తెలంగాణ రాష్ట్ర సమితి జనరంజకమైన పథకాలతో పాక్షిక మేనిఫెస్టో ప్రకటించారు. ప్రజలకు సంక్షేమ పథకాలు వద్దని ఎవరూ చెప్పారు. అసమానతలు, పేదరికం ఉన్నంత కాలం.. సంక్షేమ పథకాలు ఉండాలి. అసలు రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్నామని పాలకులు చెబుతూ ఉంటారు… అలాంటి… సంక్షేమ పథకాలు ఎందుకు పెంచుకుంటూ పోవాల్సి వస్తోంది. పండుగ రోజులు కూడా.. ప్రభుత్వం ఇచ్చే సరుకుల కోసం ప్రజలు ఎందుకు ఆధారపడాల్సి వస్తుంది. సంక్షేమ పథకాలు వద్దని ఎవరూ చెప్పరు కానీ.. ఎప్పుడో ఒకసారి పులిస్టాప్ పెట్టాలి కదా.. ! అది ఎప్పుడు..?
ఉచిత హామీలు ఇవ్వకపోతే గెలవలేరా..?
కాంగ్రెస్ పార్టీతో పోటీ పడి.. కేసీఆర్ సంక్షేమ పథకాలు హామీలు ప్రకటించారు. కాంగ్రెస్ పెన్షన్ రూ. 2వేలు అన్నారని… కేసీఆర్ రూ. 2,016 అన్నారు. నిరుద్యోగ భృతి రూ. 3వేలు ఇస్తామని కాంగ్రెస్ అంటే… కేసీఆర్ రూ. 3,016 అన్నారు. నిజానికి ఇవే హామీలు అమలు చేయాలంటే.. దక్షిణాది రాష్ట్రాల బడ్జెట్ అంతా సరిపోదని అన్నారు. నిరుద్యోగభృతి అమలు అసలు సాధ్యం కాదన్నారు. చివరికి .. నిరుద్యోగ భృతిని ప్రకటించారు. ప్రతి పార్టీ ప్రజలను ఆకర్షించాలి. కాంగ్రెస్ పార్టీలా చాలా రోజులుగా రుణమాఫీ, నిరుద్యోగభృతి, పెన్షన్ల పెంపు గురించి చెబుతోంది. దాంతో టీఆర్ఎస్ కూడా ఒత్తిడికి గురై పెంచాల్సి వస్తుంది. ఈ పరిస్థితి ఓ రకంగా.. పార్టీల మధ్య పోటీ పెరగడానికి కారణం అవుతోంది. ఇది.. కాంగ్రెస్, టీఆర్ఎస్ ల పంచాయతీ కాదు. అన్ని రాష్ట్రాల్లో ఉంది తమిళనాడు.. ఒకరు టీవీలు ఇస్తామంటే.. మరొకలు ల్యాప్ ట్యాప్ ఇస్తామంటారు. ఇవన్నీ అలా పెరుగుతూ పోతున్నాయి. కానీ ఇన్నాళ్లకీ.. గ్రామాల్లో మెరుగైన సౌకర్యాలున్న ఓ స్కూల్‌ను నిర్మించగలిగామా..? ధనిక, పేద తేడా లేకుండా చదువుకునే స్కూళ్లను ఎందుకు నిర్వహించలేపోతున్నాం. ఇదేమైనా అసాధ్యమా..?. విదేశాల్లో అయితే.. ప్రభుత్వ స్కూళ్లలోనే… అన్ని వర్గాల ప్రజలు చదువుకునే పరిస్థితులు ఉంటాయి. నిజానికి చాలా ఏళ్ల కిందట… ప్రభుత్వ స్కూళ్లలోనే జనరల్ మేనేజర్ కొడుకు, వాచ్ మెన్ కొడుకు కూడా చదువుకునేవారు. ఇప్పుడా పరిస్థితి ఎందుకు లేదు..?
మౌలిక సదుపాయాలు ఎందుకు కల్పించలేకపోతున్నారు..?
కంటి వెలుగు పథకం పెట్టారు. ఒకసారి టెస్ట్ చేసి…ఆపరేషన్లు చేస్తారు. కంటి అద్దాలు ఇస్తారు. దాంతో అయిపోతుందా..? ఆస్పత్రుల్లో శాశ్వతంగా మెరుగైన… పూర్తి స్తాయి ఆరోగ్య సౌకర్యాలు కల్పించడానికి ఏర్పాట్లు చేయరా..? అలాగే… తాగునీటి కోసం.. మిషన్ భగీరథ పేరుతో.. రూ. 30 వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు. కనీసం బస్టాండ్లలో మంచినీళ్లు ప్రయాణికులకు ఉచితంగా లభిస్తాయా..? నేను ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో మూడు జిల్లాల్లో బస్టాండ్లలో కోటిన్నర పెట్టింటి.. వాటర్ ప్లాంట్లు పెట్టించాను. తొంభై శాతం పని చేయడం లేదు. వాటర్ బాటిల్ వ్యాపారం అంతకంతకూ పెరుగుతోంది. రూ. 30 వేల కోట్లు ఖర్చు పెట్టి.. ఇంటింటికి నల్లా నీరిస్తామంటున్నారు. కొన్ని లక్షల మంది ప్రయాణించే బస్టాండ్‌లో వాటర్ ప్లాంట్ ఎందుకు పని చేయదు. ఎందుకు వాటర్ బాటిళ్ల వ్యాపారం ఎందుకు యథేచ్చగా జరుగుతోంది..? నాలుగు కోట్లు ఖర్చు పెడితే… తెలంగాణలోని ప్రతి బస్టాండ్‌లోనూ.. వాటర్ ప్లాంట్ లు పెట్టుకోవచ్చు.
నిరుద్యోగులకు కోచింగ్ ఇప్పించలేరా..?
నిధులు, నీళ్లు, నియామకాల కోసం తెలంగాణ వచ్చింది. ఉద్యోగాలు వస్తాయని యువత ఆశ పడుతున్నారు. అందరికీ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేకపోవచ్చు. కానీ అందిరికీ న్యాణ్యత కలిగిన, ప్రమాణాలు కలిగిన శిక్షణ ఇవ్వలేదా..?. అశోక్ నగర్లో గ్రూప్ టూ కి ప్రిపేర్ కావాలంటే.. రూ. 20వేల ఖర్చు అవుతుంది. డబ్బులున్న వారు కోచింగ్ తీసుకోగలుగుతారు. మరి డబ్బులేని వాళ్ల సంగతేమిటి..? ఇంట్లో కూర్చునేవారు ప్రమాణాల ప్రకారం ఎలా ప్రిపేర్ అవుతారు. ఇలాంటి వారికి..ఎందుకు శిక్షణ ఇప్పింటే ప్రయత్నం చేలేకపోతున్నారు. ఇవ్వాళ… నిరుద్యోగ భృతి ఇస్తామంటున్నారు. కానీ ఈ నిరుద్యోగులే.. కొన్ని వేల కోట్లు. కోచింగ్ సెంటర్లకు ఖర్చు పెడుతున్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామంటున్న ప్రభుత్వం.. నాణ్యమైన.. కోచింగ్ ఎందుకు ఇప్పించరని అడుగుతున్నా. ఏ కోచింగ్ సెంటర్‌కు వెళ్లిన రూ. 20 నుంచి యాభై వేల ఫీజు వసూలు చేస్తున్నారు.
పార్టీల్లోనే కాదు.. ప్రజల్లోనూ మార్పు రావాల్సిందేనా..?
రైతలుకు పెట్టుబడి సాయం ఇవ్వడం గొప్ప విషయమే. కానీ పెట్టుబడి సాయం ఇస్తే సరిపోతుందా..? పంటకు గిట్టుబడి సాయం ఎందుకు ఇవ్వరు. ..? వచ్చేలా చేయరు. టమాటా కేజీ బయట ఐదు రూపాయలకు అమ్ముతారు. అదే టమాటా పచ్చడి.. అరకేజీ రూ. వంద రూపాయలకు అమ్ముతారు. ఎందుకని…? ఈ పచ్చడితయారు చేసే శిక్షణ రైతులకు ఇవ్వలేరా..? ఇలాగే.. సంక్షేమ పథకాల పేరుతో తాయిలాలు ఇస్తామని అంటూ ఉంటే.. ఇవన్నీ చేయలేరు. ఆ పార్టీ.. ఈ పార్టీ… అని కాదు.. అన్ని పార్టీలు ఇంతే. విద్య కోసం.. వైద్యం కోసం.. జైబులకు చిల్లులు పడాల్సిన పరిస్థితి రాకుండా.. మౌలిక సదుపాయాలు ఎందుకు కల్పించలేకపోతున్నారు..? ప్రజలకు ఇలా ఉచిత హామీలకు అమలు చేయకుండా.. వారి స్వయం వృద్ది సాధించేలా చేయగలగాలి. ఈ మార్పు పార్టీల్లోనే కాదు.. ప్రజల్లోనూ రావాలి. ఉచిత పథకాలకు ఆకర్షితులు కాకుండా ఉండగలగాలి.