కేసీఆర్‌తో కలిసి.. జగన్ రాజకీయాలు చేస్తున్నారని.. ఏపీలో గెలిచే ఎంపీ సీట్లు ఏమైనా ఉంటే.. వాటిని కేసీఆర్‌కు… కట్టబెట్టేస్తారని… అంతిమంగా బీజేపీకి మద్దతిస్తారని.. టీడీపీ నేతలు ఇంత కాలం తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఇప్పుడు దానికి పవన్ కల్యాణ్ కూడా జత కలిశారు. ఏపీ రాజకీయాలతో.. కేసీఆర్‌కు పనేంటని మండి పడుతున్నారు. చాలా రోజుల పాటు ఈ విమర్శలపై కామ్‌గా ఉన్న జగన్మోహన్ రెడ్డి తొలి సారి స్పందించారు. ఏపీలో వైసీపీ, తెలంగాణలో టీఆర్ఎస్ ఎంపీలు కలిపి ఏపీకి ప్రత్యేకహోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తారమనే వాదన తెరపైకి తెచ్చారు. టీఆర్ఎస్తో కలిస్తే తప్పేమిటని ప్రశ్నిస్తున్నారు.
ఏపీకి ప్రత్యేకహోదాను తీవ్రంగా వ్యతిరేకించిన టీఆర్ఎస్..!:
తెలంగాణ రాష్ట్ర సమితికి… ప్రత్యేకహోదా విషయంలో మొదటి నుంచి ఓ ప్రత్యేకమైన వాదనకు కట్టుబడలేదు. కొన్నాళ్ల క్రితం… ప్రత్యేకహోదా అంశంపై… లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు… టీఆర్ఎస్ మద్దతుగా నిలువలేదు. పైగా… అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా… రోజు వాయిదా పడేలా.. వెల్‌లోకి వెళ్లింది. బీజేపీకి ఇష్టం లేని విషయం కాబట్టి… ఆ అవిశ్వాస తీర్మానం చర్చకు రాకూడదన్న ఉద్దేశంతోనే.. టీఆర్ఎస్ వెల్‌లోకి వెళ్లింది. ఆ తర్వాత బీజేపీతో మరీ అంటకాగుతున్నారనే చర్చ ప్రారంభమవడంతో వెనక్కి తగ్గారు. ఆ తర్వాత వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేశారు. మళ్లీ అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చినప్పుడు కూడా.. పార్లమెంట్లో.. ఏపీకి ప్రత్యేకహోదాపై… టీఆర్ఎస్ మద్దతుగా నిలువలేదు. నిజానికి గతంలో.. ఒకటి, రెండు సార్లు ప్రత్యే్కహోదాకు.. టీఆర్ఎస్ మద్దతిచ్చింది. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో.. సీమాంధ్ర ఓటర్ల మద్దతు కోసం.. ప్రత్యేకహోదా కు మద్దతు ఇస్తామన్నట్లుగా మాట్లాడారు. ఆ తర్వాత మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యేకహోదాపై పూర్తి వ్యతిరేక వాదన వినిపించారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని.. సోనియా గాంధీ మేడ్చల్ సభలో ప్రకటిస్తే.. టీఆర్ఎస్ నేతలు తీవ్రంగా విమర్శలు చేశారు. తెలంగాణ గడ్డపై నుంచి ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని ప్రకటించి.. తెలంగాణ బతుకుల్ని అన్యాయం చేస్తారా అని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తే.. పరిశ్రమలన్నీ తరలిపోతాయని.. ఆగ్రహం వ్యక్తం చేశారు.
మద్దతు కావాల్సిన సమయంలో ఒక్క మాటా మట్లాడలేదు.. !:
ఆంధ్రప్రదేశ్ ప్రత్యకహోదాకు… టీఆర్ఎస్ మద్దతు ఇస్తుందనే… నమ్మకానికి జగన్ రావడానికి ప్రాతిపదిక లేదు. టీఆర్ఎస్ ఎప్పుడూ ఒకే మాట మీద లేదు. నిజంగా ఏపీకి ప్రత్యేకహోదా అంశంపై.. టీఆర్ఎస్కు.. కనీసం సానుభూతి ఉన్నా.. ఒక్క సారి కూడా మద్దతివ్వలేదు. గతంలో… తెలుగుదేశం పార్టీ.. ప్రత్యేకహోదా అంశంపైనే అవిశ్వాస తీర్మానం పెట్టింది. ఆ ఒక్క అంశంపైనే టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టింది. అలాంటప్పుడు.. టీఆర్ఎస్.. ఆ అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వాలి కదా..! కానీ ఇవ్వలేదు. వాస్తవంగా చెప్పాలంటే… ఏపీకి అన్యాయం జరిగింది కాబట్టి.. ప్రత్యేకహోదా ఇచ్చి… కాళేశ్వరం కు జాతీయ హోదా తో పాటు.. విభజన హామీలన్నింటినీ నెరవేర్చాలని అడగాలి. అవి చేయని… ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాసానికి మద్దతిస్తున్నట్లు చెప్పాలి. కానీ చెప్పలేదు. దాంతో.. ప్రత్యేకహోదాకు టీఆర్ఎస్ మద్దతిస్తుందంటే.. నమ్మే పరిస్థితి లేదు.
ఏపీలో ఇన్ని వివాదాలు పెట్టుకుని “హోదా”కు మద్దతెలా ఇస్తారు..?:
ఫెడరల్ ఫ్రంట్ పేరుతో… కూటమి పెట్టాలనుకున్న టీఆర్ఎస్… అధినేత… అందులో భాగంగా.. పార్టీలను సమీకరించాలనుకున్నారు. ఇతర పార్టీల సంగతేమో కానీ.. జగన్మోహన్ రెడ్డిని తన కూటమిలో చేర్చుకునే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా.. కేటీఆర్- జగన్ మధ్య చర్చ జరిగింది. అయితే.. ఈ భేటీని చంద్రబాబు.. సమాయానుకూలంగా మార్చుకున్నారు. ఆ తర్వాత అనేక పరిణామాలు జరిగాయి. జగన్మోహన్ రెడ్డి గెలవాలని.. టీఆర్ఎస్ నేతలు కోరుకుంటున్నారు. వారివ్వాల్సిన గిఫ్టులు ఇస్తున్నారు. కేసీఆర్ దాన్ని రిటర్న్ గిఫ్ట్ అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి.. వెనక్కి వెళ్లే్ పరిస్థితి లేదు. అందుకే…తప్పని సరిగా… డిఫెండ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నిజంగా.. ఎంపీల మద్దతు కావాలంటే… తెలంగాణ కు చెందిన 17 మంది ఎంపీలు చాలా..? కర్ణాటక, తమిళనాడు, ఒడిషా, చత్తీస్ ఘడ్ ఎంపీల మద్దతు అవసరం లేదా..? వీళ్లందరూ కలిసే ప్రయత్నం చేయాలి కదా..! అలా చేయకుండా.. వీరిద్దరూ కలిసి.. 25 ప్లస్ 17 అంటూ లెక్కలేసుకుని… రాజకీయం చేయడం ఏమిటి..? అసలు టీఆర్ఎస్ ప్రత్యే్కహోదాకు ఎలా మద్దతిస్తుంది..? ఇప్పటికే.. కృష్ణా జలాలపై రోజూ పంచాయతీనే నడుస్తోంది. ఇప్పటికీ ఉమ్మడి ఆస్తుల పంపిణీ జరగలేదు. ఇవన్నీ.. ఉండగా… ఏపీకి ప్రత్యేకహోదా కోసం.. తెలంగాణ రాష్ట్ర సమితి వస్తుందని ఆశించడం.. కష్టమే.. !