తమిళనాడు రాజకీయాల్లో జయలలిత, కరుణానిధిలు దశాబ్దాల పాటు .. రెండు మూల స్తంభాలుగా.. పరస్పర విరుద్ధమైనటువంటి రాజకీయాలు నిర్వహించారు. తమిళ రాజకీయాల్లో విబేధించుకోవడం కాదు.. ఓ రకంగా వ్యక్తిగత శతృత్వం ఉంటుంది. జయలలిత పట్ల.. డీఎంకే ప్రభుత్వం అసెంబ్లీలో వ్యవహరించిన తీరు మనకు తెలుసు. కరుణానిధి పట్ల.. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు..అర్థరాత్రి ఎలా అరెస్ట్ చేశారో మనం చూశాం. అందువల్ల తమిళ రాజకీయాల్లో ఒక రకంగా రాజకీయ వైరం కాదు.. వ్యక్తిగత శతృత్వం ఉంటుంది.
తమిళనాడులో కనుమరుగైన బలమైన నాయకత్వం..!
ప్రస్తుతం తమిళనాడులో రాజకీయం మారింది. జయలలిత, కరుణానిధిలు లక్షల మంది అభిమానులు ఉన్న నేతలు. ప్రస్తుతం అలాంటి జనాకర్షణ ఉన్న నేతలు అటు అన్నాడీఎంకేకు కానీ.. ఇటు డీఎంకేకు కానీ లేరు. జనాకర్షణ కలిగిన రజనీకాంత్, కమలహాసన్ రాజకీయాల్లోకి వచ్చినా… వారికి డీఎంకే, అన్నాడీఎంకేకు ఉన్నటువంటి.. రోబస్ట్ పార్టీ ఆర్గనైజేషన్ కానీ.. సంస్థాగత బలం కానీ లేదు. డీఎంకేకు ఉన్న అడ్వాంటేజ్ ఏమింటే.. జయలలిత తన వారసుడెవరో ప్రకటించకుండా.వెళ్లిపోయారు. జయలలిత తన వారసుడ్ని ప్రకటించి ఉంటే.. జయలలితను ఆరాధించి.. అభిమానించే కోట్లాది మంది ప్రజలు.. ఆటోమేటిక్ గా.. జయలలిత మీద గౌరవంతో ఆమె వారసుల్ని కూడా గౌరవించేవాళ్లు. జయలలిత తన వారసుడెవరో చెప్పలేదు.
డీఎంకే వారసుడు స్టాలిన్..!
కరుణానిధి… మాత్రం ముందుగానే స్టాలిన్ ను వారసునిగా ప్రకటించారు. దీని కోసం కరుణానిధి మందుచూపుతో వ్యవహరించారు. తన కుమారులు, కుమార్తెల మధ్య గొడవలు రాకుండా.. స్టాలిన్ ను అధికారికంగా వారసుడిగా ప్రకటించారు. పైగా డీఎంకేలో చాలా కింది స్థాయి నుంచి పని చేశారు. యూత్ వింగ్ నాయకుడిగా కూడా వ్యవహరించారు. అంటే క్యాడర్ అందరికీ స్టాలిన్ నాయకత్వంపై నమ్మకం ఉంది. కరుణానిధి చనిపోయిన సానుభూతి…కూడాకలసి వస్తుంది. అన్నాడీఎంకే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కూడా కలసి వస్తుంది. సమాధి రాజకీయాల విషయంలో అన్నాడీఎంకే ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు వల్ల కూడా.. డీఎంకే పట్ల సానుభూతి పెరుగుతుంది.
స్టాలిన్ను ఢీకొట్టే అన్నాడీఎంకే నేత ఎవరు..?
ఇలాంటి పరిస్థితుల్లో డీఎంకేను ఎదుర్కోవడానికి అన్నాడీఎంకే ఏం చేయాలి..?. అన్నాడీఎంకేను వెనుక నుంచి నడిపిస్తున్న బీజేపీ ఏం చేయాలి..?. బీజేపీ తమిళ రాజకీయాల్లో ఓ కాంబో ఆఫర్ కోరుకుంటోంది. ఆ కాంబో ఆఫర్ ఏమిటంటే.. బీజేపీ ప్లస్ అన్నాడీంకే. ప్లస్ రజనీకాంత్. అధ్యాత్మిక రాజకీయాలు నడుపుతానని రజనీకాంత్ ప్రకటించారు. భారతదేశంలో రాజకీయాలకు.. ఆథ్మాత్మికతను మేళవించే పార్టీ బీజేపీ. పన్నీర్ సెల్వం, పళనిస్వామిలను కేంద్రం ఏ విధంగా కలిపిందో అందరికీ తెలుసు.. అన్నాడీఎంకే నాయకత్వం బలంగా లేదు. డీఎంకే నాయకత్వం బలంగా ఉంది. డీఎంకేను అన్నాడీఎంకే ఎదుర్కోవడం కష్టమే. డీఎంకే యూపీఏలో భాగస్వామి. అందుకే ముందుగా బీజేపీ డీఎంకేను మంచి చేసుకునే ప్రయత్నం చేసింది. కానీ ఇప్పుడు బీజేపీ ఏం ఆలోచన చేస్తోందంటే.. అన్నాడీఎంకేలోకి రజనీకాంత్ ను తీసుకు వస్తే.. జయలలిత లేని లోటు తీరుతుందని అంచనా వేస్తోంది. ఇవి వదంతుల్లా ప్రారంభమయ్యాయి.
రజనీ వస్తాడని అన్నాడీఎంకే నేతలు ఎదురుచూస్తున్నారా..?
ఇటీవల బీజేపీ తరపున ఎంపీగా పోటీచేసిన ఓ నేత.. తాను ఏర్పాటు చేసిన ఎంజీఆర్ విగ్రహం.. ఆవిష్కరణకు.. అన్నాడీఎంకే నేతలను పిలవకుండా.. రజనీకాంత్ ను పిలిచాడు. ఆ సభలో మాట్లాడుతూ రజనీకాంత్ మాట్లాడుతూ.. తాను ఎమ్జీఆర్ పాలన తెస్తానని ప్రకటించారు. అన్నాడీఎంకేకు ఉన్న ఎమ్జీఆర్ ఇమేజ్ ను రజనీకాంత్ ఎందుకు తీసుకుంటున్నాడు. ఎమ్జీఆర్ పాలన తెచ్చేది అన్నాడీఎంకే..కరుణానిధి పాలన తెచ్చేది డీఎంకే.. మధ్యలో..రజనీకాంత్ ఉన్నారు. .రజనీకాంత్ పాలన తేవాలి కానీ..ఎమ్జీఆర్ పాలన తెస్తామనని ఎందుకు చెప్పారు..?. ఆ తర్వాత అన్నాడీఎంకేకు చెందిన ఓ మంత్రి ఇచ్చిన ఓ ఇంటర్యూలో.. ఆయన మాతోనే కలసి రావొచ్చు అని ప్రకటించాడు. పొత్తు పెట్టుకోవచ్చు… లేకపోతే మాలోనే చేరొచ్చు అనే ప్రకటన కూడా చేశారు. తమిళనాడుకు చెందిన నెంబర్ వన్ న్యూస్ చానల్లో.. అన్నాడీఎంకే మంత్రి… ఏ రీజన్ లేకుండా ఎందుకు అంటారు..? అనేది మొదటి సందేహం.
ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడుతున్న రజనీ..!
అన్నాడీఎంకేలో రెండు వర్గాలు ఉన్నాయి. ఒకరు రజనీకాంత్ రావాలి..అని కోరుకుంటున్నారు. జయలలిత లేదు. పాలన పట్ల ప్రజల్లో విముఖత పెరిగింది. ఈపీఎస్, ఓపీఎస్ పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో రజనీకాంత్ మాత్రమే అన్నాడీఎంకేను గట్టెక్కించగలరని… బలమైన వర్గం వాదన. రెండో వర్గం దీన్ని అంగీకరించడం లేదు. రజనీకాంత్ విషయంలో అనుమానాలు ఎందుకు వస్తున్నాయంటే… తాను ఎమ్జీఆర్ పాలన తెస్తాననమనడమే కాదు.. స్టెరిలైట్ పరిశ్రమ కాల్పుల్లో మరణించిన వారిని పరామర్శించడానికి వెళ్లి.. ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడారు. తప్పు ఆందోళన కారులదే అన్నట్లుగా .. ప్రభుత్వానికి బహిరంగ మద్దతు తెలిపారు. అదే కమలహాసన్ అయితే ప్రజల తరపున ఉన్నారు. రజనీకాంత్ ప్రభుత్వం తరపున ఉన్నారు. వీటినే ఓ ఇండికేషన్గా భావిస్తున్నారు.
అన్నాడీఎంకేలో చేరితే.. రజనీకి లాభమా..? నష్టమా..?
ఏఐడిఎంకేలో రజనీకాంత్ చేరితే.. ఆయనకు ఏం లాభం ఉంటుంది..? ఆయన పార్టీ పెడతానని ప్రకటించారు. ఓ వేదికను ప్రకటించారు. కానీ పార్టీ నిర్మాణాన్ని ఇంత వరకూ ప్రారంరభించలేదు. జనాకర్షణ అద్భుతంగా ఉన్నా.. ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. అందువల్ల అన్నాడీఎంకేలో చేరితే.. అదో రెడీమేడ్ పార్టీ. కార్యకర్తలు ఉంటారు. నేతలు ఉంటారు. ఆ పార్టీలో చేరితే… పార్టీని నిర్మించాల్సిన అవసరం ఉండదు. అక్కడ ఉన్న నాయకత్వ లోపం కారణంగా.. ఆయనకు టాప్ పొజిషన్ వస్తుంది. అలాగే అన్నాడీఎంకేలో చేరి రజనీకాంత్ కు నష్టం వస్తుందని చెప్పే వాళ్లు కూడా ఉన్నారు. రజనీకాంత్ వస్తే చాలా మంది నాయకులు వెళ్లిపోవచ్చు. టీటీవీ దినకరన్ ఇప్పటికే జయలలిత వారసుడ్నని చెప్పి రాజకీయాలు చేస్తున్నారు. ఆయన వైపు పోవచ్చు. 1996లో జయలలిత గనుక మళ్లీ గెలిస్తే.. తమిళనాడును దేవుడు కూడా రక్షించలేడు అన్నాడు. రజనీ ఆ మాట అనడం వల్లే.. డీఎంకే భారీ మెజార్టీ గెలిచింది. అందు వల్ల అన్నాడీఎంకే కార్యకర్తల్లో, నేతల్లో… రజనీకాంత్ పై అగ్రహం ఉంది. రజనీకాంత్ క్లీన్ పాలిటిక్స్ చేస్తానని మాటిచ్చారు. కానీ ఇప్పుడు అన్నాడీఎంకే నేతలు చాలా మంతి అవినీతి కేసుల్లో ఇరుక్కున్నారు. అలాంటి పార్టీలోకి వెళ్తే ప్రజలు అంగీకరించకపోవచ్చు.