మోదీ ముస్లిం టోపీ ఎందుకు పెట్టుకోరని.. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రశ్నించారు. అసలు ముస్లిం టోపీ పెట్టుకోవడం.. పెట్టుకోవడం అనేది వివాదం కాదు. అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే.. నరేంద్రమోడీని ఎదుర్కోవడానికి . శశిథరూర్ కానీ.. కాంగ్రెస్ నేతలు కానీ.. విధానపరమైన చర్చ గనుక పెడితే… దేశానికి లాభం.. కాంగ్రెస్ కు లాభం. ఇప్పుడు మోడీ ముస్లిం టోపీ పెట్టున్నాడనుకోండి.. దేశంలో ముస్లింలంతా రక్షణతో ఉన్నట్లా..?. కాంగ్రెస్ పార్టీ కోరుకంది ముస్లింల రక్షణనా.. లేక ఇంకేమిటైనానా..?. ఇవన్నీఇష్యూలు కాదు. నరేంద్రమోడీ ముస్లింటోపీ పెట్టుకుంటే ఏమైనా చేయవచ్చా… ఇలాంటి ప్రశ్నల్లో అర్థం ఉండదు.
మోడీకి కూడా మత స్వేచ్ఛ ఉంటుంది..!
నరేంద్రమోడీ అనే వ్యక్తి ఓ ప్రధానమంత్రి. ఆయన ప్రధానమంత్రి అయినంత మాత్రాన ఆయన ప్రాథమిక హక్కును కోల్పోతాడా..?. ప్రతి వ్యక్తికి.. పౌరునికి తన మతాన్ని విశ్వసించి, ఆచరించే హక్కు ఉంది. తన మతాన్ని విశ్వసించి.. ఆచరించే హక్కు నరేంద్రమోడీకి కూడా ఉంది. అదంతా వ్యక్తిగత ఇష్టాఇష్టాలు. సాధారణంగా ఎవరైనా ముస్లింల దగ్గరకు వెళ్తే వారు ప్రేమతో.. ఇస్తే .. వారు ఇచ్చిన టోపీని పెట్టుకుని వారిని గౌరవించడం సంప్రదాయం. సంస్కారం. కానీ కొంత మందికి వ్యక్తిగత విశ్వాసాలుంటాయి. పెట్టుకోదల్చుకోలేదు. దాన్ని వివాదం చేయకూడదు. పెట్టుకోకపోవడం వల్ల దేశానికి, లౌకికత్వానికి ప్రమాదం ఉందని చెప్పుకోవడం కరెక్ట్ కాదు.
ముస్లింకు రుద్రాక్షలు, హిందువుకు ముస్లిం టోపీ ఇస్తారా..?
నరేంద్రమోడీని ఎదుర్కోవడానికి అనేక సమస్యలున్నాయి. అయినా ముస్లిం టోపీ పెట్టుకున్నారా లేదా.. పెట్టుకుంటారా లేదా ..గ్రీన్ కలర్ డ్రెస్ ఎందుకు వేసుకోరు.. అన్న చర్చ లేవనెత్తి వివాదాలు చేయడం పద్దతి కాదు. నిజంగా ఎవరైనా నరేంద్రమోడీని గౌరవించాలనుకుంటే.. రుద్రాక్షమాలో..మరొకటో ఇవ్వాలి. ఎందుకంటే.. ఆయన విశ్వసిస్తున్నది అది కాబట్టి. ఎవరైనా హిందువులు ముస్లింలకు గౌరవ సూచనగా ఏదైనా ఇవ్వాలనుకుంటే..రుద్రాక్షలు ఇవ్వకూడదు..వారు ముస్లింటోపీ ఇవ్వాలి. ఉదాహరణకు మన ఇంటికి గెస్టులు వచ్చారనుకుందాం. వచ్చిన వాళ్లు మాంసాహారులు. మనం శాఖాహారులం. వారికోసం మాంసాహారం తెచ్చి పెడతామా లేదా..?. ఇంటికొచ్చిన గెస్టును గౌరవించడం మన సంద్రాయం. ఇది కూడా అంతే.
వేషధారణ మనిషి గుణగుణాల్ని నిర్ణయించదు..!
ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి .. విశ్వాసాల్ని మనం గౌరవించాలి. నరేంద్రమోడీ తెలివైనవ్యక్తి కనుక.. పశుపతి ఆలయంలో.. పూజలు చేసి.. కాషాయ బట్టలు వేసుకుని రుద్రాక్షలు వేసుకుని బయటకు వచ్చారు. కచ్చితంగా కర్ణాటక ఎన్నికల పోలింగ్ సమయంలో ఆయన ఇలా చేశారు. ఎందుకంటే.. దేశంలో ఉన్న ప్రజలందరూ చూడాలనే ఆయన అలా చేశారు. లేకపోతే.. నరేంద్రమోడీ పూజలు చేసినా.. లేక మరో సంప్రదాయాన్ని ఆచరించినా.. అది ఆయన వ్యక్తిగతం. దాన్ని ప్రశ్నించే హక్కు లేదు. దాన్ని పబ్లిక్ ఇష్యూ చేయడం కూడా కరెక్ట్ కాదు.
ఖద్దరు వేసుకుంటేనే ప్రజానాయకుడు అవుతారా..?. ఖద్దరు వేసుకుని ఎంత మంది ప్రజల్ని లూటీ చేస్తున్నారో అందరికీ తెలుసు కదా. అయినా విషయం అది కాదు కదా..! .
మోడీని ప్రశ్నించడానికి అనేక అంశాలున్నాయి..!
నిర్మలమైన మనస్సుతో..నిష్కలంకమైనటువంటి.. వ్యక్తిగా కనబడాలి కాబట్టి.. తెల్లటి దుస్తులు వేసుకుంటారు. అందువల్ల తెల్లటి దుస్తులు వేసుకున్నవారంతా.. నిష్కళంకులని కాదు. రాజ్యానికి మతం ఉండకూడదు. అందువల్ల మతాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి.. ప్రతి దాన్ని వివాదం చేయాలనుకుంటే ప్రయోజనం ఉండదు. నిజంగా నరేంద్రమోడీని ప్రశ్నించాలనుకుంటే సవాలక్ష అంశాలున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఇష్యూల మీద టైం చేసుకోవడం మంచిది కాదు.