కేంద్ర ప్రభుత్వం యూజీసీ గ్రాంట్స్ కమిషన్ “యూజీసీ”ని రద్దు చేసే ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టింది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో చట్టం చేయబోతున్నారు కూడా. ఏం చేయబోతున్నారు…. అంటే.. ఇప్పుడు ఉన్న యూజీసీని తొలగించి.. “హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా”ను ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు..? అంటే ..యూజీసీ పని విధానంపై అనేక లోపాలున్నాయి. అనేక విమర్శలున్నాయి కూడా. యూజీసీ ఏర్పడిన తర్వాత ఉన్నత విద్యాప్రమాణాలు మెరుగుపడ్డాయి. విశ్వవిద్యాలయాలు.. స్వయం ప్రతిపత్తిగాతో పని చేయడం ప్రారంభించాయి కూడా. అయితే యూజీసీ నిర్వహణలో లోపాలున్నమాట మాత్రం నిజం. అయితే… ఇప్పుడు ఈ యూజీసీని తొలగిస్తున్న ప్రభుత్వం..మరింత సమర్థవంతమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తుందా …లేదా అన్న ప్రశ్న.
నిధులన్నీ కేంద్రం చేతిలో..!
మౌలికంగా చూస్తే ఇప్పుడున్న యూజీసీకి, కొత్తగా ఏర్పాటు చేయబోతున్న హయ్యర్ ఎడ్యూకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఏం తేడా ఉండబోతోంది..? . యూజీసీ ప్రధానంగా రెండు పనులు చేస్తుంది. ఒకటి ఫండింగ్. విశ్వవిద్యాలయాలకు, కళాశాలలకు నిధులు ఇస్తుంది. రెండోది మానిటరింగ్. అంటే.. విద్యాసంస్థల్లో… విద్యా నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చర్యలు తీసుకుంటుంది. ఈ రెండు పనుల్లో.. కొత్తగా ఏర్పాటు చేయబోయే హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా రెండో పని మాత్రమే చూస్తుంది. అంటే.. నిధులకు సంబంధించి .. కొత్తగా ఏర్పడబోయే హయ్యర్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఇండియాకు ఎలాంటి సంబంధం ఉండదు. నిధుల వ్యవహారాలన్నీ.. హ్యూమన్ రిసోర్సెస్ మినిస్ట్రీ చూస్తుంది. అంటే.. కేంద్రం, అధికారులు నిర్ణయిస్తారు. ఏ విశ్వవిద్యాలయాలకు … ఎన్ని నిధులివ్వాలి… ఏ కార్యక్రమానికి నిధులివ్వాలనేది కేంద్రం నిర్ణయిస్తుంది. అంటే.. కేంద్రం ఇష్టం వచ్చిన వారికి ఫండ్స్ ఇవ్వొచ్చు.
హయ్యర్ ఎడ్యుకేషన్ స్వతంత్రతపై పిడుగు..!
హయ్యర్ ఎడ్యుకేషన్ ఫండింగ్ అనేది.. కేంద్రం చేతుల్లోకి వెళ్లడం ప్రమాదకరం. దీని వల్ల విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు నిధులు ఇవ్వకపోవచ్చు. తమకు ఇష్టం లేని యూనివర్శిటీలు నిధులు ఆపేయవచ్చు. ఉన్నత విద్య వ్యవస్థ అనేది స్వతంత్రంగా పనిచేసేదిలా ఉండాలి. కేంద్రం కొత్త విధానం వల్ల… ఈ అటానమస్ ఉండదు. యూజీసీకి ఫండింగ్ అధికారులు ఉన్నాయి..కాబట్టి..ఏ విద్యాసంస్థ అయినా యూజీసీ మాట వినలేదనుకుందాం…యూజీసీ ఫండింగ్ నిలిపివేసే అధికారం మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు కొత్త హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా … ఆదేశాలు ఎవరైనా అమలు చేయకపోయినా.. క్రిమినల్ చర్యలు కూడా తీసుకునే అవకాశం ఏర్పడింది. అరెస్టులకు కూడా అవకాశం ఉంది. అంటే.. రాష్ట్రాల్లో ఉండే యూనివర్శిటీలు ఏ రకమైన కోర్సును పెట్టాలన్నది కూడా..12 మంది సభ్యుల కమిషన్ నిర్ణయిస్తుంది. ఇది న్యాయమా..?
మాట వినకపోతే..కేసులూ పెట్టొచ్చట..!
హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ కు చైర్మన్, వైస్ చైర్మన్ ఉంటారు. వీరిని ఎంపిక చేసేందుకు సెర్చ్ కమిటీ ఉంటుంది. ఈ కమిటీలో కేంద్ర అధికారులే ఉంటారు. అంటే… ప్రభుత్వానికి కావాల్సిన వాళ్లే హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ కు చైర్మన్, వైఎస్ చైర్మన్ అవుతారు. ఇది నేరుగా… రాజకీయ జోక్యం అవుతుంది. యూజీసీలో.. రాజకీయ జోక్యం ఉండటం నేరం. కానీ..దీన్ని పట్టించుకోకుండా… యూజీసీలో రాజీకీయ జోక్యం పెరిగిపోయింది అది వేరే విషయం. కానీ చట్ట ప్రకారం యూజీసీలో రాజకీయ జోక్యం ఉండకూడదు. కమిషన్లో కూడా.. నలుగురు మాత్రమే విద్యావేత్తలు ఉండే అవకాశం ఉంది. మిగతా వారంతా… వేరే రంగాల వారి ఉండొచ్చు. ఇప్పుడు కొత్త కమిషన్ కు ఓ ఇనిస్టిట్యూషన్ ను మూసివేయించే అధికారం కూడా… ఈ కమిషన్ కు ఉంటుంది.
ప్రపంచంలో ఎక్కడా లేనంత పతనం..!
హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ కు ఓ సలహా మండలి ఉంటుంది. దానికి హెచ్ఆర్డి మినిస్టర్ చైర్మన్. అసలు ఓ కేంద్రమంత్రి సలహాల మేరకు… హయ్యర్ ఎడ్యూకేషన్ నడుస్తుందా..? ప్రపంచంలో ఎక్కడా ఇలా లేదు. ఓ రకంగా.. హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో పూర్తిగా.. ఉన్నత విద్య కేంద్రం చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఇది రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగం ప్రకారం విద్యారంగం అనేది ఉమ్మడి జాబితాలో ఉంది. కానీ ఇప్పుడు పూర్తిగా కేంద్రం చేతుల్లోకి తీసుకు వెళ్లే ప్రయత్నమే హయ్యర్ ఎడ్యూకేషన్ కమిషన్ అవకాశం కల్పిస్తోంది. యూనివర్శిటీలు… స్వతంత్రంగా ఉండాలి. సుప్రీంకోర్టు కూడా ఎన్నో సార్లు చెప్పింది… విశ్వవిద్యాలయాలు కేంద్రప్రభుత్వంలో భాగంగా కాదని. దీన్ని కూడా ప్రభుత్వం ఉల్లంఘిస్తోంది. ప్రభుత్వ చర్యల వల్ల.. ఉన్నత విద్యకు …తీవ్రమైన ప్రమాదం ఏర్పడింది.