కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఈబీసీ కోటా పేరుతో… ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల పేదలకు పది శాతం రిజర్వే,న్లు ఇవ్వాలని నిర్ణయించుకుంది. హుటాహుటిన కేబినెట్లో ఆమోదం పొందేలా చేసింది. ఇక పార్లమెంట్లో ప్రవేశ పెట్టబోతున్నారు. కానీ ఈ బిల్లుపై రాజకీయ పార్టీల్లోనే కాదు.. ప్రజల్లోనూ అనేక అనుమానాలు ఏర్పడుతున్నాయి.
ఒక్క రోజులో ఎలా ఆమోదిస్తారు..?
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు నిజంగానే అండగా నిలబడాలని మోడీ ప్రభుత్వం అనుకుంటే… నాలుగున్నరేళ్లుగా ఏం చేశారు..? ఎన్నికలకు వెళ్లే ముందు ఈ బిల్లును హడావుడిగా.. పార్లమెంట్ ముందుకు తీసుకు రావడంలో అర్థం ఏమిటి..? అదీ కూడా.. ఇదో అతి ముఖ్యమైన నిర్ణయం. దీన్ని ఎలాంటి చర్చా లేకుండా.. నేరుగా చట్టం చేసే ప్రయత్నం కూడా సాధ్యపడదు. ఇలాంటి బిల్లు వచ్చినప్పుడు ప్రజల్లో చర్చ జరగాలి. నిపుణుల్లో… మేథోమథనం జరగాలి. అప్పుడే.. ఈ బిల్లుఅమలుకు ఎలాంటి అడ్డంకులున్నాయో.. ఎలాంటి న్యాయ, రాజ్యాంగపరమైన అడ్డంకులు ఉన్నాయో.. సమాజంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో… చర్చ ద్వారా బయటకు వస్తుంది. కానీ అదేమీ చేయలేదు. ఉన్న పళంగా పార్లమెంట్లో పెడుతున్నారు. అయినా ఇప్పటికి ఉన్న సమయం సరిపోదు. పార్లమెంట్ సమావేశాల ముగింపు రోజు… నిర్ణయం తీసుకున్నారు. ఒక్క రోజు సమావేశాలు పొడిగించి పార్లమెంట్ లో పెడుతున్నారు. ఆ తర్వాత సమావేశాలు ఓటాన్ అకౌంట్ సమావేశాలు. ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి… ఈబీసీ కోటా అనేది అమల్లోకి రావడం క్వశ్చన్‌గా మారిపోతుంది.
దూరమైన అగ్రకులాలను దగ్గరకు తీసుకునే వ్యూహమా..?
ఎస్సీ, ఎస్టీ బిల్లుకు సంబంధించి సుప్రీంకోర్టుకు రూలింగ్‌ను పక్కన పెట్టి మరీ.. కేంద్రం ఓ సవరణ చేసింది. దీనిపై.. హిందీ రాష్ట్రాల అగ్ర కులాల్లో వ్యతిరేకత వ్యక్తమయింది. ఆ ప్రభావం మూడు రాష్ట్రాల ఎన్నికల్లో కనిపించిందని బీజేపీ పెద్దలు నమ్మారు. ఉత్తరాదిలోని అగ్రకులాలు.. బీజేపీకి ఓటు బ్యాంకుగా ఉన్నాయి. వాటిని కోల్పోతే తీవ్ర నష్టం జరుగుతుంది. అందుకే వారిని సంతృప్తి పరచడానికి ఈ బిల్లు తెచ్చినట్లు భావించవచ్చు. ఇది ఎన్నికల ఎత్తుగడే. నిజానికి ఆర్థికంగా వెనుకబడిన ఉన్నత వర్గాలకు సాయం చేయాలనుకుంటే.. మూడు రాష్ట్రాల ఎన్నికల ముందే చేయవచ్చు కదా.. ! అప్పుడు రాజకీయంగా కూడా ఉపయోగపడేదేమో..?అప్పుడు ఆ ఆలోచన లేదు. ఓడిపోయిన తర్వాతే ఇది గుర్తొచ్చింది. అందుకే.. దీన్ని ఓ జుమ్లాలా… బీజేపీ తీరును గమనించిన వారు అంచనా వేస్తున్నారు.
బిల్లుపై అంత రహస్యమా..? ప్రజల్లో చర్చ ఎందుకు పెట్టలేదు..?
కులాల ప్రకారం.. రిజర్వేషన్లు వస్తాయని.. చాలా మంది అనుకుంటూ ఉంటారు. నిజానికి రాజ్యాంగంలో కులాల ప్రస్తావన లేదు. బ్యాక్ వర్డ్ క్లాస్ అనే పదం మాత్రమే ఉంటుంది. దాని ప్రకారమే.. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో రిజర్వేషన్లలో కులలాపై… కొన్ని తీర్పులు చప్పింది. మొదట్లో కులాల ప్రస్తావన ఉండకూడదన్న తీర్పు వచ్చింది. ఆ తర్వాత కులాల ప్రాతిపదికే… రిజర్వేషన్లు ఇవ్వకూడదని సూచించింది. ఈ సుప్రీంకోర్టు తీర్పులన్నీ పరిశీలిస్తే.. రిజర్వేషన్లు ఇవ్వడానికి.. కులమే ప్రాతిపదిక కాదు… అది ఓ ఆరంభ సూచికగా భావించవచ్చు అని సారాంశంగా భావించవచ్చు. అంటే కులంతో పాటు వెనుకబాటు తనాన్ని కూడా… రిజర్వేషన్లను కల్పించడానికి ఆధారంగా చేసుకోవచ్చు. కులాల ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వడం లేదని ఎవరైనా కోర్టుకు వెళ్తే అది చెల్లదని భావించవచ్చు.
ఇది ఓ “ఎన్నికల జుమ్లా”గా మిగిలిపోతుందా..?
ఈ బిల్లు పాస్ చేయడంలో కానీ.. అమలు చేయడంలో కానీ మౌలికమైన సమస్యలు చాలా ఉన్నాయి. కులాల ప్రస్తావన లేకుండా… ఆర్థిక వెనుకబాటు తనం ఆధారంగా.. రిజర్వేషన్లు ఇవ్వడం అనేదానిపై..కోర్టులు ఎలా స్పందిస్తాయో అనేది ఇందులో కీలకం. అలాగే… అమలులో వచ్చే సమస్యలను ఎలా అధిగమిస్తారన్నది కూడా..మరో విషయం. అయితే.. ఈ బిల్లు.. ఇప్పటికిప్పుడు.. ఆమోదం పొందే అవకాశం అయితే కనిపించడం లేదు. ఇది ఓ ఎన్నికల జిమ్మిక్ గానే పరిగణించాల్సి ఉంటుంది. చిత్తశుద్ధి ఉంటే.. కేంద్రం… ఎన్నికలకు పోయే ముందు ఈ బిల్లు తెరపైకి తెచ్చి ఉండేది కాదు. అంతకు ముందే తెచ్చి అమలు చేయడానికి ప్రయత్నించేది.