శబరిమలలో రోజు రోజుకు ఉద్రిక్తత పెరిగిపోతోంది. భక్తుల పేరుతో కొంత మంది.. సేవ్ శబరిమల పేరతో ఉద్యమాలు చేస్తున్నారు. ర్యాలీలు, బందులకు పిలుపునిస్తున్నారు. కొంత మందిపై దాడులు కూడా చేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అసలు.. శబరిమల పవిత్రత కోసం అంటూ పోరాడుతున్నది.. అయ్యప్ప భక్తులేనా..? అన్నది ప్రధానమైన సందేహం.
మత విశ్వాసాల పేరుతో సుప్రీంకోర్టు తీర్పుల్ని ఉల్లంఘిస్తారా..?
శబరిమల ఆలయ కేంద్రంగా జరుగుతున్న వివాదంలో… ఆందోళన చేస్తున్న వారిలో భక్తులెవరూ లేరు. భక్తుల ముసుగులో రాజకీయ పార్టీల కార్యకర్తలు, నేతలే ఈ ఆందోళనలు చేస్తున్నారు. భక్తుల పేరిట రాజకీయాలు చేస్తున్నారు. రాజకీయ పార్టీలు రోజుకొక వైఖరి తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్య వస్తోంది. శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతించాలని.. సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. దీనిపై… హిందూ సంఘాల పేరుతో కొంత మంది రచ్చ చేయడం ప్రారంభించారు. ఈ తీర్పు మా మత విశ్వాసాలకు వ్యతిరేకంగా ఉంది కనుక.. మేము పాటించబోమని.. హిందూ సంఘాలు ప్రకటనలు చేస్తున్నాయి. ఈ విషయంలో మెతకగా ఉంటే.. ఇలాంటివి చాలా పుట్టుకొస్తాయి. సుప్రీంకోర్టు తీర్పుల్నే ధిక్కరించడం ప్రారంభిస్తారు. ఇప్పుడు ముస్లింల ట్రిపుల్ తలాక్ అంశం ఉంది. ఈ విషయంలో వారిలో వ్యతిరేకత ఉంది. ట్రిపుల్ తలాక్ అనేది మా మత విశ్వాసం.. దానిపై మీరెలా చట్టం చేస్తారని అడుగుతారు. రేపు.. ముస్లిం మహిళలు కూడా.. కొన్ని వేల మంది రోడ్డు మీదకు వచ్చి… మా భక్తులు..మాక్ తలాక్ చెబితే.. మీకేం బాధ అనే వాదన వినిపించవచ్చు. అలాంటప్పుడు.. దాన్ని అంగీకరిస్తారా..?
అందరూ మా మత విశ్వాసాలని ఉందోళనలు చేస్తే అంగీకరిస్తారా..?
రాజస్థాన్లో కొంత మంది మహిళలు ఉద్యమాలు చేసి.. మా భర్త చనిపోతే.. మేము కూడా సతీసహగమనం చేస్తాం .. మీకేమిటి ఇబ్బంది అని ప్రశ్నిస్తే.. కేంద్రం ఏం చెబుతుంది..? చట్టం ఉంది.. సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయంటే… ఇప్పుడు శబరిమల విషయంలో మత విశ్వాసాలకు… తీర్పు పట్టించుకోబోమన్నారు కదా..మేము ఎందుకు పట్టించుకోవాలని వారు వాదిస్తారు. అందువల్ల.. మత విశ్వాసాలకు… రాజ్యాంగానికి మధ్య ఘర్షణ ఏర్పడితే.. రాజ్యాంగమే చెల్లుతుంది. రేపు… ఎనిమిదేళ్ల బాలబాలికల పెళ్లి చేసి.. మా అందరికీ అంగీకారం ఉంది.. చెప్పడానికి నువ్వెవరు అని.. వాళ్లంతా వ్యవస్థ మీద తిరగబడే అవకాశం ఉంది. అలా చేస్తే బాల్య వివాహాల్ని అంగీకరిస్తారా..?. ఈ రకమైన… విశ్వాసాల పట్ల.. ఆధునిక నాగరికతను ప్రశ్నిస్తూ… రాజ్యాంగాన్ని ప్రశ్నిస్తూ… చట్టాన్ని ప్రశ్నించడం సరైనది కాదు. బీజేపీ సుప్రీంకోర్టు తీర్పును ఆహ్వానించింది. అదే మహారాష్ట్రాలోని శని సింగనాపూర్ దేవాలయంలోకి మహిళల్ని అనుమతించాలని కోర్టు తీర్పు చెబితే.. మహారాష్ట్రాలోని బీజేపీ ప్రభుత్వమే దానిని అమలు చేస్తోంది.
కేరళలో ప్రవేశం కోసమే బీజేపీ చేస్తున్న రాజకీయమేనా..?
కేరళలో లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తానంటే.. బీజేపీ, ఆరెస్సెస్ వ్యతిరేకిస్తోంది. మత విశ్వాసాలు ఒక్క శబరిమల ఆలయానికేనా… శని సింగనాపూర్ ఆలయానికి ఉండవా..?. అంటే.. కేరళలో… చాలా ఏళ్లుగా..బీజేపీ ప్రవేశించాలని చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తోది. కానీ సాధ్యం కాలేదు. కానీ ఇప్పుడు ప్రజల విశ్వాసాల్ని పెట్టుబడిగా మార్చుకుని.. కేరళలోకి ఎంటర్ కావాలని… ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ పార్టీ తీర్పును ఆహ్వానించింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా.. బీజేపీతో పోటీ పడి.. తమ విశ్వసాల్ని రాజకీయాల్ని వాడుకోవడానికి ప్రయత్నిస్తోంది. అందువల్ల రాజకీయ పార్టీలు… దీన్ని పెంచుతున్నాయి. ఒకరు అత్యాచారాలు జరుగుతాయని.. మరొకరు భక్తుల్ని ముక్కలు ముక్కులుగా నరికేస్తానని.. ఓ పెద్ద మనిషి ఓపెన్గాటీవీలోనే చెప్పారు. ఇదేనా… శబరిమలలో జరగాల్సింది..?
ఇది హిందూ మత విశ్వాసాలపై దాడే..?
ప్రస్తుతం బీజేపీ.. శబరిమల కేంద్రంగా.. రాజకీయాలు చేస్తోంది. దేవుడి ప్రతిష్టను దెబ్బతీస్తోంది. ఓ రకంగా చెప్పాలంటే.. హిందూ మత విశ్వాసాలపై దాడి ఇది. ఈ విషయంలో అక్కడ భక్తులెవరూ ఆందోళన చేయడం లేదు. భక్తుల పేరుతో.. రాజకీయాలే… శబరిమలలో ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తున్నాయి.