అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేర సోమలను మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనతో మళ్లీ మావోయిస్టుల కార్యకలాపాలు పెరిగిపోయాయా.. అన్న చర్చలు పెరిగిపోయాయి. ఇటీవలి కాలంలో మావోయిస్టుల దాడులు దాదాపుగా లేవు. కానీ మన దేశంలో ఉన్న పరిస్థితి ఏమిటంటే.. ఎక్కడైనా.. మావోయిస్టుల దాడి జరగగానే… మావోయిస్టుల కార్యకలాపాలు పెరిగిపోయాయని.. ఎక్కడైనా ఎన్కౌంటర్ జరిగితే.. మావోయిస్టులు అంతమైపోయారన్న విశ్లేషణలు వస్తూ ఉంటాయి. కొన్నాళ్ల క్రితం.. ఏవోబీలోనే ఆర్కేను బలగాలు చుట్టుముట్టారన్న ప్రచారం జరగగానే… మావోయిస్టుల పనైపోయిందని ప్రచారం చేశారు.
వ్యక్తిగత హింసతో రాజ్యవ్యవస్థను మార్చలేరు..!
మావోయిస్టులు.. భౌతిక దాడులు చేయడం…. ప్రజాప్రతినిధుల్ని చంపడం లాంటి… ఘటనలకు పాల్పడితే.. ప్రజాస్వామ్య వాదులెవరూ సమర్థించరు. వ్యక్తిగత హింసావాదంతో సమాజం మారదు. మామూలు పోలీసు బలగాలతోనే పోరాడలేని మావోయిస్టులు.. రేపు సైన్యం బరిలో దిగితే పోరాడగలదా..? సైన్యం బరిలోకి దిగాలని ఎవరూ కోరుకోవడం లేదు. .. కానీ మనం నేపాల్‌లో చూశాం. నేపాల్ మావోయిస్టులు ఇంత కంటే బలమైన వాళ్లు. ఓ దశలో ప్రజాస్వామిక ప్రధాన స్రవంతిలోకి వచ్చి.. ప్రధానమంత్రిగా కూడా.. బాధ్యతలు చేపట్టారు. శ్రీలంకలో ఎల్టీటీఈ.. మిలటరీ పరంగా కూడా.. మావోయిస్టుల కన్నా బలమైన శక్తి. కానీ తుడిచి పెట్టుకుపోయింది. శ్రీలంక రాజ్య వ్యవస్థ అంత బలమైనది కాదు. కానీ భారత రాజ్య వ్యవస్థ చాలా బలమైనది. కాబట్టి మావోయిస్టులు అర్థం చేసుకోవల్సింది ఏమిటంటే.. వ్యక్తిగత హింసావాదాన్ని వదిలి పెట్టాలి. ఇలాంటి హింసావాదాన్ని సమాజాన్ని మార్చగలమా లేదా అని ప్రశ్నించారు. ప్రజలలో విప్లవ భావాలు లేకుండా.. వేసే ఎత్తుగడలు ఎప్పుడూ విజయవంతం కావని లెనినే అంటాడు. ప్రస్తుత పరిస్థితుల్లో… ప్రజలు ఎలా ఉన్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో సాయుధలై.. ఏం సాధిస్తారో.. మావోయిస్టులే ఆలోచించారు. రాజ్యవ్యవస్థను మార్చే పరిస్థితి ఉంటుందా అంచనా వేసుకోవాలి.
సామాజిక ఆర్థిక పరిస్థితుల్ని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు..!
ఇలాంటి హత్యల్ని సమర్థించే ప్రసక్తే లేదు. అదే సమయంలో.. ఎలాంటి సామాజిక ఆర్థిక పరిస్థితులు ఈ ఘటనలకు కారణం అవుతున్నాయి. మావోయిస్టులు ఎందుకు.. ఇంకా కార్యకలాపాలు జరుపుకోగలగుతున్నారు. కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్..మావోయిస్టు కార్యకలాపాల్ని 80 శాతం.. 90 శాతం నియంత్రించామని ప్రకటనలు చేస్తూ అసలు మావోయిస్టుల కార్యకలాపాల్ని 80 శాతం.. 90 శాతం ఎని ఎలా లెక్కిస్తారు. కానీ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే… ఇటు పోలీసులు.. అటు మావోయిస్టుల పోరాటంలో గిరిజన ఆవాసాలు తల్లిడిల్లి పోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకని గిరిజన ప్రాంతాల్లో ఈ అశాంతి ఉంది..? అక్కడి ప్రజలు ఏం అడుగుతున్నారు..? గిరిజనలు.. జల్, జంగిల్, జమీన్ అనే నినాదాన్ని గిరిజనులు వినిపిస్తున్నాయి. ఇది మావోయిస్టులు మాత్రమే కాదు.. హక్కుల సంఘాలు.. కూడా ఇదే పిలుపునిస్తూ ఉంటాయి. ఈ మూడింటిని గిరిజనులకు కాకుండా చేసే ప్రయత్నాలు జరుగతూ ఉంటాయి. చనిపోయినటువంటి… నాయకులకు అక్రమ మైనింగ్‌తో సంబంధం ఉందని… పత్రికల్లో వచ్చింది. వారికి ఉన్న మైనింగ్‌ను మూసి వేయాలని గిరిజనులు… ప్రజాస్వామిక పద్దతుల్లో నిరసన తెలుపుతున్నారు. రాజ్యవ్యవస్థ, ప్రభుత్వాలు.. ఈ ప్రజాస్వామిక నిరసనలకు స్పందించనప్పుడు… ఎక్కడో చోట ఇలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి.
గిరిజనుల పోరాటాన్ని ప్రభుత్వాలు పట్టించుకోలేదు..!
అక్కడ ఉండే గిరిజనులు ఏం చెబుతారు..? ఈ మైనింగ్ వలన కాలుష్యం వస్తుందని ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. బాక్సైట్ మైనింగ్ జరపడం లేదని.. ప్రభుత్వం చెబుతోంది. కానీ అక్కడ లేటరైట్ మైనింగ్ జరుగుతోంది. దీన్ని సిమెంట్ ఇండస్ట్రీలో వాడతారు. రాజకీయ ప్రాబల్యం ఉన్న వాళ్లే ఎక్కువగా అక్రమ మైనింగ్ నడుపుతూ ఉంటారు. మైనింగ్ రూలింగ్ ప్రకారం… పర్యావరణానికి హాని లేకుండా.. చేసుకోవాలి. చాలా నిబంధనలు ఉంటాయి. కానీ ఇల్లీగల్ మైనింగ్ వల్ల ఈ నిబంధనలేమీ ఉండవు కదా. దీని వల్ల తవ్వుకున్న వాళ్లు బాగుంటారు.. కాంట్రాక్టర్లు బాగుంటారు.. కానీ ఆ మైనింగ్ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలే కాలుష్యం బారిన పడి ఇబ్బంది పడతారు. నష్టపోయేది స్థానిక గిరిజనులు. వారే.. చాలా రోజుల నుంచి.. నిరసనలు చెబుతున్నారు. కానీ ప్రభుత్వం స్పందించలేదు. విశాఖ ఏజెన్సీలో గతంలో మావోయిస్టుల సంచారం అధికంగా ఉండేది. ఇటీవల తగ్గిపోయింది. కానీ .. ప్రజల నిరసనలను.. ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల .. మావోయిస్టులు దాన్ని ఉపయోగించుకోగలుగుతున్నారు. ప్రజాస్వామిక నిరసనలు చేస్తున్న ప్రజల ఆవేదనను ప్రభుత్వాలు పట్టించుకోకపోతే.. ఇలాంటి ఘటనల ద్వారా.. ప్రజల మద్దతు పొందే ప్రయత్నాన్ని మావోయిస్టులు చేస్తారు.
నిర్బంధాలతో మావోయిస్టులు అణిగిపోరు..!
ఈ హింసకు మూలం.. సామాజిక, ఆర్థిక పరిస్థితులు.. అక్రమ మైనింగ్‌లో ఉంది. అక్కడ ఉన్నటువంటి గిరిజనులు.. కనీస అభివృద్ధికి నోచుకోరు. గత ఏడాదిలో అక్కడ రూ. 50 కోట్లు ఉపాధి హమీ నిధులు గోల్ మాల్ జరిగింది. ఫిర్యాదులు వస్తే.. కొంత మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని సస్పెండ్ చేశారు. వారంతా కాంట్రాక్ట్ ఉద్యోగులు. కానీ కాంట్రాక్ట్ ఉద్యోగుల వల్లే అవినీ జరగదు కదా..!. అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన నిధులు స్వాహా చేయడం.. అక్రమ మైనింగ్.. జల్, జమీన్, జంగల్ లాంటి వాటిపై.. హక్కులు లేకుండా చేయడం వంటి ఘటనలతో.. మావోయిస్టులు సానుకూల పరిస్థితిని ఏర్పరుచుకున్నారు. ఇప్పుడు అందరూ హత్యలను ఖండిస్తున్నారు. కానీ లేటరైట్ అక్రమ మైనింగ్ గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ అక్రమ మైనింగ్ ను గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు. లేటరైట్, చైనా క్లే తవ్వకాలను ఎందుకు ఆపలేకపోతున్నారని ప్రభుత్వాల్ని ప్రశ్నిస్తే.. మావోయిస్టు సానుభూతి పరులనే ముద్ర వేస్తారు. ఇప్పుడు కొత్తగా కేంద్రం.. అర్బన్ మావోయిస్టులనే పద కూడా కనిపెట్టింది. నిర్బంధం పెరుగుతోంది.
ప్రభుత్వం, మవోయిస్టులు ఇద్దరిదీ తప్పే..!
జల్, జంగిల్, జమీన్ గురించి మాట్లాడిన ప్రతి ఒక్కరూ మావోయిస్టు కాదు. ప్రతి ఒక్కరూ.. తుపాకులు పట్టుకుని సాయుధులు… పోరాడేవాళ్లు అని కాదు. చట్టబద్ధమైన పాలన విఫలమైనప్పుడు… ప్రజల్ని ఆకట్టుకోవడానికి మావోయిస్టులు ఇలాంటి హింసకు పాల్పడతారు. ఇవాళ అనేక మంది ప్రజాప్రతినిధుల్లో.. అనేక మంది.. మైనింగ్ బిజినెస్ ఉంటుంది. అక్రమ మైనింగ్ ఉంటుంది. వీటిని పరిష్కరించకుండా.. ప్రజల్లో అసంతృప్తిని ఆపలేరు. అలాగే.. వ్యక్తిగత హింసావాదంతో.. సమాజాన్ని మారుస్తామని మావోయిస్టులు అనుకున్నా… అది సాధ్యం కాదు. మావోయిస్టులను అణచి వేస్తామని ప్రభుత్వం చెబుతూ ఉంటుంది. 2016లో భారీ ఎన్ కౌంటర్ జరిగినా… మావోయిస్టులు ఈ ఘటనకు పాల్పడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం విశాఖ ఏజెన్సీలో ఏ సామాజిక, ఆర్థిక పరిస్థితులు ఈ ఘటనలకు కారణం అవుతున్నాయో.. వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఓ నిపుణుల బృందాన్ని అక్కడకు పంపించాలి. అక్కడి పరిస్థితుల్ని అధ్యయనం చేయాలి. వాళ్లిచ్చే నివేదికల ఆధారంగా.. నిజాయితీగా చర్యలు చేపట్టాలి. బలప్రయోగం ద్వారా మావోయిస్టులను అణిచి వేస్తామనుకుంటే… కష్టమే. అలాగే మావోయిస్టులు … వ్యక్తిగత హింసావాదం ద్వారా రాజ్య వ్యవస్థను కూల్చివేస్తామని అనుకోవడం అవివేకమని గుర్తించాలి. ప్రజల్ని సమీకరించడం ద్వారనే సమాజం మారుతుంది. సాయుధ కార్యకలాపాల ద్వానే సమాజం మారదని.. మావోయిస్టులు అర్థం చేసుకోవాలి.