జాతీయ రాజకీయాల్లో ఇప్పుడో కొత్త ఫ్రంట్ కు రూపకల్పన జరుగుతోంది. యూపీఏ స్థానంలో కొత్తగా సేవ్ నేషన్ కూటమి వస్తోంది. ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు చొరవ తీసుకుంటున్నారు. ఆయన ఢిల్లీలో జరిపిన సమావేశాల్లో దాదాపుగా బీజేపీకి దూరంగా ఉన్న ప్రాంతీయ పార్టీల నేతలందరూ హాజరయ్యారు. దీంతో.. టీడీపీ నేతలు.. బీజేపీని గద్దె దించే కూటమికి.. చంద్రబాబు రూపకల్పన చేస్తున్నారని చెబుతున్నారు. అయితే అది అంత సాధ్యమవుతుందా అన్న అంశంపై విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి.
బీజేపీని వ్యతిరేకిస్తున్న పార్టీలనే చంద్రబాబు కలిశారా..?
తెలుగుదేశం పార్టీ నాయకులకు ముందు నుంచి ఓ అలవాటు ఉంది. జాతీయ రాజకీయాల్లో తాము కీలక పాత్ర పోషించబోతున్నామని ప్రకటిస్తూ ఉంటారు. చంద్రబాబు కూడా చెబుతూ ఉంటారు. తాను నరేంద్రమోడీ కన్నా..సీనియర్‌నని.. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడే.. వాజ్‌పేయి ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించానని చెబుతూ ఉంటారు. జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు కీలక పాత్ర పోషించిన మాట నిజమే. కాదని ఎవరూ అనరు. కానీ జాతీయ రాజకీయాలన్నీ… చంద్రబాబు చుట్టే తిరుగుతున్నాయని భ్రమ కల్పించడం కరెక్ట్ కాదు. ఆ భ్రమలో టీడీపీ వాళ్లుంటారు తప్ప.. దేశ ప్రజలు ఉండరు. చంద్రబాబు ప్రతిపక్షా ఐక్యత కోసం.. ఇదే మొదటి సారి కాదు. ఇంతకు ముందు చేశారు. ఇక ముందు కూడా చేస్తారు. మిగతా రాజకీయ పార్టీలు వారి వారి రాజకీయ అవసరాలకు అనుగుణంగా స్పందిస్తూ ఉంటాయి. అదే చంద్రబాబు వెళ్లి..నవీన్ పట్నాయక్‌తో మాట్లాడి.. బీజేపీ వ్యతిరేక కూటమివ వైపు తీసుకొస్తే… చంద్రబాబు ప్రత్యేకత ఉంటుంది. అలగే టీఆర్ఎస్ను.. తమిళనాడులోని అన్నాడీఎంకే కూటమిలోకి తీసుకొస్తే.. చంద్రబాబు ప్రత్యేకత గుర్తించవచ్చు. ఇప్పుడు మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, రాజస్థాన్‌లలో కాంగ్రెస్ తో కలిసేలా మాయావతిని ఒప్పిస్తే.. చంద్రబాబు ప్రయత్నాలు ఫలించాయనుకోవచ్చు.
కాంగ్రెస్ నాయకత్వానికి ఆయా పార్టీలు రెడీగా లేవా..?
చంద్రబాబును కలిసిన వాళ్లు… ఆయన కలిసిన వాళ్లు.. బీజేపీకి వ్యతిరేకంగానే ఉన్నారు. చంద్రబాబు వల్లనే కూటమిలోకి వచ్చిన వాళ్లు ఎవరూ లేరు. చంద్రబాబు ఇంత ఎందుకు.. ఇంత వేగంగా.. మార్పులు తీసుకొస్తున్నారనేది… కూడా.. ఆలోచిచాల్సిన విషయమే. ఎందుకంటే.. దీనిలో చంద్రబాబు వ్యూహం కన్నా.. జాతీయ రాజకీయాల్లోని పరిణామాలు.. కారణం అనుకుంది. నిజానికి బీజేపీయేతర పార్టీలన్నింటిని ఏకం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేసింది. విందులు ఇచ్చింది. పార్లమెంట్ లో కలిసి పోరాటం చేశారు. కానీ.. కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నం… ప్రయత్నం కాలేదు. ఎందుకంటే.. కాంగ్రెస్ నేతృత్వంలో ఫ్రంట్ లో చేరడానికి చాలా పార్టీలు ముందుకు రాలేదు. దానికి కారణం.. ఆయా పార్టీలు ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రధాన పోటీదారు కాదు. యూపీ, బెంగాల్, ఏపీలాంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉనికి అంతంతమాత్రమే. అలాంటి చోట్ల… అక్కడ రేసులో ఉన్న పార్టీలు.. కాంగ్రెస్ నేతృత్వంలో పోరాడుతామని చెప్పగలవా…?. అందుకే ఎన్నికల తర్వాత చూసుకుందామన్న పద్దతిలో ఉన్నాయి. అందుకే కాంగ్రెస్ నేతృత్వంలో సాగిన ప్రయత్నాల ఫలించలేదు.
కేసీఆర్ ప్రయత్నాలు ఎందుకు సక్సెస్ కాలేదు..?
అలాగే ఆ తర్వాత… పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రతిపక్షా ఐక్యత కోసం శ్రమించారు. కానీ బెంగాల్లో వామపక్షాలు… ప్రత్యర్థులుగా ఉన్నారు. ఆమె వారిని తీవ్రంగా వ్యతిరేకిస్తారు. జాతీయ రాజకీయాల్లో తృణమూల్ ఎవరితోనైనా కలుస్తుందేమో కానీ.. వామపక్షాలతో కలిసే అవకాశం లేదు. కాంగ్రెస్ కూడా.. మమతా బెనర్జీతో బెంగాల్ లో కలిసేందుకు ఇష్టంలేదు. పైగా.. మమతా బెనర్జీ కూడా ప్రధానమంత్రి పదవి పై ఆశలు పెట్టుకున్నారు. అలాగే… ఆమె ప్రయత్నాలు సక్సెస్ కాకపోవడానికి… మాయావతి, శరద్ పవార్ లాంటి సీనియర్లు ఆమె నాయకత్వాన్ని అంగీకరించకపోవడం మరో కారణం. శరద్ పవార్ అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ వైపు మాట్లాడుతున్నారు. మాయావతికి ప్రాధాన్యం ఇస్తే.. వివిధ రాష్ట్రాల్లో బీఎస్పీ బలపడుతుంది. అఖిలేష్ కి కూడా ప్రయారిటీ ఇవ్వలేరు. గతంలో కేసీఆర్ ఇతర పార్టీల్ని ఏకం చేసే ప్రయత్నం చేశారు కానీ.. ఆయన బీజేపీకి అనుకూలం అని తెలియడంతో… ఎవరూ పట్టించుకోలేదు.
చంద్రబాబు ప్రధాని పదవికి పోటీ కాదని భావిస్తున్నారా..?
చంద్రబాబు ప్రధానమంత్రి పదవికి పోటీ దారు కాదని.. ఇతర ప్రధాన మంత్రి అభ్యర్థులు అనుకుంటున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో 25 సీట్లు మాత్రమే ఉన్నాయి. అదే బెంగాల్, యూపీ, మహారాష్ట్రాల్లో అంతకన్నా ఎక్కువ సీట్లు ఉన్నాయి. అక్కడి పార్టీలే ఎక్కువగా.. లోక్ సభ సీట్లు గెల్చుకునే అకాశం ఉంది. ఈ కారణంగా.. చంద్రబాబు ప్రధానమంత్రి పదవికి పోటీ రారని.. ఆయా పార్టీల నేతలందరూ భావిస్తున్నారు. శరద్ పవార్, మాయావతి, మమతా బెనర్జీ.. ఆ మాటకొస్తే రాహుల్ గాంధీ కూడా అదే అనుకుంటున్నారు. అందుకే.. ప్రతిపక్షాలను ఏకం చేయడంలో.. ఇతర నేతలకుకు ఉన్న పరిమితుల వల్ల.. చంద్రబాబు చేసిన ప్రయోగానికి .. విస్తృత ప్రచారం లభించింది. అంతే తప్ప.. చంద్రబాబు వల్లే విపక్షాలన్నీ ఏకమవుతున్నాయని.. అనుకోవడం అత్యుత్సాహమే అవుతోంది. చంద్రబాబు కూడా… తాను ప్రధానమంత్రి పదవి కోసం కాదని… డెమెక్రటిక్.. పలిటికల్ కంపల్సన్ కోసమని చెబుతున్నారు. అది కరెక్ట్.