ కు పోటీకిగా.. మజ్లిస్ బచావో తెహ్రిక్ అనే పార్టీ ఉండేది. నిజంగా.. లౌకిక పార్టీలకు అదో అవకాశం. కానీ ఏం చేశారు.. మజ్లిస్‌తో మద్దతు పలికారు. కిరణ్ కుమార్ రెడ్డి వచ్చే వరకూ కాంగ్రెస్ పార్టీతో మజ్లిస్ అవగాహన కొనసాగింది. ఈ అవగాహన వలన రెండు పనులు చేసుకున్నారు. ఒకటి ఎంబీటీని బలహీనపర్చారు. దాదాపుగా లేకుండా చేశారు. ఒక సమయంమలో ఎంఐఎంతో.. నువ్వానేనా అన్నట్లుగా.. ఎంబీటీ పోటీ పడింది. ఇక రెండోది ఏమిటంటే.. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా.. ముస్లిం ఓటింగ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలన్నింటినీ.. నియోజకవర్గాలుగా మార్చుకోగలిగారు. ఫలితంగా.. ఏడు సీట్లకు పెరిగింది.
బీజేపీకి ప్రయోజనకరంగా కాంగ్రెస్ ఓట్లు చీల్చేలా రాజకీయం చేసిందా..?
ఇప్పుడు ఆ సీట్లకు ఒక్క దాంట్లో ఎక్కువగా పోటీ చేస్తామని..తెలంగాణ అంతట పోటీ చేయబోమని.. టీఆర్ఎస్తో అవగాహన కుదుర్చుకుంది. 2014లో తెలంగాణలో అన్ని సీట్లలో పోటీ చేశారు. అప్పట్లో .. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి ఆ వ్యూహం అమలు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడమే కాకుండా… టీఆర్ఎస్ను బలపర్చడానికి .. ఇంకెక్కడా పోటీ చేయకుండా.. టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించారు. ప్రస్తుతం సిట్టింగ్ ఏడు సీట్లు కాకుండా.. కొత్తగా.. రాజేంద్రనగర్ లో అభ్యర్థిని పెట్టారు. కొత్త అభ్యర్థిని పెట్టారు. ఈ పదిహేను రోజుల్లో… ఎంఐఎం ఎనిమిది సీటును గెలుచుకోవడానికి ప్రయత్నిస్తుదా లేదా.. అన్నది లేదా తేలుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంఐఎం.. రాజేంద్రనగర్‌ను గెలుచుకోవాలనే ప్రయత్నం చేస్తోంది. ఇక్కడే కాదు.. ఇతర రాష్ట్రాల్లోనూ బీజేపీకి అనుకూల వైఖరిని మజ్లిస్ తీసుకుంది. ఇక్కడే కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే.. వారికి అనుకూల వైఖరి తీసుకుంది. ఎక్కడైతే.. కాంగ్రెస్‌కు ముస్లిం ఓట్లు పడతాయి అనుకున్న చోటల్లా.. మజ్లిస్ పోటీ చేసింది. ఇలా ఓట్లు చీల్చడం ద్వారా.. బీజేపీకి లాభపడింది. ఇక్కడ రాజకీయం లేదు.. సిద్ధాంతం లేదు.. అధికార పార్టీ అండ ఉంటేనే.. తమకు వ్యవహారాలు నడుస్తాయని ఓవైసీ బ్రదర్స్ భావిస్తారు.