పెట్రోల్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి..? అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గినప్పుడు తగ్గించకుండా… పెరిగినప్పుడు రేట్లు ఎందుకు పెంచుకుంటూ పోతున్నారని ప్రజలు ప్రతిపక్షాలు ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉన్నాయి. పెట్రోల్ లీటర్ ధరపై.. సెంట్రైల్ ఎక్సైజ్ ట్యాక్స్.. రూ. 9.48 పైసలు ఉండేది. దాన్ని రూ. 19.48కి పెంచారు. డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం.. కేవలం రూ.3 మాత్రమే ఉండేది. కానీ దాన్ని రూ. 15కి పెంచారు. ఇంత భారీగా ఎందుకు పెంచారు. వంద శాతానికిపైగా సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ భారం పెట్రోల్‌పై ఉంది. సేల్స్ ట్యాక్స్. సెవన్ పర్సంట్ ఉంది. స్వతంత్ర భారతంలో… ఇంత భారీగా పన్ను ఎప్పుడూ లేదు.
ఆయిల్ బాండ్లపై తిరిగి చెల్లింపులు అబద్ధమేనా..?
పెట్రో ఉత్పత్తులపై ఇంత భారీగా పన్నులు విధించడం అన్యాయం కాదా అని అందరూ ప్రశ్నిస్తూంటే .. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు.. పెట్రోలియం మంత్రి, ఆర్థిక మంత్రి.. బీజేపీ అధికార ప్రతినిధులు.. పదే పదే… యూపీఏ హయాంలో.. ఆయిల్ బాండ్లు ఇష్యూ చేశారు. వాటిని చెల్లిస్తూ వచ్చామని చెప్పుకొస్తున్నారు. అంటే యూపీఏ హయాంలో ఆయిల్ దిగుమతుల కోసం అప్పులు చేశారని.. వాటిని చెల్లిస్తున్నామని చెప్పుకొస్తున్నారు. ఎంత అంటే.. దాదాపుగా రూ. 2 లక్షల కోట్లకుపైగా.. ఆయిల్ బాండ్లకు చెల్లింపులు చెల్లించామంటున్నారు. ఇది పచ్చి అబద్దం. దీన్ని చాలా సులువుగా తెలుసుకోవచ్చు. 2014-15 బడ్జెట్లోని అనెక్సర్.. సిక్స్ ఏని చూడండి. ఈ అనెక్సర్ సిక్స్ఏలో ఆయిల్ బాండ్ల వివరాలున్నాయి. అలాగే తాజా బడ్జెట్లోని అనెక్సర్ 2ఏని చూద్దాం.. ! . ఈ రెండు మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు.. ఉన్న ఆయిల్ బాండ్లపై అప్పులు.. అలాగే.. తాజా బడ్జెట్లో ఉన్న ఆయిల్ బాండ్లపై ఉన్న అప్పులు ఎంతో తెలిసిపోతుంది. అలాగే ఎంత వడ్డీ కట్టారో అర్థం కావడానికి మినిస్ట్రీ ఆఫ్ గ్రాంట్స్.. లెటెస్ట్ బడ్జెట్ డాక్యుమెంట్ చూద్దాం. ఈ మూడు డాక్యుమెంట్లను చూస్తే.. కేంద్రం ఎంత పచ్చి అబద్దం చెబుతోందని అర్థమవుతుంది.
వాజ్‌పేయి హయాంలోనూ ఆయిల్ బాండ్లు విడుదల..!
2010 వరకు మన దేశంలో పెట్రోల్, డీజిల్‌పై కొద్దో.. గొప్పో సబ్సిడీ ఉండేది. 2010 నుంచి మార్కెట్‌తో అనుసంధానం చేశారు. అంతకు ముందు… ఆయిల్ కంపెనీలకు కేంద్రం సబ్సిడీ ఇచ్చి తక్కువ ధరకు అమ్మేవారు. ఆయా మార్కెట్ కంపెనీలు.. తక్కువ ధరలకు అమ్మాలి. అలా అమ్మితే నష్టాలొస్తాయి. ఆ నష్టాన్ని కేంద్రం భరించాలి. అలా భరించేందుకు కేంద్రం నిధులు లేవని చెబుతూ.. ఆయిల్ బాండ్లు ఇష్యూ చేసింది. ఈ ఆయిల్ బాండ్లు ఓ రకంగా ఫిక్స్డ్ డిపాజిట్లు లాంటివి. అంటే.. వడ్డీ మాత్రం.. ఏడాదికి చెల్లిస్తూంటారు. అసలు మాత్రం.. అవి మెచ్యూర్ అయినప్పుడే చెల్లిస్తారు. ఒక్క కాంగ్రెస్ మాత్రమే ఆయిల్ బాండ్లు ఇష్యూ చేయలేదు. వాజ్‌పేయి ప్రభుత్వంలో కూడా.. ఆయిల్ బాండ్లు ఇష్యూ చేసింది.
ఆయిల్ బాండ్లపై చెల్లించింది రూ. 3,500 కోట్లు మాత్రమే..!
2014-15 బడ్జెట్లోని అనెక్సర్.. సిక్స్ ఏ ప్రకారం.. అప్పుడు.. రూ. లక్షా 34 వేల 423 కోట్ల మేర ఆయిల్ బాండ్ల ఇష్యూ చేసి ఉన్నారు. అంటే మోడీ అధికారం చేపట్టే నాటికి ఆయిల్ బాండ్ల అప్పులు అన్నమట. ఈ మెత్తం కేంద్రం చెల్లించదు. పదేళ్ల పరిమితితో.. ఈ ఆయిల్ బాండ్లు… మెచ్యూరిటీ అవుతంది. మెచ్యూరిటీ అవదు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లో మాత్రమే కొన్ని బాండ్లు మెచ్యూర్ అయ్యాయి. ఈ బాండ్లు మెచ్యూర్ అయినప్పుడు.. కేంద్రం చెల్లించింది రూ. 3,500 కోట్లు మాత్రమే. ఆ తర్వాత ఒక్కసారి కూడా ఆయిల్ బాండ్లు మెచ్యూర్ కాలేదు. అంటే.. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయిల్ బాండ్ల కోసం చెల్లించినది.. కేవలం రూ. 3,500 కోట్లు మాత్రమే. దీనిపై మరింత స్పష్టత కోసం.. తాజా బడ్జెట్లోని అనెక్సర్ 2ఏని చూద్దాం.. !. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఆయిల్ బాండ్ల లయబిలిటి..రూ. లక్షా 34 వేల 423 కోట్లు ఉంది. ఇప్పుడు రూ. లక్షా 30 వేల 923 కోట్లుగా ఉంది. అంటే అర్థం ఏమిటి..?. ఈ రెండింటి మధ్య తేడా ఎంత.. రూ. 3,500 కోట్లు మాత్రమే. అంటే..మోడీ ప్రభుత్వం.. యూపీఏ ప్రభుత్వ హయాంలో.. చేసిన ఆయిల్ బాండ్ల కోసం.. చెల్లించినది.. కేవలం రూ. 3,500 కోట్లు.
యూపీఏ -1 ప్రభుత్వం కట్టిన దాని కంటే తక్కువే కట్టారు..!
వడ్డీ ఎంత కట్టారో చూద్దాం..! డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ డాక్యుమెంట్స్ చూస్తే.. ఆయిల్ బాండ్లపైన నాలుగేళ్లలో మోడీ ప్రభుత్వం కట్టిన వడ్డీ.. 40 వేల 225 కోట్లు. అసలు వడ్డీ కలిపితే.. రూ. 43, 775 కోట్లు. ఈ నాలుగేళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం ఆయిల్ బాండ్లపై.. కట్టింది .. రూ. 43, 775 కోట్లు. ఈ మొత్తం.. ఒక్క కాంగ్రెస్ హయాంలో జారీ చేసిన ఆయిల్ బాండ్లపై మాత్రమే కట్టలేదు. వాజ్‌పేయి హయాంలో జారీ చేసిన ఆయిల్ బాండ్లపై కూడా వడ్డీ, అసలు కడుతూ వస్తున్నారు. వాజ్‌పేయి హయాంలో జారీ చేయిన ఆయిల్ బాండ్లపై.. యూపీఏ ప్రభుత్వం అసలు, వడ్డీ చెల్లించింది. 2009-10 ఏడాదిలో రూ. 53 , 163 కోట్లు చెల్లించారు. అంటే.. దాదాపు ఎనిమిదేళ్ల కిందట.. కేంద్ర ప్రభుత్వం ఆయిల్ బాండ్లపై కట్టిన దాని కన్నా.. ఇప్పుడు కేంద్రం రూ. 10వేల కోట్లు తక్కువే కట్టింది. అంటే.. కేంద్రంపై గణనీయంగా తగ్గింది.
బడ్జెట్ పేపర్లలోనే పచ్చి నిజాలు..! అయినా అబద్దాలు..!!
ఆయిల్ బాండ్లపై లక్షన్నర కోట్ల అప్పు ఉందని కేంద్రం చెబుతోంది. కానీ కట్టామని చెప్పడం లేదు. ఆ ఆయిల్ బాండ్లు ప్రభుత్వం ఇప్పుడేమీ చెల్లించదు. అవి ఎప్పటికో..నాలుగేళ్లకో.. ఐదేళ్లకో మెచ్యూరిటీకి వస్తాయి. కానీ కట్టినట్లు.. టీవీ చానళ్లకు వచ్చి చెప్పేసుకుంటారు. బడ్జెట్ పేపర్లకు భిన్నంగా.. యూపీఏ ప్రభుత్వ హయాంలో చేసిన అఫ్పులను తీరుస్తున్నామన్నట్లుగా చెప్పుకొస్తున్నారు. ఈ నాలుగేళ్లలో..మోడీ ఆయిల్ బాండ్లపై వడ్డీ, అసలు కోసం కట్టినది రూ. 43వేల కోట్లు. కానీ ఈనాలుగేళ్లలో పెట్రోలియం ఉత్పత్తులపైనా.. వసూలు చేసిన పన్నులు… రూ. 7 లక్షల 49 వేల 485 కోట్లు. అంటే.. దాదాపుగా ఏడున్నర లక్షల కోట్ల పన్నులు వసూలు చేశారు. ఇందులో ఆయిల్ బాండ్లపై కట్టింది… 43వేల కోట్లు. ఆంటే ఆరు శాతం మాత్రమే. మొత్తం పెట్రో ఉత్పత్తులపై వసూలు చేసిన పన్నుల్లో కేవలం ఆరు శాతం మాత్రమే.. ఆయిల్ బాండ్లపై చెల్లించారు. కానీ ఆయిల్ బాండ్ల చెల్లింపుల కోసమే పన్నులు పెంచామని.. కేంద్రం అడ్డంగా అబద్దాలు ఆడేస్తోంది. ఈ బడ్జెట్ పత్రాలన్నీ… ఆన్లైన్లో ఉంటాయి.