తెలంగాణలో మహాకూటమి అధికారంలోకి వస్తే.. తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటాయని… టీఆర్ఎస్ నేతలు విస్తృత ప్రచారం చేస్తున్నారు. కేటీఆర్, హరీష్ రావు, కవిత సహా.. అందరూ అదే చెబుతున్నారు. కేటీఆర్ అయితే.. తాగు, సాగునీరు తెలంగాణకు అందకుండా చంద్రబాబు చేస్తారని చెబుతున్నారు. ఓ దిగువ రాష్ట్రం.. ఎగువ రాష్ట్రానికి.. ఎలా నీళ్లు ఆపుతారో ఎవరికీ అర్థం కాదు .. కానీ.. రాజకీయంగా .. ఇలాంటి విమర్శలు చేయడానికి టీఆర్ఎస్ నేతలు… ఏ మాత్రం.. వెనుకాడటం లేదు. ఇలాంటివన్నీ.. చూపించి… టీడీపీ , కాంగ్రెస్ గెలిస్తే… తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటాయని… ప్రచారం చేస్తున్నారు.
తెలంగాణ ప్రయోజనాలను టీఆర్ఎస్ కాపాడిందా….?
తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాటం అన్నది రాజకీయ అంశాలను బట్టి ఉంది. ఆంధ్రప్రదేశ్ విభజన హామీల విషయంలో…బీజేపీ మోసం చేసిందని.. అక్కడ భారీ ఉద్యమాలు జరిగాయి. జరుగుతున్నాయి. రైల్వేజోన్ దగ్గర్నుంచి ప్రత్యేకహోదా వరకూ.. ప్రతీ విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఉద్యమాలు చేశాయి. కానీ.. తెలంగాణంలో మాత్రం.. ఎవరూ పట్టించుకోలేదు. విభజన చట్టం ప్రకారం రావాల్సిన హామీల కోసం కూడా.. అధికార పక్షం ప్రయత్నించలేదు. కనీసం ఇస్తామని చెప్పిన రైల్వే కోచ్ ప్యాక్టరీ గురించి అడగలేదు. కడప ఉక్కు పరిశ్రమ కోసం ఏపీలో ఆందోళన జరుగుతోంది. కానీ బయ్యారం కోసం.. తెలంగాణలో పోరాటం జరగడం లేదు. ఈ నాలుగున్నరేళ్ల కాలంలో… కేసీఆర్.. కేంద్రాన్ని విభజన హామీల విషయంలో ఎందుకు ప్రశ్నించలేకపోయారు..? . కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన.. ఐటీఐఆర్ ప్రాజెక్టు ను.. ఎన్డీఏ రద్దు చేసింది. కానీ టీఆర్ఎస్ మాట్లాడటం లేదు. ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు.. బీజేపీని రాజకీయంగా విమర్శిస్తారు కానీ… గట్టిగా ఎప్పుడూ మాట్లాడలేదు.
తెలంగాణకు నష్టం కలిగితే.. టీడీపీలో ఎవరైనా ఉంటారా..?
నిజానికి ప్రతి రాష్ట్రంలో ఓ జాతీయ ప్రాజెక్ట్ ఉంటుంది. కానీ తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్ట్ కి జాతీయ హోదా కావాలని.. పదే పదే అడిగినా ఇవ్వలేదు. అయినా పట్టించుకోలేదు. అలాగే… పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్ కు .. జాతీయ హోదా ఇస్తామని ఎన్నికల ప్రచారానికి వచ్చిన సుష్మాస్వరాజ్ ప్రకటించారు. అయినా వాళ్లు నిలబెట్టుకోలేదు. దీనిపై టీఆర్ఎస్ అసలు ప్రశ్నించనే లేదు. అలాగే… హైకోర్టు విభజన కోసం.. కనీస ప్రయత్నం చేయలేదు.. ఇలా చెప్పుకుంటూ… పోతే… విభజన హామీలేమీ అమలు కాలేదు. ఎందుకంటే… రాజకీయ అవసరాలే.. తెలంగాణ ప్రయోజనాలకు అడ్డం పడతాయా లేదా అన్నది నిర్ణయిస్తాయి. కాంగ్రెస్, టీడీపీ పొత్తు పెట్టుకుంటున్నాయి. టీడీపీ ఇక్కడ మేజర్ పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీని టీడీపీ శాసించే పరిస్థితి ఉండదు. నిజంగా.. తెలంగాణ ప్రయోజనాలను టీడీపీ అడ్డుకునే పరిస్థితి ఉంటే.. తెలంగాణ టీడీపీలో ఒక్కరు కూడా ఉండరు. చంద్రబాబునాయుడు పార్టీలో ఉన్నా… ఓట్లు వేయాల్సింది.. తెలంగాణ ప్రజలే. అందుకే.. తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వెళ్లరు.
చంద్రబాబు వల్ల నష్టం అనుకుంటే ప్రజలు సీట్లు ఇస్తారా..?
అలాగే… ఏపీ, తెలంగాణకు సంబంధించి ప్రయోజనాల అంశం వచ్చిందనుకోండి… అప్పుడు.. చంద్రబాబునాయుడు ఏపీ వైపు ఉంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం తెలంగాణ వైపే ఉంటుంది. ఒక వేళ… అలాంటి పరిస్థితి వచ్చిందనుకోండి… టీడీపీపై… ప్రభుత్వం ఆధారపడి ఉన్నా కూడా.. కాంగ్రెస్ పార్టీ బయటపడి పోతుంది. టీడీపీతో కటిఫ్ చెప్పి ఎన్నికలకు వెళ్లిపోతుంది. అలా అయితే ప్రజలు ఆదరిస్తారు. చంద్రబాబు కూడా.. ఎన్నికల ప్రచారంలో…. ఎలాంటి వివాదాలు రాకుండా సమస్యలు పరిష్కరించుకుంటామని చెప్పాలి. అంతే కాదు.. ఏమైనా సమస్యలు వస్తే.. పరిష్కరించుకుంటారనే యంత్రాన్ని ఏర్పాటు చేసుకుంటామని చెప్పాలి. అప్పటికి ప్రజలు నమ్మకపోతే.. తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సీట్లు ఇవ్వరు. చంద్రబాబు వల్ల ఎలాంటి ఇబ్బంది లేదనుకుంటే సీట్లు ఇస్తారు. చంద్రబాబు వల్ల ఎలాంటి ప్రమాదం లేదనుకున్నారు కాబట్టే.. గత ఎన్నికల్లో సీట్లు ఇచ్చారు.