జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఐదో ఆవిర్భావ దినోత్సవం రోజు నుంచి… ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో… తెలంగాణ జోక్యంపై.. తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఆంధ్ర రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని… ఐదో ఆవిర్భావదినోత్సవం రోజు చేతులెత్తి నమస్కరించారు. కావాలంటే నేరుగా వచ్చి పోటీ చేయమమన్నారు. ఏపీలో జోక్యం చేసుకునేలా..జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని మండిపడ్డారు. ఆ ఆరోపణల తీవ్ర అలా పెంచుకుంటూనే పోతున్నారు. హైదరాబాద్‌లో ఆంధ్రులపై దాడులు చేస్తున్నారని.. ఆరోపించడం కలకలం రేపుతోదంది. తాజాగా.. మరింత ఘాటుగా.. సవాల్ చేస్తున్నారు…చంద్రబాబుతో ఏమైనా గొడవలుంటే.. మీరూ మీరూ చూసుకోండని.. ఏపీని తేవొద్దని అంటున్నారు. దీంతో.. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ… కలకలం బయలుదేరింది.
తాను ప్రాంతాలకు అతీతం అన్న పవన్ ఇప్పుడు ఆంధ్రా ప్రాంత నేతగా ఎలా మారారు..?
జనసేన అధినేత పవన్ కల్యాణ్… ఇలా ఎందుకంటున్నారో అర్థం కావడం లేదు. ఏ ఉద్దేశంతో అంటున్నారో.. ఏ కారణాలతో అంటున్నారో కూడా తెలియడం లేదు. ఎందుకంటే.. గతంలో పవన్ కల్యాణ్.. కేసీఆర్‌ను కలిశారు. ఆయన పాలన చాలా బాగుందని అభినందించారు. ఆ ప్రశ్నకు కూడా పవన్ కల్యాణ్ సమాధానం చెప్పి ఉండాల్సింది. ఆంధ్రా పౌరుషం, ఆంధ్ర ప్రతాపం.. అంటూ ఆంధ్రా సెంటిమెంట్‌ను పవన్ కల్యాణ్ ఉపయోగించుకుంటున్నారు. పవన్ కల్యాణ్ గతంలో.. ఒక ప్రాంతానికి, ఓ కులానికి.. ఓ మతానికి చెందిన వ్యక్తిని కాదని పదే పదే చెప్పారు. తనను తాను ఆంధ్రా ప్రాంతీయ నాయకుడిగా.. తనను తాను ప్రజెంట్ చేసుకునే పని పవన్ కల్యాణ్ ఇప్పటి వరకూ చేయలేదు. కానీ ఇప్పుడు ఆ పని చేస్తున్నారు. ఎన్నికల వ్యూహాంలో.. అదొక్కటే…మార్గం అని అనుకున్నారేమో..? ఆంధ్ర సెంటిమెంట్‌ను ప్రయోగిస్తేనే.. మంచి ఫలితాలు వస్తాయని అంచనా వేసుకున్నట్లుగా ఉన్నారు. ఎలాగైతే.. తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టాలనుకున్నప్పుడు… కేసీఆర్.. చంద్రబాబును విమర్శించారు. ఇప్పుడు.. ఆంధ్రా సెంటిమెంట్‌ను రెచ్చగొట్టాలంటే.. కేసీఆర్ తప్ప మరో మార్గం లేదు.
ఆంధ్రా సెంటిమెంట్ రెచ్చగొట్టడం వల్ల చంద్రబాబుకే లాభమా..?
ఆంధ్రా సెంటిమెంట్ పాలిటిక్స్‌ను వీలైనంతగా ఉపయోగించుకోవడానికి పవన్ కల్యాణ్.. ఈ ప్రకటనలు చేస్తున్నారని అనుకోవచ్చు. ఎందుకంటే.. ఆయన ప్రసంగాల్లో ఆ ఆవేశం కనిపిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు .. కొద్ది రోజులుగా.. ఆంధ్రా సెంటిమెంట్ ను రాజేస్తున్నారు. ఆ సమయంలోనే.. పవన్ కల్యాణ్ కూడా.. అదే సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. అయితే.. ఇప్పటికే.. చంద్రబాబు ఆ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నందున.. ఇప్పుడు ఎవరు మళ్లీ ఆ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టినా.. ఆ లాభం చంద్రబాబుకే ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. అందుకే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. చంద్రబాబు చెప్పినట్లే పవన్ కల్యాణ్ చేస్తున్నారనే ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని మనం సీరియస్‌గా తీసుకోకపోయినా… వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నారని.. అర్థం చేసుకోవచ్చు. కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్‌ను రేపారు. ఆ తర్వాత ఎవరు అందుకున్నా… ఆ ఫలితం.. కేసీఆర్‌కే దక్కింది. అలాగే గత ఎన్నికలకు ముందు… కాంగ్రెస్ వ్యతిరేక సెంటిమెంట్ ను చంద్రబాబు లేవనెత్తారు. అలాగే్.. ఈ ఎన్నికలకు ముందు బీజేపీకి వ్యతిరేకంగా ప్రత్యేకహోదా, కేటీఆర్- జగన్ భేటీ తర్వాత.. ఆంధ్రా సెంటిమెంట్‌ను ఉపయోగించుకుటున్నారు. దీనిపై ఎవరు మాట్లాడినా.. అది చంద్రబాబుకే లాభం కలగొచ్చు.
భిన్నమైన మార్గం ఎంచుకుని ఉంటే ఇంకా లాభం కలిగి ఉండేదా..?
నిజానికి.. ఆంధ్రా సెంటిమెంట్‌ను ఉపయోగించుకోవడానికి జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే… తెలంగాణకు ఆయనకు పార్టీ లేదు. ఎన్నికల్లో పాల్గొనాల్సిన అవసరం లేదు. కానీ.. జగన్మోహన్ రెడ్డి ఆ పని చేయలేదు. చంద్రబాబునాయుడు.. ఇప్పటికే ఆ పని చేస్తున్నారు. పవన్ కల్యాణ్ కూడా.. ఇప్పుడు అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న విధానానికి భిన్నమైన స్ట్రాటజీని అనుసరించి ఉంటే.. ఎక్కువ ఉపయోగం ఉండి ఉండేది. ఎందుకంటే.. ఆంధ్రా సెంటిమెంట్‌తో ఇప్పటికే .. చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. జగన్, చంద్రబాబు మధ్య చాలా లో లెవల్ వార్ జరుగుతోంది. ఒకరు కేసీఆర్ కి సానుకూలంగా ఉన్నారు. మరొకరు.. వ్యతిరేకంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో.. మరో భిన్నమైన మార్గాన్ని పవన్ కల్యాణ్ ఎంచుకున్నట్లయితే.. పరిస్థితి అనుకూలంగా ఉండేది. అయితే.. పవన్ కల్యాణ్ ఎంచుకున్న విధానం వల్ల.. ఆయనకు రాజకీయంగా లాభం కలుగుతుందా..లేదా.. అనేది వేచి చూడాలి.