జనసేన అధినేత పవన్ కల్యాణ్… తన హత్యకు కుట్ర జరుగోతందని.. పశ్చిమగోదావరి జిల్లా పోరాటయాత్రలో సంచలన ప్రకటన చేశారు. దానికి సంబందించిన ఆడియో టేపులు కూడా తన దగ్గరున్నాయన్నారు. వాళ్లెవరో కూడా తనకు తెలుసన్నారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి.
పవన్ ఆరోపణపై కచ్చితంగా దర్యాప్తు చేయాల్సిందే..!
జనాదరణ కలిగిన హీరో.. రాజకీయ నాయకుడు… తన ప్రాణానికి ప్రమాదం ఉందని ప్రకటన చేసినప్పుడు.. దాన్ని ఆసక్తికరంగా చూడకూడదు. చాలా సీరియస్ అంశంగా పరిగణించాలి. ఆందోళనకరంగా చూడాల్సిన అంశం. ఎందుకంటే… తన దగ్గర కూడా ఆడియో టేపులు కూడా ఉన్నాయన్నారు. ఇలాంటి ఆధారాలు ఉన్నప్పుడు.. పబ్లిక్‌గా ప్రకటన చేయడం కన్నా.. వాటిని తీసుకుని వెళ్లి పోలీసులకు అంద జేయాల్సి ఉంది. కానీ.. ఇలా స్టేట్మెంట్ ఇచ్చాను.. నా పని అయిపోయింది.. వాళ్ల పని వాళ్లు చేసుకుంటారని.. వదిలేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే.. రాజకీయ నాయకులు.. నన్ను చంపబోతున్నారని ప్రకటనలు చేసి.. సానుభూతి పొందిన చరిత్ర భారతదేశ గడ్డపై ఉంది. గతంలో ఇందిరాగాంధీపై హత్యా ప్రయత్నాలు చూశాం. మోడీపై ఇప్పుడు.. హత్యాప్రయత్నాలు జరపడానికి ప్లాన్ చేశారని వింటున్నాం. మన అదృష్టం ఏమిటంటే… కింది స్థాయిలో… రాజకీయ హత్యలు జరుగుతున్నాయి కానీ.. పై స్థాయి వరకూ.. ఇలాంటివి లేవు. ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడ్ని మరో రాజకీయ పార్టీ నేత హత్య చేయడం లాంటి కుట్రలు స్థాయికి మన రాజకీయ వ్యవస్థ దిగజారలేదు కాబట్టి సంతోషించాలి. పవన్ కల్యాణ్ తనను చంపడానికి ప్లాన్ చేస్తున్నారని.. ఆరోపించడం సీరియస్ కామెంట్ కనుక.. బాధ్యతాయుతంగా… ఓ వ్యాఖ్యానం చేసి వెళ్లిపోకుండా.. పోలీసు వ్యవస్థకు.. హోంమంత్రికి ఆ టేపులు చూపించి.. అవసరమైతే పబ్లిక్‌గా కూడా రిలీజ్ చేయవచ్చు.
ఆడియోటేపును పవన్ పోలీసులకు సమర్పించాలి..!
అసలు ఎవరు ఇలా పవన్ కల్యాణ్ హత్య గురించి మాట్లాడారో కూడా తెలియాలి కదా..? ఇలా ఏమీ చేయకుండా.. కేవలం స్టేట్మెంట్ ఇస్తే మాత్రం అనుమానించాల్సిందే. పవన్ కల్యాణ్.. గత రెండు రోజులుగా.. చింతమనేని ప్రభాకర్ అనే టీడీపీ నేతను టార్గెట్ చేశారు. చింతమనేని ప్రభాకర్ పై అనేక కేసులు ఉన్నమాట నిజం. అనేక నేరారోపణలు ఉన్న మాట నిజం. అందు వల్ల ఆయనతో రాజకీయ వివాదం ఏర్పడిన సమయంలో ఇలాంటి ప్రకటన చేశారు కాబట్టి.. మ్యాటర్ సీరియస్ కిందే లెక్క. పవన్ కల్యాణ్… ఆడియో టేపులు ఇవ్వకపోయినా… జనాదరణ కలిగిన హీరో.. రాజకీయ నాయకుడు కాబట్టి… పోలీసులు అయినా చొరవ తీసుకోవాలి. ఎందుకంటే.. రేపు ఏమైనా జరిగితే.. ఇంటలిజెన్స్ వైఫల్యం అని మనమే అంటాం. ఆయన చెప్పినా కూడా చర్యలు తీసుకోలేదని.. అందరూ దుమ్మెత్తి పోస్తారు. అందుకే ఇంటలిజెన్స్ అధికారులు కూడా సీరియస్‌గా తీసుకుని పవన్ కల్యాణ్ దగ్గరకు వెళ్లి… ఆయన దగ్గర ఉన్న టేపుని స్వాధీనం చేసుకోవాలి.
పవన్ ఆరోపణలు చాలా సున్నితమైన విషయమే..!
అలా కాదు.. తనకు అవసరం ఉన్నప్పుడే బయటపెడతానని పవన్ కల్యాణ్ అన్నా కూడా అతి తప్పే. ఎందుకంటే.. ఇది చాలా సీరియస్ మ్యాటర్. ముహుర్తం చూసి బయటపెడతానని చెప్పడం కరెక్ట్ కాదు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో పవన్ కల్యాణ్‌ను ఫిజికల్‌గా ఎమిలినేట్ చేస్తేనే తమకు లాభం కలుగుతుందనే దశలో ఎవరూ లేరు. అలా అని చెప్పి… ఏమీ జరగకుండా ఉంటుందని చెప్పలేం. ఎవరి పైనైనా జరగొచ్చు. సమాజంలో హింసాప్రవృతి పెరుగుగోతంది. సమాజంలో నేర ప్రవృత్తి పెరుగుతోంది. అందుకే.. ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకోవాల్సి ఉంది. పవన్ కల్యాణ్.. ఆయన కుటుంబానికి.. జనసేన పార్టీకి.. సమాజానికి కూడా ముఖ్యమైన వ్యక్తే. అందుకే ప్రాణానికి హాని ఉందన్న పవన్ వ్యాఖ్యలను అలా వదిలేయకూడదు. పవన్ కల్యాణ్ కూడా బాధ్యతాయుతమైన వ్యక్తిగా టేపుల్ని.. సంబంధిత వ్యవస్థలకు అందజేసి నేరస్తుల్ని పట్టించాల్సిన అవసరం ఉంది.
సాక్ష్యాలు బయట పెట్టడం పవన్ కల్యాణ్ బాధ్యత..!
రాజకీయ కోణంలో ప్రకటలు చేసినా… విచారణ మాత్రం సీరియస్‌గా తీసుకోవాల్సి ఉంది. నిజం కాకపోతే.. తర్వాత ప్రజలే ఆలోచిస్తారు. పైగా పవన్ కల్యాణ్ స్పష్టంగా చెప్పారు. తన దగ్గర ఆధారాలు ఉన్నాయని.. టేపులు ఉన్నాయని ప్రకటిస్తారు. అలా చెప్పినప్పుడు.. ప్రజలకు అయినా చూపెట్టాలి.. ఇంటలెజిన్స్ వ్యవస్థకు అయినా.. చూపెట్టాలి.. లా అండ్ ఆర్డర్ వ్యవస్థలకు అయినా ఇవ్వాలి. ఆ టేపుల్లో ఎవరు మాట్లాడారు..? ఎవరు కుట్ర చేశారు..? వాటి వెనుక ఎవరైనా రాజకీయ నేతలు ఉన్నారా..? ఇలాంటి వన్నీ తేలాలి. ఇది పబ్లిక్ డొమైన్లో పెట్టాలనుకుంటే.. పెట్టాలి. అలా పెడితే… ఆయన భద్రతకు ఇబ్బంది వస్తుందనుకుంటే.. పోలీసులకు ఇవ్వాలి. నాకు తెలిసినంత వరకు పవన్ కల్యాణ్ ఇంత వరకూ ఓ ప్రకటన చేశారు కానీ పోలీసుల్ని కలిసే ప్రయత్నం చేయలేదు. పవన్ కల్యాణ్ హీరో… రాజకీయ నాయకుడు కాబట్టి.. అలాంటి ప్రకటన చేస్తే.. సహజంగానే వేడి పెరుగుతుంది. దానికి పెద్ద ఎత్తున ప్రచారం వస్తుంది. దీంతోనే సరిపోదు. పవన్ కల్యాణ్.. సంబంధిత వ్యవస్థలకు… పవన్ కల్యామ్ టేపులు ఇవ్వాలి. అది ఆయన బాధ్యత కూడా. ఓ బాధ్యతాయుతమైన పౌరుడిగా తన దగ్గర సాక్ష్యం ఉన్నప్పుడు దాన్ని బయపెట్టాలి. ఆ సాక్ష్యాలపై పోలీసులు కూడా సీరియస్‌గా స్పందించి నిజాలను బయటపెట్టాలి.