జనసేన అధినేత పవన్ కల్యామ్ బహుజన సమాజ్ పార్టీతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అందుకోసమే ఆయన లక్నో వెళ్లారని.. చెబుతున్నారు. మాయావతితో సమావేశమయ్యారని కొందరు.. అవ్వలేదని మరికొందరు చెబుతున్నారు. బహుజన్ సమాజ్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం రాజకీయ వ్యూహం. కానీ దీన్ని రహస్యంగా ఉంచడం ఎందుకు..? రహస్యంగా ఉంచడం వల్లే రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి.
సీక్రెట్ మీటింగులు ఎందుకు..?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొంత మంది బృందంతో లక్నో వెళ్లారు. అక్కడ కొంత మంది నేతలతో… చర్చలు జరిపినట్లు.. జనసేన నేతలు చెబుతున్నారు. ఆ నేతలెవరనేది.. జనసేన నేతలకు కూడా తెలియదు. మాయావతిని కలిశారో .. లేదో కూడా.. క్లారిటీ లేదు. కానీ బీఎస్పీ సీనియర్ నేతలతో మాత్రం చర్చలు జరిపారు. ఇందులో ఎలాంటి తప్పు లేదు.. ఓ రాజకీయ పార్టీ మరో రాజకీయ పార్టీతో చర్చలు జరపడం తప్పేమీ కాదు. బీఎస్పీ కాంగ్రెస్ కు దూరమే. కర్ణాటక ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారంలో..సోనియా గాంధీ, మాయావతి వేదిక పంచుకున్నారు. అయితే.. ఆ తర్వాత రాజస్థాన్, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో బీఎస్పీ విడిగా పోటీ చేస్తోంది. కాంగ్రెస్ కు దూరమయింది. అంటే.. బీజేపీ ప్రయోజనాలను కాపాడటమే. ఇక్కడ ఓ విమర్శ ఉంది. బీజేపీ.. సీబీఐని బూచిగా చూపి.. మాయావతి మీద కేసులు ఉన్నాయి కను.. కాంగ్రెస్ తో కలవకుండా చేసిందన్న ప్రచారం ఉంది. ఇలాంటి సమయంలో.. పవన్ కల్యాణ్ మాయావతిని కలిశారు. అంటే.. బీఎస్పీ కాంగ్రెస్ కు దూరమవుతున్న సమయంలో.. బీజేపీకి దగ్గరవుతున్నట్లు ప్రచారం జరుగుతున్న సమయంలో పవన్ కల్యాణ్… మాయావతి బృందాన్ని కలవడం.. వెనుక రాజకీయ మెసెజ్ ఏమి ఉంది.?
కాపు – దళిత ఐక్యత తేవాలనుకుంటున్నారా..?
ఇప్పటి వరకు.. చెబుతున్నదేమిటంటే.. కాపు – దళిత ఐక్యత తేవాలనుకుంటున్నారు. జనసేన ఇప్పటి వరకు ఎవరితో పొత్తులు పెట్టుకుంటుందో ఎవరూ చెప్పలేదు. వామపక్షాలతో కలిసి కార్యాచరణ మాత్రమే చేస్తున్నారు. పొత్తులు భవిష్యత్ లో పెట్టుకుంటారో లేదో తెలియదు. అందుకే.. బీఎస్పీని ఏపీ రాజకీయాల్లోకి తీసుకొచ్చి.. కాపు – దళిత్ ఓటు బ్యాంకుల్ని కలిపితే కీలకంగా మారుతుందన్న అంచనాలున్నాయి. అరవై, డెబ్భై సీట్లలో.. ఇది ఫోర్స్ అవుతుంది. పవన్ కల్యాణ్ లక్నోలో ఉన్నప్పుడు.. అంబేద్కర్ మనవడైన.. ప్రకాష్ అంబేద్కర్ కాకినాడలో ఉన్నారు. కాపు – దళిత్ యూనిటీ జరగాలని.. కాకినాడలో సమావేశం జరగింది. ఇలా అన్ని జిల్లాల్లోనూ జరగాలంటున్నారు. ఇలాంటి సోషల్ ఇంజినీరింగ్ కోసమే పవన్ కల్యాణ్ లక్నో వెళ్లాడనేది ఓ వాదన. ఏపీలో రెండు ప్రధాన పార్టీల మధ్య రెండు ప్రధాన సామాజికవర్గాలు ఉన్నాయి. వారికి వ్యతిరేకంగా.. అందర్నీ ఏకం చేస్తే.. జనసేన బలపడుతుందనేది పవన్ కల్యాణ్ వ్యూహం.
ప్రాంతీయ పార్టీల్ని కలిపేందుకు ప్రయత్నిస్తున్నారా..?
ఇక్కడ తెలుగుదేశం పార్టీ.. మోడీ యాంగిల్ చూస్తోంది. గతంలో కేసీఆర్ మూడో ఫ్రంట్ కోసం.. చేసిన ప్రయత్నాలను చూశాం. కాంగ్రెస్ మిత్రుల్ని, కాంగ్రెస్ భవిష్యత్ లో కలిసేవారినే కేసీఆర్ కలిశారు. మోడీ వ్యూహంలో భాగంగానే… కాంగ్రెస్ కు మిత్రుల్ని దూరం చేసే ప్రయత్నాన్ని కేసీఆర్ చేశారు. ఇప్పుడు కేసీఆర్ పాత్రలోకి… పవన్ కల్యాణ్ పోషిస్తున్నాడని చెబుతోంది. అయితే ఇప్పటికిప్పుడు ఇది నిజమని కానీ.. అబద్దమని కానీ చెప్పలేం. ఎందుకంటే.. పవన్ కల్యాణ్ కు ప్రాంతీయ పార్టీలను కలిపేంత శక్తి ఉందా..?. పవన్ కు మోడీ అంత పెద్ద బాధ్యత అప్పగిస్తారా..? ముందు పవన్ కల్యాణ్.. తన బలం నిరూపించుకోవాలి కదా..!. కేసీఆర్ కేంద్రమంత్రిగా చేశారు… చంద్రబాబు… జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారు. వాళ్ల రాజకీయ పరిచయాలతో పోలిస్తే.. పవన్ కల్యాణ్ పరిచయాలు.. చాలా చాల తక్కువ. అలాంటప్పుడు… కాంగ్రెస్ కు దగ్గరయ్యే పార్టీలన్నింటినీ దూరం చేసే పనికి మోడీ పవన్ ను పెడతారా..?
సోషల్ ఇంజినీరింగ్ తప్పు కాదు కదా..!
అందుకే ఇప్పుడు పవన్ కల్యాణ్ సోషల్ ఇంజినీరింగ్ లో భాగంగానే…. మాయావతి బృందాన్ని కలిశారని చెప్పుకోవచ్చు. కానీ.. రెండో రకమైన విమర్శలు ఎందుకొస్తున్నారంటే.. సీక్రెట్‌గా వెళ్లడం వల్ల ఈ విమర్శలు వస్తున్నాయి. దేశంలో అన్ని రాజకీయ పార్టీలు చేసే ప్రయత్నాలే పవన్ కల్యామ్ చేస్తున్నారు. అదేం తప్పు కాదు. సోషల్ ఇంజినీరింగ్ అన్ని పార్టీలు చేస్తున్నాయి.